16, సెప్టెంబర్ 2021, గురువారం
సెప్టెంబర్ 16
సంగీత ధ్రువతార ఎమ్మెస్ సుబ్బులక్ష్మి
15, సెప్టెంబర్ 2021, బుధవారం
సృష్టికి శుభాశీస్సులు
ముందు లేడి పిల్లలా పరుగులు పెడుతున్నది సృష్టి. వెనక వెంట వస్తున్నది సృష్టి తండ్రి సందీప్. ఇది రాస్తున్న నేను, ఆ తండ్రికి తండ్రిని.
ఇంజినీర్స్ డే
ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి
1908 లో మూసీ నదికి
వరదలు వచ్చాయి. అవి కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. అప్పటి నిజాం నవాబు
హైదరాబాదును ఇలా వొదిలేస్తే ప్రమాదం అని భావించి నగరాన్ని ప్రణాళికా బద్ధంగా
అభివృద్ధి చేయాలని సంకల్పించాడు. మైసూరు నుంచి ప్రముఖ ఇంజినీరు మోక్షగుండం
విశ్వేశ్వరయ్య గారిని ప్రభుత్వం తరపున ఆహ్వానించి వరదలు రాకుండా అరికట్టడానికి, నగరాన్ని సుందరంగా
అభివృద్ధి చేయడానికి తన సలహాదారుగా నియమించుకున్నారు. విశ్వేశ్వరయ్యగారి దూరదృష్టి
పుణ్యమా అని నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే
రెండు మంచి నీటి జలాశయాలు ఏర్పడ్డాయి. మూసీ వరదలకు కూడా ముకుతాడు వేసినట్టూ
అయింది. అలాగే 1912 లోనే నిజాం నగరాభివృద్ధి మండలిని ఏర్పాటు చేసారు. ఈ మండలి ముందు చూపు
ఫలితంగా హైదరాబాదు నగరానికి అప్పట్లోనే చక్కని రహదారులు, మార్కెట్లు, దుకాణ సముదాయాలు
ఏర్పాటయ్యాయి.
(15th September)
14, సెప్టెంబర్ 2021, మంగళవారం
పుస్తక దాతా! సుఖీభవ!
సాయంత్రం ఎవరో ఫోన్ చేసి అమెజాన్ డెలివరీ బాయ్ ని, ఇంట్లో వున్నారా అని అడిగాడు. వున్నానని చెబితే కిందనే వున్నాను, మీకు ఒక పార్సెల్ ఇవ్వాలి అన్నాడు.
అమెజాన్
కు కాదు కదా అసలు ఈ ఆన్ లైన్ లో నేను ఏదీ కొనను. అతడు వచ్చి పార్సెల్ ఇచ్చిన
తరువాత చూస్తే నాపేరు,
అడ్రసు స్పష్టంగా కనిపించాయి. ఓపెన్ చేస్తే ఒక ఇంగ్లీష్ పుస్తకం వుంది.
ప్రచురించింది రూపా పబ్లికేషన్స్, ఢిల్లీ. పంపింది చిత్రప్రసాద్ బహదూర్, భువనేశ్వర్. రాసింది అత్యుత సామంత.
(సామంత అనాలో సమంత అనాలో తెలియని పరిస్థితి. పుస్తకం పేరు My Mother My Hero.
వెనుక
అట్టమీద ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ఈ పుస్తకం గురించి రాసిన మాటలు
వున్నాయి.
“When I was going through the pages
of the book, I could not but feel enormous respect and reverence for a mother
who fought every odd to single-handedly raise her seven children. Despite
abject poverty and lack of resources, she ensured that all her children got
good education and became responsible citizens. I was moved by the account of
Dr. Achyuta Samanta’s father’s death.
“We read
biographies of entrepreneurs, explorers, and scientists, but writing the
biography of a mother is something different and unique. Very inspiring.”
అని రాశారు ఆయన.
రెండువందల పేజీల ఈ పుస్తకం ఖరీదు Rs.295/- అని అమెజాన్ Invoice లో వుంది.
నా ముక్కూ మొహం తెలియక పోయినా పుస్తకాన్ని నా చిరునామాకు
భద్రంగా పంపిన చిత్ర ప్రసాద్ బహదూర్ వారికి నమోవాకాలు.
