29, ఏప్రిల్ 2019, సోమవారం
Did Really Parties Can Manage Counting Results in AP? | The Debate With ...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 TV News Channel Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రాజశేఖరరెడ్డి (వైసీపీ), శ్రీ భాను ప్రకాష్ రెడ్డి (బీజేపీ), శ్రీ చెరువు రామకోటయ్య (టీడీపీ), శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్)
Did AP CM Chandrababu Naidu try to Stop RGV Lakshmi's NTR Movie In AP? |...
రాజశేఖరరెడ్డి (వైసీపీ), శ్రీ భాను ప్రకాష్ రెడ్డి (బీజేపీ), శ్రీ చెరువు
రామకోటయ్య (టీడీపీ), శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్)
28, ఏప్రిల్ 2019, ఆదివారం
చంద్రబాబు టార్గెట్ గా ఐదేళ్ల తవ్వకాలు? | News Scan LIVE Debate With Vij...
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం టీవీ 5 ఛానల్లో ఎక్జిక్యూటివ్ ఎడిటర్ విజయ్ నారాయణ్ నిర్వహించిన న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమంలో చెప్పిన మాట:
“ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా మబ్బులు కమ్మేశాయి. వాటి చాటున దాగున్న రాజకీయ చిత్రం అస్పష్టంగా కనిపిస్తోంది. ఆకాశంలోమబ్బుల్లోకి చూస్తే వాటిలో ఒకరికి ఏనుగు ఆకారం కనిపిస్తుంది. మరికొందరికి అదే మబ్బులో మరో ఆకారం కనబడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరికించేవారికి కూడా విభిన్నమైన చిత్రాలు కనబడుతున్నాయి. రాజకీయపు పొరలు తొలగించుకుని చూస్తే వాస్తవమైన రాజకీయ చిత్రం గోచరిస్తుంది”
ఈచర్చలో నాతోపాటు శ్రీ కుటుంబరావు (టీడీపీ, అమరావతి నుంచి), శ్రీ రఘురాం (ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో) పాల్గొన్నారు.
మహాభారతంలో కూటనీతి
పేరుకు తగ్గట్టే మంచి రాజుకు ఉండాల్సిన
సుగుణాలు అన్నీ కురుసార్వభౌముడు సుయోధనుడికి వున్నాయి. అయితే, అతడి దురదృష్టం, అసూయ అనే దుర్గుణం ఒక్కటే అతగాడి వినాశనానికి హేతువు అయింది.
దాయాది ధర్మరాజు నిర్వహించిన రాజసూయ
యాగానికి వెళ్లి వచ్చిన తర్వాత అతడిలో ఈ మత్సరం మరింతగా వెర్రి తలలు వేసింది. లక్కఇంటిని తగలబెట్టి పంచపాండవులను
హతమార్చాలనే పన్నాగం బెడిసి కొట్టడంతో దుర్యోధనుడిలోని అసూయాద్వేషాలకు అంతం
లేకుండా పోయింది.
ఈ నేపధ్యంలో కౌరవ సలహాదారులలో ఒకడయిన
కణికుడు దుర్యోధనుడికి ఇచ్చిన సలహాలు కూటనీతి పేరిట ప్రాచుర్యం పొందాయి.
ప్రత్యర్ధుల పీచమణచడానికి ఉద్దేశించిన ఈ కుటిల పన్నాగాలకు సంబంధించి మహాభారతంలో ఏకంగా ఒక అధ్యాయమే వుంది.
కాకతాళీయమో ఏమో తెలియదు కానీ ఈనాటి రాజకీయులు కణికుడు బోధించిన ఆ కూటనీతినే
పాటిస్తున్నట్టు అనిపిస్తుంది.
ఆ కూటనీతి ప్రకారం రాజు అనేవాడు శత్రురాజుపై
హమేషా ఓ కన్నేసి ఉంచాలి. తనకు నమ్మకస్తులైన సాటి రాజులను వైరి రాజుకు అనుకూలంగా
మాట్లాడేటట్టు చేయాలి.
దేశ సంచారం చేసే కొంతమంది పండిత
శ్రేష్టులను మచ్చిక చేసుకుని వారి ద్వారా ఇరుగుపొరుగు రాజ్యాల్లో తన మంచితనం
గురించి, తన సామర్ధ్యం గురించి తన సుపరిపాలన గురించి సానుకూల ప్రచారం ప్రజాబాహుల్యంలోకి
చొచ్చుకు పోయేలా చేయాలి.
