డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారితో చిన్న పర్సనల్ టచ్
16, ఏప్రిల్ 2021, శుక్రవారం
డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారిక లేరు
సర్కారీ జర్నలిస్టు
సుమారు మూడు దశాబ్దాలు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసిన అనుభవం నాకుంది. ఇన్నేళ్ళ ఉద్యోగ పర్వంలో ఏనాడు పై అధికారులెవ్వరూ, ఆ మాటకు వస్తే కేంద్రప్రభుత్వంలో, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, సమాచార ప్రసార శాఖ మంత్రులుగా పనిచేసిన తెలుగువారు కూడా 'ఈ వార్త ఇలా ఇవ్వండి, ఆ వార్త అలా యెందుకు ఇచ్చారు' అని అడిగిన జ్ఞాపకం లేదు. ఆ పాటి ఫంక్షనల్ అటానమీ (విధి నిర్వహణా స్వేచ్ఛ) ని నాతోపాటు పత్రికల్లో పనిచేసిన సాటి జర్నలిష్టు మిత్రులు అనుభవించారని అనుకోవడం లేదు. అయినా కానీ, సర్కారీ వార్తలు రాసే సర్కారీ జర్నలిష్ట్ అనే ముద్ర నుంచి తప్పించుకోలేకపోవడం విచిత్రం. బహుశా, పాలక పక్షాలకు ఎలాటి రాతలు, ఎలాటి వార్తలు రుచిస్తాయో అవగతం చేసుకుని అందుకు తగ్గట్టుగానే వార్తలు వండి వడ్డించి వుంటామని అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు.
రేడియో వార్తల
సేకరణ, కూర్పు, ప్రసారాల్లో 'విధి నిర్వహణా స్వేచ్ఛ' గురించి
సోదాహరణంగా చెప్పుకోవడం సముచితంగా వుంటుంది.
నర్రావుల
సుబ్బారావు గారు. మోచేతుల కిందకి చొక్కా, పంచెకట్టుతో, చేతిలో చుట్టతో అచ్చం ఒక రైతు మాదిరిగా కనిపించేవారు. ఆయన్ని చూడగానే హైదరాబాదు ఆకాశవాణి
ప్రాంతీయ వార్తావిభాగంలో న్యూస్ ఎడిటర్ అని ఎవరూ అనుకోరు. ఆకారంలోనే కాదు, నిజంగానే ఆయన రైతు
పక్షపాతి. ఆ నైజం వార్తల్లో కూడా ప్రతిఫలించేది. వర్షాలు కురవక పలానా జిల్లాలో
పైర్లు ఎండిపోతున్నాయని వార్తల్లో వివరాలతో సహా ప్రసారం చేసేవారు. ఆ రోజుల్లో
ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఆయన మాటకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో
ఎదురులేదు. అయినా సుబ్బారావు గారు తరువాత అనేక సంవత్సరాలు రేడియోలో కొనసాగారు.
ఒకసారి
ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో
సుబ్బారావు గారు లేచి పలానా ప్రాంతంలో పంటలు ఎండి పోతున్నాయని, అధికారులు చేతులు
ముడుచుకుని కూర్చున్నారని అన్నారు ఆయన తరహాలో. చెన్నారెడ్డి గారి తరహా కూడా
విలేకరులకు తెలుసు. ఆ ప్రశ్న ఆయనకు సుతరామూ నచ్చలేదు. అది ఆయన మాటల్లో కనబడింది.
“చూడు సుబ్బారావ్!
నువ్వు విలేకరిగా ఈ ప్రశ్న వేస్తే జవాబు చెబుతాను. రైతుల ప్రతినిధిగా వేస్తె ఇక్కడ
సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు”
ఇరువురూ హుందాగా
వ్యవహరించడంతో రసాభాస కాకుండా అది అక్కడకి ముగిసిపోయింది.
రేడియోమీద కానీ, రేడియో వార్తలమీద
కానీ సర్కారువారికి పట్టో, పెత్తనమో వుంటుందని ఆ రోజుల్లో ఓ అభిప్రాయం ప్రచారంలో వుండేది. ఇలాటి
ఉదంతాలు విన్నప్పుడు వాటికి సరైన ప్రాతిపదిక లేదన్న వాస్తవం బోధపడుతుంది.