(14-09-2021)
నిమజ్జన గణపతి సందేశం
రాజకీయ నాయకులకు నిమజ్జన వినాయకుడి ఉచిత సలహా:
IS STILL STATE BANK, OUR BANK ?
1975 నవంబరులో నేను హైదరాబాదు ఆలిండియా రేడియో, న్యూస్ యూనిట్ లో చేరినప్పుడు మొదటి నెల జీతం నగదు రూపంలో ఇస్తూ క్యాషియర్ సలహా ఇచ్చాడు, ఏదైనా బ్యాంకులో ఖాతా తెరిచి ఆ వివరాలు ఇమ్మని. రేడియో అక్కౌంట్ కోటీ, బ్యాంక్ స్ట్రీట్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ హెడ్ ఆఫీసులో వుంది. అక్కడికి వెళ్లి పలానా చోట పనిచేస్తున్నాను అని చెప్పాను. బ్యాంకు మేనేజరే నాకు రిఫరెన్స్ సంతకం చేయడంతో వెంటనే అక్కౌంట్ ఓపెన్ చేయగలిగాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నలభయ్ ఆరేళ్లుగా నా అక్కౌంట్ ఆ బ్రాంచిలోనే వుంది. ఎన్నో ఇళ్లు మారాను కానీ బ్యాంకు అక్కౌంట్ వేరే బ్రాంచికి మార్చలేదు. ఈ క్రమంలో అక్కడ పనిచేసేవాళ్ళు సిబ్బంది, అధికారులు పరిచయం అయ్యారు. రిటైర్ అయిన తర్వాత కూడా అదే బ్యాంకు. అదే బ్రాంచి. ఆ బ్యాంకు యాడ్స్ లో పేర్కొన్నట్టు “STATE BANK MY BANK”.
కొద్దిసేపటి
క్రితం ఒకతను ఫోన్ చేశాడు, ‘కోటీ
ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాను, మీ వివరాలు
చెప్పండ’ని.
నేను
అన్నాను. ‘ప్రతి పది రోజులకి బ్యాంకు నుంచి ఓ మెసేజ్ వస్తుంటుంది, వేరేవారికి
మీ వివరాలు చెప్పొద్దు, బ్యాంకు ఎన్నడూ అలాంటివి అడగదు అని. మరి మీరేమిటి, పేరు డిజిగ్నేషన్
కూడా చెప్పకుండా! నా మెయిల్ ఐ డి మీ దగ్గర వుంది, ఏదైనా కావాలి అంటే మెయిల్ చేయొచ్చు కదా’ అని.
అతగాడు అన్నాడు, ‘మీరు నేను చెప్పేది వింటారా, మీరు
చెప్పేదే నేను వినాలా’ అని.
‘చాలాకాలం నుంచి మీ కష్టమర్ గా ఉంటున్నాను, కనీసం ఆ
అవకాశం నాకెందుకు ఇవ్వరు’ అని అడిగాను.
‘మీరు చెబుతారా కాల్ కట్ చేయమంటారా’ అని కాస్త గద్దింపుగా
అన్నాడు. ‘ఫోన్ చేసింది మీరు నన్ను అడుగుతారేమిటి’ అనేది నా జవాబు.
వెంటనే కాల్ కట్ చేశాడు.
అతడు నిజమైన బ్యాంకు ఉద్యోగే అయి ఉండవచ్చు. కానీ ఫోన్
చేసి తన పేరు, హోదా ప్రవర
చెప్పుకుని పలానా శ్రీనివాసరావుతోనే మాట్లాడుతున్నాను అనేది వెరిఫై చేసుకుని
సంభాషణ సాగించి వుంటే ఈ తకరారు వచ్చేదే కాదు. (అతడు ఫోన్ చేసిన నెంబరు ల్యాండ్ లైన్ నుంచి. 04023466703)
పైగా ఎంతో కాలం క్రితమే నేను నా బ్యాంకు ఖాతాను అటు ఆధార్
తో, ఇటు నా
మొబైల్ తో లింక్ చేశాను కూడా.
అయినా ఇప్పుడీ ఈ
వివరాల ఆరాలు ఎందుకో ఏమిటో మరి.