ఏదైనా క్రతువు, కార్యక్రమం నిర్వహించిన తరవాత దాని నిర్వాహకులు మొదట అనుకునే మాట, ఎంతమందిని పిలిచాం, ఎంతమంది వచ్చారు? ఎవరు రాలేదు అని.
3, సెప్టెంబర్ 2021, శుక్రవారం
వై.ఎస్.ఆర్. సంస్మరణ సభ – భండారు శ్రీనివాసరావు
2, సెప్టెంబర్ 2021, గురువారం
విజయమ్మ ఆత్మీయ సమావేశం
10 TV ఛానల్
లో చర్చలకు ఆ ఛానల్ మొదలుపెట్టినప్పటినుండి వారానికోసారి వెళ్ళడం రెండేళ్ల కిందటి
వరకు నాకు ఆనవాయితీగా వుండేది. సతీష్ అప్పటి నుండి పరిచయం. ఈనాడు ప్రొడక్ట్. 10 TVలో స్థిరపడి మంచి స్థాయికి చేరుకున్నాడు. సౌమ్యుడు. ఆయనతో చర్చల్లో
గడబిడలు, దడదడలు
వుండవు. అంచేత పిలవగానే ఈ ఉదయం వెళ్లాను, స్టూడియోలో మీరూ నేనే ఉంటాము, మిగిలిన వాళ్ళు బయటనుండి అని
చెప్పిన తర్వాతనే. చర్చలో పాల్గొన్న వి. హనుమంత రావు గారు (టి. కాంగ్రెస్), కొండా
రాఘవ రెడ్డి గారు (వై.ఎస్.ఆర్.టి.పి.) ఉభయులు నాకు చిరపరిచితులే.
ఈనాటి
చర్చ గురించిన ఓ లింక్ పంపారు. నా వరకు మాత్రమే పరిమితం చేసి ఎడిట్ చేసి పంపడం
వల్ల ఇది చూడడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇటువంటి సదుపాయం ఒకటి వుందని కూడా
నాకు ఇంతవరకు తెలియదు. మన టెక్నో సావీ నిర్మల్ గారు చెప్పాలి. సతీష్ కి కృతజ్ఞతలు.
(02-09-2021)
ప్రజావైద్యుడు వై.ఎస్.ఆర్.
రాజకీయుల నాలుకకు నరం వుంటుందా!
1, సెప్టెంబర్ 2021, బుధవారం
కూతురి పాత్రలో కోడలు – భండారు శ్రీనివాసరావు
31, ఆగస్టు 2021, మంగళవారం
కధలు రాయడం ఎలా! – భండారు శ్రీనివాసరావు
(ఆగస్టు 31ఆరుద్ర జయంతి)
‘నేను పుట్టడానికి
కొన్ని నెలల ముందు నుండే నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ
దుర్మార్గానికి పూనుకుంది కూడా నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’
‘కధలెలా రాయాలి’
అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ
విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే
పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను
ఉటంకించారు.
పుట్టడానికి ముందే
చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు
పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ
మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను
ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా అంతే
వుంటుంది. ఆరుద్ర గారంటే మాటలా మరి!
NOTE: Courtesy Image Owner