నా ఈడువాడే, కొంచెం చిన్నవాడు
కూడా ఓ జర్నలిస్టు స్నేహితుడు ఉండేవాడు. ప్రముఖ పత్రికలో పనిచేసేవాడు. నన్ను
ఎప్పుడూ సర్కారీ జర్నలిస్ట్ అని ఎద్దేవా చేస్తుండేవాడు. నేనొకసారి అతడితో అన్నాను.
‘గంటలో ప్రాంతీయ
వార్తలు వస్తాయి. నువ్వు ఒక వార్త ఇవ్వు ఏదైనా సరే. అది రేడియోకి ఇస్తాను. అలాగే
నేను నీకొక వార్త చెబుతాను. అది రేపటి నీ పత్రికలో వచ్చేట్టు చూడు. ఆ తర్వాత
జర్నలిస్టుల స్వేచ్చ గురించి తీరిగ్గా మాట్లాడుకుందాము’
అతడు చెప్పిన
వార్త రేడియోలో వచ్చింది. నేను చెప్పిన వార్త అతడి పేపర్లో రాలేదని వేరే
చెప్పక్కరలేదు. మరునాడే కాదు, ఎప్పటికీ రాదని
అతడికీ తెలుసు.
ఆ తర్వాత
అతడెప్పుడూ సర్కారీ జర్నలిస్టు అనే పదం నా వద్ద తేలేదు.
15, ఏప్రిల్ 2021, గురువారం
మా మంచం కధ – భండారు శ్రీనివాసరావు
పెళ్ళయి, కాపురం పెట్టిన పదేళ్లకు కాబోలు మొట్టమొదటిసారి మొదటి మంచం కొనుక్కున్నాము. ఇందుకోసం నేనూ మా ఆవిడా కలసి పెద్ద సర్వేనే చేసాం. ఎక్కడమంచివి కొనుక్కోవచ్చని కాదు, ఎక్కడ కారు చౌకగా దొరుకుతాయా అని.
మొత్తం మీద లక్ డి
కా పూల్ టెలిఫోన్ భవన్ దగ్గర మాకు తగ్గ షాపువాడు ఒకడు దొరికాడు. డెకొలం షీట్ వేసిన
సింగిల్ కాట్స్ రెండూ కలిపి రెండువందల యాభయ్ రూపాయలు. షాపువాడే రిక్షాలో వేసి
పంపిస్తానన్నాడు. సాయంత్రానికల్లా అవి దిగాయి. వున్న రెండు గదుల్లో ఒక రూమును
ఫినాయిల్ వేసి కడిగి సిద్ధంగా ఉంచాము. మంచాలు వేయగా కాస్త
కాళ్ళు కదపడానికి కాసింత జాగా మిగిలింది. మంచాలు అయితే వచ్చాయి కానీ వాటిమీద
పరుపులు కొనడానికి మళ్ళీ ఒక నెల ఆగాల్సి వచ్చింది. ఏ పని చేయాలన్నా ఫస్ట్ తారీకు
రావాలికదా.
మొత్తం మీద
పరుపులు కూడా అమిరాయి. ఇక ఆ మంచాలే మాకు సర్వస్వం అయిపోయాయి. నలుగురు కూర్చుని
ముచ్చట్లు చెప్పుకోవాలన్నా, చీట్ల పేకలు ఆడుకోవాలన్నా, ఆ మంచాల మీదనే.
డైనింగ్ టేబుల్ అమిరేవరకు టిఫిన్లు, భోజనాలు కూడా
వాటిమీదనే. నిజం చెప్పొద్దూ భోజనాల బల్లలు కొనుక్కున్న తర్వాత కూడా మంచాల మీద
కూర్చునే అన్నాలు తినేవాళ్ళం.
ఉండడానికి మరో
రూము వుంది కానీ, ఆ గది పగలల్లా అమ్మవొడి. అంటే మా ఆవిడ నడిపే చైల్డ్ కేర్ సెంటర్ అన్నమాట.
