16, జనవరి 2010, శనివారం
మార్పు చూసిన కళ్ళు (మాస్కో అనుభవాలు -ఏడో భాగం ) - భండారు శ్రీనివాసరావు
స్త్రీ బాలవృద్దులదే హవా!
అక్కడ అన్ని విషయాల్లో పెద్దపీట స్త్రీబాలవృద్ధులదే.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తుపాకి పట్టగలిగిన ప్రతి ఒక్క మగవాడినీ- వయస్సుతో నిమిత్తం లేకుండా యుద్ధరంగానికి పంపిన కారణంగా - దేశాన్ని నడిపేందుకు మహిళల తోడ్పాటు అవసరమయిందని చెప్పుకుంటారు. ఆ రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని ప్రత్యెక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ వారికి సమకూర్చింది. చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్ళు మనవద్ద మాదిరిగా ప్లాటు ఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపు కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిపే పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చా జీవితానికి ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా యిరవయి ఏళ్ళు నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు 'పండగనాడుకూడా పాత మొగుడేనా ' అనే వారి సంఖ్య పెరిగింది.
సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత పెళ్ళాంతోనూ, పాత పెళ్ళాం కొత్త మొగుడితోనూ కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో కొన్నాళ్ళపాటు నివసించాల్సిన పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని సరదాగా చెప్పుకునేవారు. అయితే అక్కడ ' ఏకపతీవ్రతం ' చేస్తున్న ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. పిలిపెంకో అనే ఎనభై ఏళ్ళ 'యువకుడితో' మా కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆయన గారి ఏకైక భార్య గత కొన్నిదశాబ్దాలుగా ఆయనగారితోనే కాపురం చేస్తోంది. ఒకే మొగుడితో కాపురం అన్న సూత్రమే ఆవిడనూ, మా ఆవిడనూ జత కల్పిందని పిలిపెంకో మహాశయులవారి అభిప్రాయం. చివరికి ఈ అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే మేము ఇండియా తిరిగి వచ్చినతరవాత కూడా ఆ పిలిపెంకో దంపతులు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో వారం రోజులు వుండి వెళ్ళారు. గమ్మత్తేమిటంటే నాకూ, మా ఆవిడకు రష్యన్ తెలియదు. వారిద్దరికీ వాళ్ళ భాష తప్ప మరోటి తెలియదు.అయినా అనుబంధానికి ఇది అడ్డంకే కాలేదు. కాకపొతే -
మా పిల్లలే మాకు దుబాసీలు. మాస్కోలో కూడా.
ఇక- చిన్న పిల్లల విషయానికి వస్తే -
ఆ దేశం వారి పాలిట స్వర్గం. వారు ఆడింది ఆట, పాడింది పాట. చదువయిన సంధ్యయినా వారి అభిరుచి ప్రకారమే. మా అబ్బాయిని డాక్టర్ ని చేద్డామనుకుంటున్నాము, మా అమ్మాయిని ఇంజినీరు చదివిద్దామనుకుంటున్నాము అంటే అక్కడ కుదరదు. చిన్న తరగతుల స్తాయిలోనే వారి వారి అభిరుచులను కనుగొనే పరీక్ష - (ఇంగ్లీష్ లో యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు)- పెట్టి ఆ విద్యార్ధి డాక్టర్ అవాలనుకుంటున్నాడో, ట్రాక్టర్ డ్రైవర్ కావాలనుకుంటున్నాడో - తెలుసుకుని ఆ కోర్సులో చేర్పిస్తారు. ఇందులో తలిదండ్రుల ప్రమేయం ఏమాత్రం వుండదు. చదివించే భాద్యత కూడా సర్కారుదే కావడంవల్ల, డాక్టరుకూ, ట్రాక్టర్ డ్రైవర్ కూ జీతభత్యాలలో పెద్ద తేడాలు లేకపోవడంవల్ల , వారికీ అభ్యంతరాలు వుండవు. మరో విచిత్రమయిన సంగతేమిటంటే జననాలను ప్రోత్సహించడం. యెంత ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు అంత ఎక్కువగావుంటాయి. పదిమందికి పైగా పిల్లల్ని కన్న సంతాన లక్ష్ములను జాతీయ అవార్డులతో సత్కరి స్తుంటారు. గర్భవతులయిన ఉద్యోగినులకు , గర్భం ధరించిన సమాచారం తెలిసినప్పటినుంచి ,సుఖ ప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడి బుడి నడకలు నడిచే వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు మంజూరు చేస్తారు. ఆ పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయ్యేవరకు ప్రభుత్వం వారికి కల్పించే రాయితీలూ, సదుపాయాలూ కనీ వినీ ఎరుగనివి.
