16, నవంబర్ 2021, మంగళవారం
మంచి పిచ్చి అధికారి – భండారు శ్రీనివాసరావు
కడుపు చించుకుంటే..... భండారు శ్రీనివాసరావు
(నవంబర్ పదహారు జాతీయ పత్రికా దినోత్సవం)
15, నవంబర్ 2021, సోమవారం
ఆదర్శమూర్తికి కాంస్య విగ్రహం
ఆదర్శం ముందెన్నడు అవసరాన్ని చూడకు అనేవారు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు. అలా చూడడం మొదలు పెడితే అవసరాలదే ఎప్పుడూ పై చేయి అవుతుంది.
ఆదర్శాలకు విలువ తగ్గిపోతూ ఉండడానికి ప్రధాన కారణం వాటిని వల్లె వేసేవారు ఎక్కువై, ఆచరించేవాళ్లు
స్వల్ప సంఖ్యాకులు కావడం.
ఈ నేపధ్యంలో ఎన్నదగిన ఓ సామాన్యుడు డాక్టర్
అయితరాజు పాండురంగారావు.
ఆయన స్వగ్రామం ఖమ్మం
జిల్లా వల్లభి.
హైదరాబాదులో డాక్టరీ చదివి, ఇంగ్లాండులో పై చదువులు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగివచ్చి,
అందివచ్చిన ప్రభుత్వ ఉద్యోగానికి
హైదరాబాదును కాకుండా మారుమూల బూర్గుంపాడు
ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు, పై అధికారులతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ
విధంగా ‘తానమ్మిన సత్యాన్నే బోధించిన ధీశాలి, బోధించిన సత్యాన్నే పాటించిన వ్రతశీలి’
అనిపించుకున్నాడు.
ఉద్యోగపర్వంలో
బూర్గుంపాడు, భద్రాచలం, హైదరాబాదు ఇలాగే రోజులు గడిచిపోయాయి. ఒక
ప్రభుత్వ డాక్టరుగానే జీవితం గడిపివుంటే ఆయన్ని గురించి రాయాల్సిన అవసరం,
తలచుకోవాల్సిన సందర్భం ఉండేదే కాదు. వైద్య విద్యార్ధిగా తొలిపాఠం
నేర్చుకున్నప్పుడే డాక్టర్లకు నేర్పే మరో నీతిపాఠాన్ని ఆయన ఒంటపట్టించుకున్నాడు. జీవితాంతం దాన్నే పాటిస్తూ వచ్చాడు.
‘రోగికి అవసరం
లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’ అన్నది ఆ పాఠం.
108, 104 అంటే ఏమిటో ఈరోజు
తెలుగు రాష్ట్రాలలో యావన్మందికీ తెలుసు. వాటి
రూపశిల్పి ఈ డాక్టరు గారే. హైదరాబాదులో ఉంటున్నా, నెలలో చాలా రోజులు వాళ్ళ సొంతూరు వల్లభిలో గడిపిన ‘శ్రీమంతుడు’ డాక్టర్ అయితరాజు
పాండురంగారావు. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని గ్రామ ప్రజలకోసం
పుష్కరకాలానికి పైగా సొంత ఊరిలో టెలి మెడిసిన్ సదుపాయాన్ని కల్పించి ఎంతో మంది
బడుగు బలహీన వర్గాలకు సాయపడ్డాడు. ఇప్పటికీ అది కొనసాగుతోంది.
ఆ డాక్టర్
చనిపోయిన తర్వాత కూడా ఆ ఊరి ప్రజలు ఆయన్ని తమ గుండెల్లో పెట్టుకున్నారు. డాక్టర్
రంగారావు జీవించి వున్న కాలంలో ఆవిష్కరించిన మహాకవి కాళోజి విగ్రహం సరసనే డాక్టర్
రంగారావు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.
నిన్న ఆదివారంనాడు
రంగారావు విగ్రహావిష్కరణ ఆయన ఆశయాలకు
తగ్గట్టుగానే ఆ వూరి ప్రజలు నిరాడంబరంగా నిర్వహించారు.
తెలంగాణా
ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు విగ్రహాన్ని
ఆవిష్కరించి వైద్య రంగంలో డాక్టర్ రంగారావు సేవలను సోదాహరణంగా వివరించారు. సికిందరాబాదు
గాంధీ హాస్పిటల్ మాజీ సూపర్ ఇన్ టెండెంట్ డాక్టర్ నాగభూషణం అధ్యక్షత వహించారు.