పదిహేను ఇరవైమంది పసిపిల్లలు, చిన్న పిల్లలతో
కీసర బాసరగా వుండేది. సాయంత్రం కాగానే శుభ్రంగా కడిగించి వుంచేది. ఇక అప్పటినుంచి
అది పర్మిషన్ అక్కరలేని పేకాట క్లబ్ గా మారిపోయేది. పెద్దపెద్ద వాళ్ళు
సాయంత్రానికల్లా అక్కడ జమయ్యేవాళ్ళు. అలా కాలక్షేపం చేసిన
వాళ్ళు చాలామంది జీవితంలో చాలా పెద్ద స్థానాలలోకి
చేరుకున్నారు. ఇక మా ఆవిడ అమ్మవొడిలో పెరిగిన పిల్లలు అనేకమంది
ఇప్పుడు విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
ఇలా అందరికీ
కలిసొచ్చిన ఆ చిక్కడపల్లి ఇల్లు ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్ మెంటుగా మారిపోయింది.
మాస్కో వెళ్ళేంతవరకు మేము ఆ ఇంట్లోనే అద్దెకు ఉన్నాము. ముప్పయ్యేళ్ళ తరవాత కూడా ఆ
ఏరియాలో అమ్మవొడి అంటే గుర్తుపట్టేవాళ్ళు వున్నారు.
సందర్భం వచ్చింది
కాబట్టి ఓ విషయం చెప్పుకోవాలి. నేను ఉదయం ఆరుగంటల కల్లా బయలుదేరి ఆఫీసు కారులో
రేడియో స్టేషన్ కు వెళ్లి పొద్దుటిపూట
ప్రసారం అయ్యే న్యూస్ బులెటిన్ తయారుచేసి వార్తల అనంతరం
ఏడున్నర కల్లా మళ్ళీ ఇంటికి చేరేవాడిని. అలా అప్పుడు పక్క ఎక్కితే
మళ్ళీ మిట్ట మధ్యాన్నమే దిగడం. తర్వాత సెక్రెటేరియేట్ లో మంత్రులు, లేదా ముఖ్యమంత్రి
ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ఫరెన్సులు కవర్ చేసుకుని, ఆఫీసుకు వెళ్లి
రిపోర్టులు ఫైల్ చేసి సాయంత్రం ఇంటికి
వచ్చేవాడిని. ఇది ఎవరికంటా పడలేదు కానీ, నేను పొద్దస్తమానం
ఇంట్లో పడివుండడం మాత్రం ఇరుగింటి పొరుగింటి అమ్మలక్కల కంటపడింది. నాకు ఉద్యోగం
లేదనీ, అందుకే ఇల్లు నడపడానికి మా ఆవిడ ఇలా కేర్ సెంటర్ నడుపుతోందని వాళ్లకి
వాళ్ళే తీర్మానించుకుని మా ఆవిడమీద బోలెడు జాలి, నా మీద లేనిపోని
అక్కసు పెంచుకున్నారు (ట). ‘ సెక్రెటేరియేట్ లో మా వారికి తెలిసిన వాళ్ళు
వున్నారు. ఏదో కొలువు ఇప్పిస్తారు, మీ వారిని ఓసారి కలవమని చెప్పండి’ అన్నదో ఆవిడ నేరుగా మా
ఆవిడతోనే.
ఆ అమ్మలక్కలు
అందించిన ఆ ఆయుధం నన్ను ఆట పట్టించడానికి మా ఆవిడకు కొన్ని రోజులు బాగా ఉపయోగపడింది.
ఇప్పుడా ఆటలు, మాటలూ అన్నీ
గతకాలపు ముచ్చట్లు.
గుళికలు – భండారు శ్రీనివాసరావు
తెలుస్తూనే వుంది సంబడం
కొడుకు : రీటా ఆంటీ తెలుసా అమ్మా!
తల్లి: తెలియదురా ఎవరావిడ?
కొడుకు: అదేమరి.
ఎప్పుడూ టీవీ సీరియళ్లు అని కాలక్షేపం చేయకుండా అప్పుడప్పుడన్నా నాన్న ఏం
చేస్తున్నాడో ఓ కంట కనిపెట్టి చూడమని చెప్పేది అందుకే!
ఏపీ రాజకీయ చిత్రం – భండారు శ్రీనివాసరావు
14, ఏప్రిల్ 2021, బుధవారం
చేదు గుళికలు - భండారు శ్రీనివాసరావు
రాజకీయ శ్రవణానందాలు - పంచాంగ శ్రవణాలు