మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 న జరిగిన మొదటి జెండా వందనం ఎర్రకోట బురుజుల నుంచి జరగలేదు. పండిట్ నెహ్రూ పదిహేనవ తేదీనే ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వెంట ఆ నాటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ కూడా వున్నారు. ఆ బహిరంగ కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. సుమారు అయిదు లక్షల మంది ఆ ప్రాంతానికి ఉత్సాహంగా చేరుకున్నారు. వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము కావడంతో పోలీసులు చేతులు ఎత్తేసారు. కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన అనేకమంది విదేశీ దౌత్య వేత్తలు, మంత్రులు, ఇతర ప్రముఖులు, జన సందోహంతో నిండిపోయిన ఆ ప్రదేశానికి చేరుకోలేక వెనక్కి మళ్ళాల్సి వచ్చింది. ఆ జన సమ్మర్దంలో తప్పిపోయిన పిల్లలను వెతికే కార్యక్రమంలో నెహ్రూ, మౌంట్ బాటెన్ కూడా ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
15, ఆగస్టు 2021, ఆదివారం
ఎర్రకోట మీదనే ఎందుకు?
14, ఆగస్టు 2021, శనివారం
నాస్తికవాద ప్రబోధి శ్రీ లవణం – భండారు శ్రీనివాసరావు
(ఈరోజు లవణం గారి వర్ధంతి)
13, ఆగస్టు 2021, శుక్రవారం
మంచి పలుకు
శ్రీ పీఠం ఆద్యాత్మిక మాస పత్రిక తాజా సంచికలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచించిన సుభాషితం:
జయాలకు అపజయం లేదు – భండారు శ్రీనివాసరావు
(గురువారం
నాడు శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన జి.ఎస్.ఎల్.వి. ఎఫ్.10 వైఫల్యం గురించిన వార్తలు
విన్నప్పుడు గుర్తుకువచ్చిన పాత సంగతి)
1987, మార్చి నెల
ASLV-1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి, గవర్నర్ కుముద్ బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్
టెర్రేస్ మీద నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆసీనులయివున్నారు. భారత
దేశానికి గర్వకారణం కాగల ఈ ప్రయోగాన్ని కళ్ళారా చూడడానికి సుమారు పదివేలమంది
ప్రేక్షకుల గేలరీలో వేచి వున్నారు.
అనుకున్న సమయానికి రాకెట్
ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ రాకెట్ గగనంలోకి దూసుకుపోయింది. రాకెట్ పైకి లేస్తుండగానే
వారందరూ ఒకరికొకరు అభివాదాలు తెలుపుకుంటూ, కరచాలనాలు
చేసుకుంటూ ఉద్విగ్నంగావున్న సమయంలో జరగరానిది జరిగిపోయింది. ప్రయోగించి నిమిషం
కూడా గడవకముందే రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. ఒక్క లిప్తపాటు భయంకర నిశ్శబ్దం.
అందరి మొహాల్లో ఆనందం తప్పుకుంది. విషాదం అలముకుంది.
రాజీవ్ గాంధి అందరికంటే ముందు
తేరుకున్నారు. ఇస్రో అధికారులను, సిబ్బందిని అనునయించారు. ఇటువంటి
శాస్త్రీయ ప్రయోగాలలో విజయాలే తప్ప, అపజయాలు
ఉండవన్నారు. ముందుకు దూసుకుపోవడానికి ఇదొక అవకాశంగా భావించాలని ధైర్యం చెప్పారు.
అలా పోగుపడిన ధైర్యమే ఈనాడు ఇస్రో
బృందాన్ని ప్రపంచ రికార్డు సొంతం చేసుకునేలా చేసింది.
అక్షరాలా నూట నాలుగు ఉపగ్రహాలను ఏక
కాలంలో అంతరిక్షంలోకి పంపేలా చేయగలిగింది.
నిజమే. అంతకు ముందు తెలియని విషయాలను
కనుగొనేముందు ఎన్ని అపజయాలు ఎదురయినా శాస్త్రవేత్తలు వెనక్కి తగ్గక పోవడం వల్లనే
ఈనాడు ప్రపంచానికి ఇన్ని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు అందుతున్నాయి. మొదటి
వైఫల్యానికే చతికిల పడివుంటే ఇప్పుడూ అక్కడే వుండేవాళ్ళం.
కాబట్టి గురువారం ప్రయోగం విఫలం
అయిందని కుంగిపోనక్కరలేదు. ఆ వైఫల్యం మరో ఘన విజయానికి సోపానం కావాలని కోరుకుందాం!
అతడు – ఆమె - ఆవిడ
‘ఓసారెళ్ళి ఆవిడ్ని చూసిరండి. ఒకటే కబుర్లు చేస్తోంది.’
ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి సైకిల్ స్టాండ్ వేస్తున్న శంకరం కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. భార్య నోటి వెంట ‘ఆవిడ’ ప్రస్తావన రావడం ఈ అయిదేళ్ళలో ఇదే మొదటిసారి.
పెళ్ళయిన నాటి
నుంచీ ఇదే తంతు.
'నేను మీ
జీవితంలోకి వచ్చాను. అంతే. ఇక ఆవిడ ప్రస్తావన మన మధ్య రావడానికి వీల్లేదు’ దాదాపు
హుకుం జారీ చేసింది.
మొదటి రాత్రే
తనంటే ఏమిటో స్పష్టంగా తెలియచెప్పింది. కాస్త వయసు
మీదపడ్డ తరువాత పెళ్లి చేసుకుంటే ఇంతేనేమో. తానూ అప్పటినుంచి కుక్కిన పేను
మాదిరిగానే పడివుంటున్నాడు, 'భార్య గీసిన గీత దాటడు' అనే పేరు బయట
మారుమోగుతోందని తెలిసినా.
ఇక, ఇంట్లో ‘ఆవిడ’ ప్రసక్తి
తేనంతవరకు, రానంతవరకు భార్య తనని పల్లెత్తు మాట అనదు. పొరబాటున వచ్చిందంటే చాలు ఇక తన మాట వినదు.
ఏమిటో ఈ ఆడవాళ్ళు.
మరో ఆడదాని మాట మొగుడి నోట వెంట 'వినాల'ని కూడా అనుకోరు.
ఇంతకీ శంకరం భార్య మొగుడ్ని వెళ్ళి చూసిరమ్మని
చెప్పిన ‘ఆవిడ' ఎవరో కాదు, శంకరాన్ని నవమాసాలు మోసి కని పెంచిన అతడి కన్నతల్లి. పదిహేనేళ్ళ క్రితం
తండ్రి చనిపోయిన నాటి నుంచి తన బాగోగులు చూస్తూ తను ఒక ఇంటివాడు అయ్యేంతవరకు
కనిపెట్టుకుని చూసిన మనిషి. పెళ్ళయిన మరుసటి
నెలలోనే, కోడలి దాష్టీకం పుణ్యమా అని ఇల్లు వొదిలి పెట్టి పరాయి ఇంట్లో తలదాచుకుంటూ, ‘వంటలమ్మగా’ రోజులు వెళ్లమారుస్తోంది.
భార్యే స్వయంగా
చూసి రమ్మని చెప్పడంతో ఇక శంకరం ఆఘమేఘాలమీద
తల్లి దగ్గర వాలిపోయాడు. తనకోసమే కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నట్టు
వుంది. కానీ ఆ తల్లి కళ్ళల్లో కొడుకుని చూసిన తృప్తే తప్ప జీవం లేదు.
'నీతో కలిసి
భోంచేయాలని వుందిరా శంకరం. నీకు అంత తీరుబడిఉందా? వెంటనే వెళ్ళాలా!' అని అడిగింది.
పర్మిషన్ తీసుకునే వచ్చాడు కనుక 'దానికేముందమ్మా!
అన్నం తినడమే కాదు ఈరోజంతా నీతో కలిసేవుంటాను' అనేసాడు. ఆ తల్లి
తబ్బిబ్బయింది. తత్తరపాటుతో లేచి వెళ్లి వంట మొదలు పెట్టింది. శంకరం కూడా పక్కనే
పీట వేసుకు కూర్చున్నాడు. ఆవిడ ఒక పక్క వంట చేస్తూనే శంకరం చిన్నతనపు అల్లరి
గురించీ, తిండి అలవాట్లు గురించి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టింది. ఆ కబుర్లు
వింటుంటే చిన్నప్పుడు తల్లిని ఎంతగా ప్రాణాలు కొరుక్కు తినేవాడో అ విషయాలన్నీ
కన్నీటిపొర తెరలా కమ్మిన కళ్ళల్లో గిర్రున తిరిగాయి.
ఇద్దరూ కలిసి
అన్నం తిన్నారు. తిన్నంత సేపూ తనివితీరా కబుర్లు
చెప్పుకున్నారు. పాత సంగతులు గుర్తుచేసుకున్నారు. కానీ ఆవిడ పొరబాటున కూడా 'ఆమె' ప్రసక్తి
తీసుకురాలేదు.
బయలుదేరేటప్పుడు
ఒక మూట చేతిలో పెట్టింది. ఇంటికి చేరగానే ఆ మూటను భార్య చేతిలో పెట్టాడు. ఆమె
విసురుగా దాన్ని అటక మీదకు గిరవాటు వేసింది.
రోజులు గడిచాయి.