గతంలో ప్రాజక్టు సీఈ ఓ గా పనిచేసిన డాక్టర్ బాలాజీ ఊట్ల, డాక్టర్ రంగారావుతో
సన్నిహితంగా పనిచేసిన డాక్టర్ గోపాల్, శశి కుమార్ వంటి అనేకమంది
హైదరాబాదు నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో
కడగొట్టు గ్రామం అయిన ఆ పల్లెలోని బడుగు బలహీన వర్గాల నుంచి దేశంలోని
ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో అత్యున్నత చదువులు
అభ్యసించి జీవితంలో బాగా ఎదిగివచ్చిన నలుగురు యువకులను ఈ సందర్భంగా సత్కరించిన
నిర్వాహకులు అభినందనీయులు.
అలాగే సభకు వచ్చిన
గ్రామస్తులు అందరూ ‘నేను కరోనా టీకా తీసుకున్నాను’ అని రాసి వున్న బాడ్జ్
ధరించడం ఓ విశేషం.
(14-11-2021)
13, నవంబర్ 2021, శనివారం
తనదాకా వస్తే కానీ..
మనిషి కురచగా వున్నా మనసు విశాలంగా వుండాలని అంటారు.
నా
బాల్య మిత్రుడు ఒకరు చాలా ఏళ్ళ తర్వాత ఫేస్ బుక్ ద్వారా మళ్ళీ కాంటాక్టు లోకి వచ్చాడు.
దేశాలు తిరిగి వచ్చిన అనుభవం అతడికి వుంది. అయినా ఆలోచనలు, భావాల్లో మార్పు లేదు. తన మతం అంటే
ఎనలేని గౌరవం. తప్పులేదు. కానీ పరాయి
మతాలూ అంటే తగని ద్వేషం. క్రైస్తవులను
కావాలని కిరస్తానీవాళ్ళు అంటాడు. ముస్లిం
లను తురకోళ్ళు అంటాడు. ఇది సభ్యత కాదని చాలా సార్లు చెప్పాను. అయినా
వినిపించుకోలేదు.
కొన్నాళ్ళుగా
ఫేస్ బుక్ లో అతడి పోస్టులు లేవు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆరా తీస్తే తెలిసింది.
అతడి ఇద్దరి పిల్లలు అమెరికాలో వుంటున్నారు. కొడుకు క్రైస్తవమతానికి చెందిన అమ్మాయిని, కుమార్తె ఆఫ్రికన్ అమెరికన్ (ముస్లిం) అబ్బాయిని ఆ దేశంలోనే వాళ్ళ మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తలితండ్రులను
పిలిపించుకుంటే వెళ్లి వచ్చారు. అప్పటి నుంచీ ఇతర మతాల పట్ల అక్కసుతో కూడిన అతడి పోస్టులు కనబడడం లేదు.
మనం
మనలాగా జీవిస్తే ఎవరికీ ఇబ్బంది వుండదు, అందరూ మనలాగే వుండాలని అనుకుంటేనే ఎదురు దెబ్బలు తగులుతాయి.
అతడి
పిల్లలు చేసిన పనిని నేను సమర్థించడం లేదు.
సాటి మానవుల విషయంలో నా స్నేహితుడి
ప్రవర్తన పట్లే నా అభ్యంతరం.
(13-11-2021)
కాళోజీ గర్వభంగం - భండారు శ్రీనివాసరావు
కాళోజీ గర్వభంగం - భండారు శ్రీనివాసరావు
12, నవంబర్ 2021, శుక్రవారం
నా నడక చూడ తరమా! – భండారు శ్రీనివాసరావు
“ఎక్కడికి వెళ్ళాలి పాపా! నేను డ్రాప్ చేస్తాను అంది నా కోడలు నిషా నేను చెప్పులు వేసుకోవడం గమనించి.
“మీ పేరు త్రినాథ్ కదూ’
అడిగాను నేను బ్యాంకుకు వెళ్ళిన అరగంట తర్వాత వచ్చి కౌంటర్ లో కూర్చొన్న ఉద్యోగిని.
“అవును
మీకు ఎలా తెలుసు?” అడిగాడు ఆశ్చర్యంగా.
సెల్
ఫోన్ అతడి ముందుకు తోసి, “మీకు అభ్యంతరం లేకపోతె ఒక నిమిషం ఇది చదువుతారా” అని
అడిగాను సాధ్యమైనంత వినమ్రతతో కూడిన స్వరంతో. నా గొంతులోని మార్దవాన్ని గమనించి
అతడు చదవడం మొదలు పెట్టాడు.
అది
నిరుటి సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటిన పోస్టు చేసిన కధనం.
