మగవారికి మాత్రమే!
చట్టానికి మనసుంది
“రెండో పెళ్లి చేసుకోవడానికి మగవారిని అనుమతించక పోవడానికి కారణం ?”
“ఎందుకంటే ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష విధించడానికి చట్టం ఒప్పుకోదు కాబట్టి.”
మార్గం
“చిరకాలం జీవించడానికి ఏదయినా మార్గం వుందా డాక్టర్?”
“పెళ్లి చేసుకుని చూడండి”
“పెళ్లాడితే ఎక్కువ కాలం జీవించడం సాధ్యపడుతుందంటారా డాక్టర్?”
“అల్లా అని కాదు. కాకపొతే ఒక్కసారి పెళ్లి చేసుకున్న తరువాత చిరకాలం జీవించాలనే కోరిక దానంతట అదే తగ్గిపోతుంది.”
కరచాలనం
“పెళ్లి సమయంలో వధూవరులులిద్దరు ఒకరి చేయి మరొకరు గట్టిగా పట్టుకుంటారెందుకు?”
“మల్లయుద్ధంలోకి దిగేముందు యోధులిద్దరూ కరచాలనం చేసుకోవడం మామూలే కదా ”
మౌనం
“ఏమండీ! ఇవాళ మన పెళ్లి రోజు. కొత్తరకంగా జరుపుకుంటే ఎలావుంటుందంటారు?”
“కరక్టుగా చెప్పావు. లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటిస్తే సరి”
లీల
“భగవంతుడి లీలలను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అందమయిన అమ్మాయిలను సృష్టించేది ఆయనే. మళ్ళీ వాళ్ళను భార్యలుగా మార్చేదీ ఆయనే.”
పెళ్ళికి ముందు ప్రేమించుకునే రోజుల్లో తాను చెప్పేది తన్మయంగా వింటూ రాత్రంతా గడిపే మగవాడు - పెళ్ళయిన తరువాత తను మాట్లాడడం మొదలు పెట్టకముందే ఎందుకు గుర్రు పెడతాడన్నది ఇంతవరకు ఏ ఆడపిల్లకు అర్ధం కాని విషయం.
నగదు బదిలీ
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా క్షణాల మీద నగదు బదిలీ చేయవచ్చు. అంతకంటే త్వరగా చేయాలంటే మాత్రం ఒకే ఒక మార్గం పెళ్లి చేసుకోవడం.
రుచి
చాకొలెట్ల రుచి చాకొలెట్లదే. ఆడ స్నేహితులు అలాటివాళ్ళే . ఎప్పుడు తిన్నాఅవి తియ్యగానే వుంటాయి.
ప్రేమికులు పిజ్జాల మాదిరి. తరచుగా తినాలనిపిస్తుంది. ఎప్పుడయినా అవి వేడివేడిగా, కారం కారంగా వుంటాయి.
ఇక భర్తలు మాత్రం, వేరే గతి లేదన్నప్పుడు తినే పప్పన్నం లాంటి వాళ్ళు.
నో ఛాన్స్ ప్లీజ్
దూర దేశంలో వున్న భర్తకు భార్య తాలూకు వాళ్ళనుంచి ఫోను వచ్చింది.
“మీ ఆవిడ చనిపోయింది. నువ్వు వచ్చేంతవరకు ఆగడానికి వీలుండదు. ఆమె శవాన్ని పూడ్చి పెట్టాలా లేక దహనం చేయాలా?”
“ముందు దహనం చేయండి. తరువాత ఆ బూడిదను గొయ్యితీసి పాతి పెట్టండి. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లోను ఎలాటి ఛాన్స్ తీసుకోవద్దు.”
కల్పితం
“మీ షాపులో ‘భార్యలను అదుపులో పెట్టడం ఎలా?' అనే పుస్తకం వుందా?”
“కల్పితాలు, ఊహాగానాలతో రాసే పుస్తకాలు అమ్మే విభాగం ఆ పక్కన వుంది. వెళ్లి కనుక్కోండి”
తధాస్తు దేవతలు
“నన్ను నమ్ము రాధా! నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నీ కోసం నరకానికి వెళ్ళ డాని కయినా సిద్ధమే.”
పైనున్న దేవతలు తధాస్తు అన్నారు. రాధను పెళ్ళాడిన తరువాత అతడి జీవితం నిజంగానే నరకంగా మారిపోయింది.
6 కామెంట్లు:
మల్లయుద్ధంలోకి దిగేముందు యోధులిద్దరూ కరచాలనం చేసుకోవడం మామూలే కదా
:D
ha ha ha
nice
Ha Ha Ha A lot of them are awesome :-)).
"మల్లయుద్ధంలోకి దిగేముందు యోధులిద్దరూ కరచాలనం చేసుకోవడం మామూలే కదా "
"భగవంతుడి లీలలను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అందమయిన అమ్మాయిలను సృష్టించేది ఆయనే. మళ్ళీ వాళ్ళను భార్యలుగా మార్చేదీ ఆయనే.”
"కల్పితాలు, ఊహాగానాలతో రాసే పుస్తకాలు అమ్మే విభాగం ఆ పక్కన వుంది. వెళ్లి కనుక్కోండి”
"ఇక భర్తలు మాత్రం"--Shouldn't that be baaryalu, in place of bhartalu?
“పెళ్లి సమయంలో వధూవరులులిద్దరు ఒకరి చేయి మరొకరు గట్టిగా పట్టుకుంటారెందుకు?”
జవాబు:
“మల్లయుద్ధంలోకి దిగేముందు యోధులిద్దరూ కరచాలనం చేసుకోవడం మామూలే కదా ”
--------
ఎంత బాగుందో
@Indian Minerva,అజ్ఞాత,తులసి,KumarN,Rao.S.Lakkaraju - Thanks and ధన్యవాదాలు -భండారు శ్రీనివాసరావు
కామెంట్‌ను పోస్ట్ చేయండి