మళ్ళీ కబురు. కానీ ఈసారి ఆవిడ నుంచి కాదు. ఆవిడ వంటలు చేసిపెట్టే వారినుంచి.
'అంతా అయిపొయింది.
ఇన్నేళ్ళు మా ఇంట్లో వంటలు చేసి పెడుతోంది కానీ ఆవిడ ఎవ్వరో, ఎవరి తాలూకో కూడా
తెలియదు. మొత్తం మీద మీ చిరునామా కనుక్కునేసరికి ఇన్నాళ్ళు పట్టింది. అనాధ శవాలకు
అంతిమ సంస్కారాలు చేసే ఒక సంస్థ వారు ఆపని పూర్తిచేశారు'
శంకరం
బావురుమన్నాడు. ఇంటివారు కబురుచేసిన దానిప్రకారం తల్లితో కలిసి భోంచేసిన రాత్రే
ఆవిడ కన్ను మూసింది. భార్యకు ఇచ్చిన మూట జ్ఞాపకం వచ్చి అటక మీద నుంచి తీసి చూశాడు.
తల్లికి పుట్టింటివాళ్ళు పెట్టిన నాలుగు బంగారు గాజులు, వొంటిపేట
చంద్రహారం అందులో వున్నాయి. వాటితో పాటే ఓ చీటీ.
'ఒరేయ్ శంకరం.
నువ్వు పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకురాగానే ఇవి
ఇద్దామనుకున్నాను. ఇల్లు వొదిలి రావడం వల్ల కుదరలేదు. తరువాత ఇద్దామని ఎన్నోసార్లు
అనిపించినా మళ్ళీ దేనికోసమో ఆరాటపడుతోంది అని అనిపించుకోవడం ఇష్టం లేక ఆ ఉద్దేశ్యం
మానుకున్నాను. నా తరువాత ఇవన్నీ కోడలికే దక్కాలి. మనసులో ఏవీ పెట్టుకోకుండా
తీసుకోమని చెప్పు. నేను ఇక ఎన్నో రోజులు బతుకుతానని అనుకోను. నిన్ను చూసాక ఇక నా
ఆఖరి కోరిక కూడా తీరిపోయింది'
శంకరం ఆశ్చర్యంతో
ఏడుపు ఆపేసాడు.
మరొకరు ఆ గదిలో
రోదిస్తున్న ధ్వని సన్నగా వినబడుతోంది.
12, ఆగస్టు 2021, గురువారం
నాకు వచ్చిన కల – భండారు శ్రీనివాసరావు
యాభయ్ ఏళ్ళ క్రితం నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసే రోజుల్లో ఆంధ్రజ్యోతి వారపత్రిక (ఇప్పుడు నవ్య అనే పేరుతొ వస్తోంది) ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మ గారు పాఠకులు పాల్గొనే ఒక శీర్షిక ప్రారంభించారు. దాని పేరు ‘నాకు వచ్చిన కల’
నవ్వుకునేవాళ్ళకు నవ్వుకున్నంత
ఆఫీసరు కొత్తగా చేరిన ఉద్యోగితో అన్నాడు.
"ఇక్కడ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తాం. నువ్వులోపలకి వచ్చేటప్పుడు డోర్
మ్యాట్ మీద బూట్లు శుభ్రంగా తుడుచుకుని వచ్చావా?"
"అవునండీ!"
"అలానా! మేము మరో విషయంలో కూడా
జాగ్రత్తగా ఉంటాము. ఇక్కడ పనిచేసేవాళ్ళు నిజం చెబుతున్నారా అబద్దం చెబుతున్నారా
అని. అసలా గుమ్మం దగ్గర డోర్ మ్యాటే లేదు"
"కుక్కలు ఎందుకు పెళ్లి చేసుకోవు"
"ఇదో ప్రశ్నా! ఎందుకంటె వాటిది అప్పటికే కుక్క బతుకు"
"తల్లికీ భార్యకూ తేడా?"
" ఏడుస్తున్న నిన్ను, తల్లి ఈ లోకంలోకి తెచ్చిపడేస్తుంది.
రెండో ఆవిడ నువ్వు జీవితాంతం ఆ ఏడుపు ఆపకుండా జాగ్రత్తగా కనిపెట్టి
చూస్తుంది"
"మగ సెక్రెటరీకి ఆడ సెక్రెటరీకి తేడా?"
"మగ సెక్రెటరీ ఆఫీసుకు వెళ్ళగానే బాసుకు 'గుడ్
మార్నింగ్' చెబుతాడు. ఆడ సెక్రెటరీ 'ఇక లేవండి బాస్ తెల్లారింది' అంటుంది"
(మళ్ళీ మళ్ళీ చెప్పక్కరలేదు - యధావిధిగా ఇంగ్లీష్ జోకులకు స్వేఛ్చానువాదం)