దేవుడి మీద నమ్మకం లేని దేశంలో పిల్లలే దేవుళ్ళు - నమ్మలేని ఈ నిజం గురించి మరో సారి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 కామెంట్‌లు:
సర్ మీ ఈ ఆర్టికల్ చాలా రెగ్యులర్ చదూతున్నపుడు సడన్గా గుర్తు వచ్చింది..నేను 7 లేదా 8 వ తరగతి చదూతున్నపుడు రేడియొ మాస్కో రెగ్యులర్ గా ఫాల్లో అయ్యెవాదిని అప్పటినుంచీ కూడా నాకు రష్యా అంటే చాలా ఆసక్తి గా వుండేది..
dear sri kvsv
naa anubhavam koodaa meelaantide. meelaagaane moscow radio vintu vundevaadini. yedo okaroju akkade panicheyaalsi vastundani aa roullo nenu oohinchaledu. dabbu vunte ye desaanikayinaa poyiravacchu. kaanee moscow choodadam annadi dabbunnaa saadhyam kaadu kadaa.-bhandaru
sir, మీరు చెప్పినది నిజం.అప్పటిలో ఒక పత్రిక కూడా వచ్చేది..పేరు గుర్తులేదు vizag విశాలంద్ర బుక్ షాప్ లో అనుకుంటా దొరికేధి,అప్పటినుంచీ కూడా రస్యన్ల లైఫ్ గురించి ఒక అవగాహన వుండేది,ప్రజలు ఏ విధమైన జీవితం కోరుకుంటారో అక్కడి ప్రబుత్వం వారికి అందించింది..కానీ తర్వాతి పరిణామాలు నన్ను చాలా నిరాశ పరిచాయి..ఏమయినా గానీయండి అప్పటి సొవియట్ యూనియన్ ఒక అద్బుతమ్..
dear sri kvsv
bahusa aa patrika 'soviet bhoomi' anukuntaa. daanilo prachurinche articles, russia gurinchina colour photolu andarnee yento aakattukunevi.-bhandaru srinivasrao 11.42.(near midnight)on saturday night(16-01-2010)IST
Sri Bandaru Srinivas Rao Garu!
I have a small request. Plz. Consider it.
Russia was not a Communist Country, they didn't have communist govt.
Just it was the Socialism. But their destiny was, is & will Communism.
Communism is a highest civilised society, where man's social evolution wolud be completed. So far no country could enter in communism.That would be golden threshold for entire man kind.
(...this according my knowledge)
104............n arva nasnamu chesina varu..........anta mee snehitule...........ivala oka t.v channel lo vyakhya rasinanta matra..........vari paapalu karigi povi.......kalamunna meeru..........dammunte malli.........104 ni revive cheyyandi..........pramukha paatrikeyusuga mee satta chupinchandi...........channel lo debate ki randi..........akkada everu em chesaro.........naa daggra sakshadharalunnayi........prof dr sangram..........consultant infectios diseases........outsourced projects of w.h o...geneva.................
104............n arva nasnamu chesina varu..........anta mee snehitule...........ivala oka t.v channel lo vyakhya rasinanta matra..........vari paapalu karigi povi.......kalamunna meeru..........dammunte malli.........104 ni revive cheyyandi..........pramukha paatrikeyusuga mee satta chupinchandi...........channel lo debate ki randi..........akkada everu em chesaro.........naa daggra sakshadharalunnayi........prof dr sangram..........consultant infectios diseases........outsourced projects of w.h o...geneva.................
Shri Srinivas Rao Garu.
It is my pleasure to introduce myself as
Shankar (Grandson of Journalist Shri G.Krishna) TATTAYA gurinchi mee blog lo
Mention checinanduku my sincere thanks.
9849387829
కామెంట్‌ను పోస్ట్ చేయండి