22, ఆగస్టు 2011, సోమవారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 5 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 5 - భండారు శ్రీనివాసరావు




ఏ రోడ్డు చరిత్ర చూసినా ......



రోడ్లపైన వరదలా చేరు వాన నీరు
కాలు జారు ప్రమాదాలు అడుగడుగున జోరు
ఒక్క వాన మాత్రంతో రోడ్లతీరు మారు
సైడు కాల్వలుప్పొంగి ఏకమయ్యి పారు

(జూన్, 24, 1975, ఆంధ్రజ్యోతి దినపత్రిక)



కలవని జంట



అద్దానికి దువ్వెనకు వివాదాలు జాస్తి
ఆ రెంటిని  మా ఇంటిలో  కలపాలని చూస్తి
ఎడమొగం పెడమొగం కలవదాయె దోస్తీ
సమయానికి కలిసుంటం ఆ రెంటికి నాస్తి

(జూన్, 19, 1975, ఆంధ్రజ్యోతి దినపత్రిక)

కార్టూనిస్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత

3 కామెంట్‌లు:

చదువరి చెప్పారు...

అ మొదటి ఫొటో ముప్పైఐదేళ్ళ తరవాత, ఇవ్వాళ కూడా మన రాజధానికి సరిపోతుంది.

చదువరి చెప్పారు...

మొదటి పద్యం కూడా ఇప్పటి పరిస్థితికి సరిపోతుంది.
అన్నట్టు ఆ ఫోటో కూడా అప్పటిదేనాండి?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@చదువరి - ధన్యవాదాలు. లేదండీ. ఆ రోజుల్లో ఆంధ్ర జ్యోతి ఆర్టిస్ట్ రమణ నా వాక్టూన్లకు తన కార్టూన్లు జోడించేవారు.- భండారు శ్రీనివాసరావు