విశ్వాసపాత్రులయిన తన సొంత మనుషులను కొంతకాలంపాటు శత్రు దేశపు రాజు కొలువులో చేర్పించి
వారి ద్వారా అతడి లోగుట్లను, బలహీనతలను గురించిన సమాచారం తనకు ఎప్పటికప్పుడు
అందేలా ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు వైరి ప్రభువుల ఎదుట తనను తూలనాడుతూ ఆ రాజు నమ్మకాన్ని
చూరగొనేలా చూసుకోవాలి.
ఇలా అనేకానేక బోధలు ఈ కూటనీతిలో
వున్నాయి.
అవన్నీ ఆ గాంధారిసుతుడు ఎన్ని ఏమేరకు
ఆచరించాడో లేదో తెలియదు కానీ మహాభారతంలో పేర్కొన్న ఆ కూటనీతి శాస్త్రాన్ని ఈనాటి
రాజకీయ నాయకులు పుణికి పుచ్చుకుని అక్షరం పొల్లు పోకుండా ఆచరణలో పెడుతున్నారు.
‘ఎందుకైనా మంచిది అతడిపై ఓ కన్నేసి
ఉంచు’ అంటుంది సినిమాలో ఓ దుష్ట పాత్ర. ‘ఒక కన్నేమిటి రెండు కళ్ళూ అతడిమీదనే’
అంటుంది అతడి సహాయక దుష్టపాత్ర.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా
వున్నప్పుడు అసెంబ్లీ లాబీ విశేషాలు సేకరించే విలేకరులు కొందరు లాబీలో ఒక చోట చేరి
ఆ వైపుగా వచ్చిన ఒక మంత్రితో పిచ్చాపాటీ మాటలు కలిపారు. మూడు దశాబ్దాల అనుభవం వున్న
ఓ సీనియర్ పాత్రికేయుడు హాస్యోక్తిగా ఆయనపై ఓ వాక్బాణం విసిరి అందరూ పెద్దగా
నవ్వుతుండగా మెల్లగా నడుచుకుంటూ దగ్గరలో వున్న ముఖ్యమంత్రి చాంబర్లోకి వెళ్ళాడు.
అతడ్ని చూస్తూనే ముఖ్యమంత్రి ఒక చిరునవ్వు
నవ్వి, ‘ఏమిటి మా మంత్రిని అలా ఆట
పట్టిస్తున్నావ్’ అని అడిగారు. జరిగి నిమిషాలు కూడా గడవక ముందే ఈ విషయం సిఎం చెవులకు ఎవరు చేరవేసారా
అని ఆశ్చర్య పోవడం ఆ విలేకరి వంతయింది.
అలా పనిచేస్తాయి ప్రభుత్వ నిఘా
వర్గాలు. టెర్రరిస్టులు, అసాంఘిక శక్తుల కదలికలు కనిపెట్టి వారి ఆనుపానులు సంబంధిత
అధికార వర్గాలకు అందచేయడం వారి ప్రాధమిక బాధ్యత. కానీ వాళ్ళు ఎక్కువగా దృష్టి
సారించేది ప్రత్యర్ధి పార్టీల నాయకుల మీద. నిఘా విభాగంలో పనిచేసిన అధికారే మరో
విశేషం ఓ సందర్భంలో చెప్పారు. తన సొంత పార్టీ
నాయకుల గురించిన సమాచారం మీదే ఎక్కువమంది ముఖ్యమంత్రులు ఆసక్తి చూపేవారట.
అలా మహాభారత కాలంనాటి ఆ కూటనీతి ఈ
కాలంలో ఇలావూడలు దిగి విస్తరిస్తోంది.
ఏపీ - వింత పుంతల రాజకీయం
అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది?
ఈ నెల పదకొండో తేదీన ఎన్నికలు జరిగాయి.
సీళ్లు వేసి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన ఈవీఎం లలో ఓటర్ల తీర్పు భద్రంగా వుంది.
ఆ రోజు నుంచి నలభయ్ నాలుగో రోజున అంటే వచ్చే నెల ఇరవై మూడో తేదీన వాటిని వెలుపలకు
తీసి ఓట్లు లెక్కించి ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు.
ఇదీ జరగాల్సిన విధి విధానం. కానీ
జరుగుతున్నది ఏమిటి?
