26, జులై 2022, మంగళవారం
గెలుపుకు కోరిక వుంటే చాలదు, పట్టుదల కూడా కావాలి
నన్ను మన్నించు! నన్ను క్షమించు!
గత
మూడేళ్ళుగా ఈ మాటలు నాలోనేను ఎన్ని లక్షలసార్లు అనుకుని ఉంటానో, ఇంకా అనుకుంటూనే వున్నానో లెక్క లేదు.
ఇప్పడు ఎన్ని అనుకున్నా, ఎన్నిసార్లు
అనుకున్నా ఏమిలాభం, వినే
మనిషి మనుషుల్లో లేకుండా పోయిన తర్వాత.
భద్రాద్రి
రాముడిని ప్రస్తుతిస్తూ రచించిన దాశరధి
శతకంలో కంచర్ల గోపన్న ఇలా అంటాడు.
“సిరిగల
నాడు మైమరచి చిక్కిననాడు దలంచి పుణ్యముల్
పొరిబొరి
సేయనైతినని పొక్కిన గల్గునె గాలి చిచ్చుపై
గెరలిన
వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త
త్తరమున
ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ!”
శరీరానికి
ముసలితనం వచ్చిన తరవాత, ఇప్పటి
వరకు పుణ్యమైన పనులను ఏమీచేయలేకపోయానే అని ఎంత బాధపడినప్పటికీ ప్రయోజనం ఉండదు. అందువలన
ఓపికగా ఉన్న రోజులలోనే భగవంతుడి మీద భక్తితో పుణ్యకార్యాలను చేయాలి. లేకపోతే
బాధపడవలసి వస్తుంది అనేది తాత్పర్యం.
భార్యాభర్తల్లో
ఎవరు ముందో ఎవరు వెనకో ఎవరూ చెప్పలేరు. అంచేత జీవించి ఉన్నప్పుడే ఒకరినొకరిని బాధ పెట్టే పనులు చేయకుండా, మనసును నొప్పించే మాటలు అనకుండా వుంటే తర్వాత బాధ పడాల్సిన
అవసరం వుండదు.
అలా
అని మా ఆవిడని నేనేదో నానా బాధలు
పెట్టానని కాదు, ఆమె జీవించి
వుండగా ప్రేమించాల్సినంతగా ప్రేమించలేదేమో
అని, ఆదరంగా పలకాల్సిన పలుకులు
పలకలేదేమో అని మనసు మూలల్లో ఓ బాధ.
ఇది
తీరేది కాదు.
ఆగస్టు
మాసం వస్తోంది అంటే ఇది మరింత సెల వేస్తుంది.
(26-07-2022)
షిర్డీ సాయిరాం
1997 అంటే 25 ఏళ్ళ కిందట షిర్డీలో దిగిన ఫొటో. ఆ రోజుల్లో షిర్డీసాయి దేవాలయంలో మూల విరాట్ ముందు నిలబడి ఫొటోలు తీసుకోనిచ్చేవాళ్ళు. అంచేత ఈ ఫొటో మాకు ఒక అపురూపమైన కానుకగా మిగిలింది. నా పక్కన వున్నది మా రెండో అన్నయ్య కుమారుడు లాల్ భండారు.
25, జులై 2022, సోమవారం
కార్పొరేట్ దోపిడీ
వరద రాజకీయం
పుట్టింట్లో కొన్ని ఘడియలు
వార్తా వంటకాలు - భండారు శ్రీనివాసరావు
విషయం ఒక్కటే. కానీ చూసే ఇద్దరికీ రెండు రకాలుగా కనిపిస్తే, వైద్య పరిభాషలో ఆ జబ్బుని యేమని పిలుస్తారో తెలియదు. ఒకే వార్త, వివిధ పత్రికల్లో వివిధ రూపాల్లో వస్తే, అందుకు కారణాలు ఏమిటో చదువరులకు యిట్టే తెలిసిపోతున్నాయి. ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి, వేర్వేరు పత్రికలు, వేర్వేరు కోణాల్లో, వార్తలు 'వండి వారుస్తున్న' తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. ఏ ఛానల్ మార్చి చూసినా యిదే వరస.
ఎవరయినా తాము చదివే పత్రిక, చూసే ఛానల్ వైవిధ్య భరితంగా ఉండాలనే కోరుకుంటారు. మూసపోసినట్టుగా వుండాలనుకోరు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేటు ఛానళ్ళ శకం మొదలయినప్పుడు, జనం ఆ మార్పుని సాదరంగా స్వాగతించారు. కానీ తాము కోరుకున్న మార్పు తాము కోరిన రీతిలో కాకుండా గాడి తప్పుతున్న పద్దతిని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
యిరవై నాలుగ్గంటల నిరంతర న్యూస్ ఛానళ్ళ పుణ్యమా అని ఈ రోజుల్లో పనికొచ్చే సమాచారం, పనికిరాని సమాచారం టన్నుల లెక్కల్లో ప్రజలకు చేరుతోంది. ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు ఏ మేరకు హరాయించుకోగలదో ఆ టీవీ ఛానల్ల వాళ్ళే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తే బాగుంటుందేమో. ఎన్ని విషయాలు విన్నా మెదడు మాత్రం దానికి వీలయినంతవరకే నిక్షిప్తం చేసుకుని మిగిలింది వొదిలేస్తుందంటారు. యిదే నిజమయితే, టీవీ ఛానళ్ళ ద్వారా క్షణక్షణానికీ జనాలకు అందుతున్న సమాచారంలో చాలా భాగం గుర్తుకు రానంతగా వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే చూసిందీ ఎక్కువ కాలం గుర్తుండి పోతుందనే సిద్దాంతానికి, ఈ సమాచార విస్పోటనం చిల్లులు పొడుస్తుందనే అనుకోవాలి. ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తుండదు అన్న ధీమాతో, రాజకీయ నాయకులు తరచూ స్వవచనఘాతానికి పూనుకుంటూ ఉండడానికి కూడా బహుశా యిదే కారణమేమో!