అదే
ఇది:
21-11-2020 నాటికి భండారు శ్రీనివాసరావు అనే వ్యక్తి
బతికి వున్నట్టు మా కళ్ళారా చూశాము అని స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువ శ్రమ
పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా ఓ సర్టిఫికేట్
ఇచ్చారివాళ.
మా ఇంటికి ఓ కిలోమీటరు దూరంలో కాబోలు
స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ వుంది. శనివారం ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో అని
అనుమాన పడుతూనే బ్యాంకు వైపు అడుగులు వేసాను. మా ఆయన ఇన్నాల్టికి అడుగులు వేసాడు
అని సంబరపడి అరిసెలు వండి పెట్టేదేమో, మా ఆవిడ బతికి ఉన్నట్టయితే. ప్రధాన మంత్రి మోడీ కరోనా వున్నది జాగ్రత్త! ఇంటిపట్టునే మూతి (కట్టుకు) మూసుకు
వుండండి అని గత మార్చిలో హుకుం జారీ చేసినప్పటినుంచి బుద్దిగా ఇంట్లోనే పడి
ఉంటున్నాను.
స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కార్పొరేట్ తరహాలో తీర్చి దిద్ది వుంది. ఫ్రంట్ డెస్క్ లో ఓ
అమ్మాయి కూర్చుని వచ్చిన వాళ్ళను కనుక్కుంటూ వుంది. నాది జీవన్ ప్రమాణ్ అని చెప్పగానే రెండో నెంబరు కౌంటరు చూపించింది. అప్పటికే అక్కడ నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు వున్నారు. కరోనా కాలం అని గుర్తుకు వచ్చి
కాసేపు ఎడంగానే నిల్చున్నాను. కౌంటర్ లోని వ్యక్తి తలెత్తి నా వైపు చూసి ఆధార్
జిరాక్స్ తెచ్చారా లేకపోతే అదిగో ఆ గదిలో జిరాక్స్ మిషిన్ వుంది వెళ్లి తెచ్చుకోండి అన్నాడు. ఈ మర్యాదకు
ఆశ్చర్యపోతూనే అక్కడికి వెడితే నోట్ల కట్తల వెనుక నగదు అధికారి ఒకరు
తదేక దీక్షగా డబ్బు కట్టలు లెక్కపెట్టే పనిలో వున్నాడు. అంత సొమ్ము వున్న చోట
మసలడం క్షేమం కాదనుకుని గుమ్మం బయటే ఆగిపోయాను. ఈలోగా రెండో నెంబరు కౌంటరులో
ఉద్యోగి ఓ నాలుగో తరగతి అధికారిని పిలిచి, నా పనిచేసిపెట్టమని గొంతెత్తి మరీ
చెప్పాడు. కానీ అతగాడు మాత్రం తన తీరిక సమయంలోనే, అంటే
తోటి సిబ్బందితో ముచ్చట్లు చెప్పడం, తేనీరు సేవించడం వంటి పనులు తీరిగ్గా కానిచ్చిన తరవాతనే నా పని చేసిపెట్టాడు. అయినా షరా మామూలుగా
థాంక్స్ చెప్పి మళ్ళీ రెండో నెంబరు వద్దకు వచ్చాను. ఈసారి అతడు ఓ ఫారం ఇచ్చి
పూర్తి చేసుకుని రమ్మన్నాడు. నామినీగా నా భార్య పుట్టిన తేదీని ధ్రువపత్రంతో పూరించాల్సిన ఖాళీని డాష్ డాష్ లతో
నింపి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అని సెల్ఫ్ సర్టి ఫై చేసి ఇచ్చాను. అతడు నా వేలి
ముద్రలు తీసుకుని LIFE CERTIFICATE నా చేతిలో పెట్టాడు.
వయసు మళ్ళిన పెన్షనర్లతో ఓపికగా డీల్ చేస్తున్న ఆ కుర్రాడి పేరు తెలుసుకుని, థాంక్స్ త్రినాద్ అని చెప్పి వచ్చేశాను.
ఏమైతేనేం , నా ఖాతా వున్న స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కోటీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ
ఏడాది పని పూర్తి అయింది.”
ఇదంతా ఓపిగ్గా చదివిన త్రినాద్ అన్నాడు
నాతొ మన్నింపుగా.
“సారీ అండీ మిమ్మల్ని బాగా వెయిట్
చేయించాను, మేనేజర్ దగ్గర పనిలో వుండి”
అంటూనే నా పని నిమిషాల్లో పూర్తి చేసి
జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ నా చేతిలో పెట్టాడు.
థాంక్స్ త్రినాద్! (హోప్ టు సీ యు
నెక్స్ట్ ఇయర్)
బ్రాకెట్లోది పైకి అనలేదు.
(12-11-2021)