పోలింగ్ పూర్వపు రాజకీయ వాతావరణమే పోలింగ్
అనంతరం కూడా కొనసాగుతోంది. అసలక్కడ ఎన్నికలు జరిగాయా లేక ముందు ముందు జరగబోతున్నాయా
అనే రీతిలో ఆయా రాజకీయ పార్టీల ఉపన్యాసాలు, వ్యాఖ్యలు, విమర్శలు ఆరోపణలు
అవిచ్చిన్నంగా సాగిపోతున్నాయి. న్యాయమూర్తి
తన తీర్పును రిజర్వ్ చేసినట్టు ప్రకటించిన తరువాత కూడా న్యాయవాదులు తమ
వాదప్రతివాదాలు కొనసాగిస్తున్న పద్దతిలో ప్రజాతీర్పు ఖరారు ఆయన తర్వాత సైతం ప్రజల
తీర్పును కోరే రీతిలో రాజకీయ పార్టీల మాటలు, చేతలు సాగుతున్నాయి.
అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలు
సవ్యంగా జరగలేదని ఆరోపించడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. ఎన్నికల
ఏర్పాట్ల పట్ల సహజంగా అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఆ విషయంలో
నోరు మెదపక పోవడం కూడా బహుశా ఇదే మొదటిసారేమో!
ఎన్నికల కోడ్ అమల్లో వున్నప్పుడు
అధికారులను ఆ స్థానాల నుంచి తాత్కాలికంగా తప్పించడం మొదటిసారి కాదు. గతంలో డీజీపీలను
మార్చిన సందర్భాలు వున్నాయి. ఈసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేతాను పక్కన
బెట్టి మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్.వీ. సుబ్రహ్మణ్యం ను ఆస్థానంలో నియమించడం వివాదాస్పదం అయి కూర్చుంది.
నీతి నిజాయితీ, నిబద్ధతల విషయంలో ఈ ఇద్దరు అధికారులు ఎవరికీ తీసిపోరు. కానీ కొత్త సీఎస్
తమ ప్రభుత్వానికి అనుకూలుడు కారు అనే అనుమానం పాలకపక్షం టీడీపీ నాయకుల్లో వుంది.
స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఈ
విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఆ అధికారిని అనకూడని మాట అన్నారు. అధికారులతో పేచీ
పెట్టుకోవడం చంద్రబాబు స్వభావం కాదని
ఆయన్ని బాగా ఎరిగిన వాళ్ళు చెబుతారు. ఏదో నోరు జారింది అనుకోవడానికి వీల్లేకుండా
ఆయన ఆ వ్యాఖ్యను పదేపదే పునరుద్ఘాటిస్తూ పోతున్నారు.ఇక టీడీపీ పార్టీ నాయకుల సంగతి
చెప్పేది ఏముంది? నాయకుడే ఆ వ్యాఖ్యను సమర్దిస్తున్నప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? మరో
రెండు సమిధలు వేసి ఆ వివాదాగ్ని చల్లారకుండా చూస్తున్నారు.
అటూ ఇటూ రాజకీయమే అయినప్పుడు వివాదాలు
పెరుగుతూ పోతాయే కాని అవి సమసిపోయే సమస్యే వుండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు
పరిష్కారం కంటే వివాదం కొనసాగింపునే ఎక్కువగా కోరుకుంటాయి.
ఈ క్రమంలో వెలుగులోకి వచ్చినవే వీవీ
పాట్ల లెక్కింపు, స్ట్రాంగ్ రూముల భద్రత, మరి కొందరు అధికారులను మార్చాలనే
డిమాండ్లు. మామూలుగా అయితే ఇవి పెద్ద వివాదాంశాలు కాదు. వీవీ పాట్ల విషయంలో
సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశమే వుంది. స్ట్రాంగ్ రూముల భద్రత పట్ల సందేహాలు
సహేతుకమనిపించుకోవు. ఈవిషయంలో ఏవైనా అనుమానాలు వుంటే అవి ప్రతిపక్షాలకు వుండాలి.
విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్తితి భిన్నంగా వుంది. అక్కడ పాలకపక్షం అయిన
టీడీపీ వీటిని వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతిపక్షం, కేంద్రంలోని మోడీ
ప్రభుత్వం కలిసి కేంద్ర ఎన్నికల సంఘంపై
ఒత్తిడి తెచ్చి తమకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగట్టే క్రమంలో ఈ
సందేహాలు వ్యక్తం చేస్తున్నామన్నది ఆ పార్టీ వాదనగా వుంది.
ఈ సారి ఎన్నికల కోడ్ అమల్లో వుండే సమయం
ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘంగా ఉన్నమాట వాస్తవమే. దాదాపు మండలం పాటు పాలక పక్షం కానీ,
మంత్రులు ముఖ్యమంత్రి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదనే నియమాన్ని సాంప్రదాయంగా
పాటిస్తూ వస్తున్నారు. అయితే ఇంత సుదీర్ఘ కాలం సమీక్షలు, నిర్ణయాలు తీసుకోలేని
పరిస్తితిని ఏ మేరకు అనుమతించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాల పరిమితి
ముగియనప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోకుండా వుండడం సాధ్యమయ్యే
విషయమేనా అన్నది పాలకపక్షానికి వస్తున్న ధర్మసందేహం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు అసలు అన్ని అధికారాలు కలిగిన ముఖ్యమంత్రా లేక ఆపద్ధర్మ
ముఖ్యమంత్రా అనే చర్చ కూడా మొదలయింది. రాజ్యాంగం ప్రకారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా
పేర్కొనేందుకు అవకాశం లేదు. సరే!మరి ఆయన
పూర్వం మాదిరిగా అంటే కోడ్ అమల్లోకి రాక ముందు మాదిరిగా అన్ని నిర్ణయాలు
తీసుకోవడం, అధికారులతో సమీక్షలు నిర్వహించడం సరైనదేనా అంటే చప్పున కాదని జవాబు
చెప్పే పరిస్తితి లేదు.
ప్రస్తుతం చంద్రబాబునాయుడు ఆపద్ధర్మ
ముఖ్యమంత్రి కాని మాట వాస్తవమే కాని ఆయన కానీ ఆ మాటకు ఏ ముఖ్యమంత్రి అయినా సరే
పాటించాల్సిన ధర్మం ఒకటుంది. ఈ ధర్మాలు నిబంధనావళిలో వుండవు. పాలకులు ఎవరికి వారు
ధర్మనిష్టతో పాటించాల్సిన ధర్మాలు కొన్ని వుంటాయి. పోలింగు పూర్తయి, ప్రజాతీర్పు వెలువడక పూర్వం,
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో వున్న సమయంలో ఏ మేరకు సమీక్షలు చేయవచ్చు, ఏ మేరకు నిర్ణయాలు
తీసుకోవచ్చు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనేది వారికి వారే నిర్ణయించుకోవాలని
ధర్మం చెబుతుంది. అది పాటించినంత కాలం ఎవరూ ఆ నిర్ణయాలను తప్పుపట్టే పరిస్తితి ఏర్పడదు.
సుదీర్ఘ పాలనానుభవం కలిగిన చంద్రబాబునాయుడికి ఎన్నికల నిబంధనలు ఏమి చెబుతున్నాయో తెలియవని అనుకోలేం. బహుశా ఈ
ఎరుక కలిగిన మనిషి కనుకనే ముందుగా ప్రకటించిన లేదా మీడియాలో వచ్చిన శాంతిభద్రతల
వంటి కొన్ని సమీక్షలను రద్దు చేసుకున్నారని కూడా అనుకోవాలి.
అయితే రాజకీయ నాయకులు కొందరికి సర్వం
తెలిసినా రాజకీయాల కోసం కొన్ని మాటలు చెప్పక తప్పదు. అందుకే ఆయన కానీ, ఆయన సహచరులు
కానీ ఈ సమీక్షల విషయాన్ని ఒక పెద్ద అంశంగా మార్చి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారేమో!
ముందే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు బాగాలేవనే చెప్పాలి. అధికారంలోకి రావడం ఎలా, వచ్చిన
అధికారాన్ని మరో మారు దక్కించుకోవడం ఎలా అనే రాజకీయ శక్తుల నడుమ సాగుతున్న పోరాటంలో విలువలు
వెనక్కి పోయాయి. ధర్మబద్ధంగా విజయాన్ని కైవసం చేసుకోవడం అనేదాన్ని పక్కన బెట్టి ఏ విధంగానయినా సరే గెలిచి తీరాలి అనే పట్టుదలలు,
పంతాలు పెరిగిపోవడం వల్లనే ఇన్ని రకాల రాజకీయపుటెత్తులు, వ్యూహాలు, ప్రతి
వ్యూహాలు. పన్నుగడలు, పన్నాగాలు.
ఇది అవసరమా అంటే, మీకూ నాకూ
కాకపోవచ్చు, కానీ రాజకీయులకు అవసరమే!
లేబుళ్లు:
ఏపీ - వింత పుంతల రాజకీయం
27, ఏప్రిల్ 2019, శనివారం
Discussion | Chandrababu Writes Letter To EC Over Restrictions in AP | P...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఆంద్ర జ్యోతి పబ్లిక్ పాయింట్ చర్చాకార్యక్రమంలో యాంకర్ పవన్ తో నేను.
Discussion | Chandrababu Writes Letter To EC Over Restrictions in AP | P...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఆంద్ర జ్యోతి పబ్లిక్ పాయింట్ చర్చాకార్యక్రమంలో యాంకర్ పవన్ తో నేను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)