11, ఏప్రిల్ 2019, గురువారం

ఓటు వేయ తరమా! ఓటు వేసి చూడు! ఓటు వేయగలవా ఓ నరహరి!


నేను రాయబోయేదానికి పై మూడు టైటిల్స్ పనికి వస్తాయని అలాగే ఉంచేశాను.
మిట్ట మధ్యాన్నం పన్నెండు గంటలకు టీవీ చర్చల నుంచి బయట పడి ఇంటికి వెళ్లి మా ఆవిడను తీసుకుని నడకకు ఎక్కువా ఆటోకి తక్కువగా అనిపించే  దూరంలోవున్న పోలింగు  కేంద్రానికి వెళ్లాను. రెండు ఫర్లాంగుల బయటే ఆపేశారు. దిగి నడుచుకుంటూ వెళ్ళాము. తీరా వెళ్ళిన తరవాత స్లిప్పులు పట్టుకు రండి అన్నారు. ఇంట్లో ఇవ్వలేదు అంటే బయట టేబుళ్లు వేసుకుని కూర్చుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఆ ఎండలో నడుచుకుంటూ వెడితే ఇక్కడ కాదు పోలింగు కేంద్రానికి అటువైపు ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఆపసోపాలు పడుతూ అటు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మొబైల్ యాప్ సాయంతో పోలింగు కేంద్రం నెంబరు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు. అలాగే వెళ్లాం. మొబైల్ లో సెల్ డిశ్చార్జ్ అయింది కాసేపు ఆగమన్నారు. ఎండలో నిలబడలేక వాళ్ళు కూర్చున్న కుర్చీల వెనుకనే నిలబడ్డాము. మొత్తం మీద ఓ పదిహేను నిమిషాల తర్వాత మా చీట్లు చేతిలో పెట్టారు. మళ్ళీ పోలింగు కేంద్రానికి వెళ్ళాము. పెద్దగా  జనం లేరు కానీ కొంత క్యూ వుంది. మొత్తానికి మా టర్న్ వచ్చింది. అక్కడి ఉద్యోగి ఎర్రరంగు పెన్ను కింద పడేసుకుని వెతుకుతున్నారు. ఓటరు వేలిపై సిరా చుక్క పెట్టేముందు ఎర్ర పెన్నుతో జాబితాలో మా పేర్లపై సున్నా చుట్టాలిట. అదో నిబంధన అట. ఎట్టకేలకు కొందరి కాళ్ళ కిందకు దొర్లిపోయిన ఆ పెన్ను ఆచూకీ దొరికింది. మేము ముందుకు కదిలాము. మీకు నచ్చిన అభ్యర్ధి పక్కన వున్న నీలం రంగు మీట నొక్కండి. పక్కన వీవీ ఫ్యాట్ లో సరిచూసుకున్న తర్వాతనే బయటకు రండి అని అక్కడి అధికారి చాలా సౌమ్యంగా వివరించారు. పదిహేను నిమిషాల్లోనే ప్రజాస్వామ్య క్రతువులో మేము సైతం  మా సమిధను వేశామన్న తృప్తితో బయట పడ్డాము.
ఈ పని, అంటే పోలింగు కేంద్రం నెంబరు కనుక్కోవడానికి ఇంతటి లాయలాస అక్కర లేదు ఇంట్లోనే ఆన్ లైన్ లో చూసుకోవచ్చు. ఈ సంగతి తెలియక కాదు. రాత్రి ఓ రెండు గంటలు ఆ పనిలోనే వుండి ఇక అది నా వల్ల అయ్యే పని కాదని అర్ధం అయి విరమించుకున్నాను.
వెనకటి రోజుల్లో  ఆయా పార్టీల వాళ్ళు ఈ చీట్లు ఇళ్లకే వచ్చి ఇచ్చి  వెళ్ళేవారు. ఇప్పుడా ఆనవాయితీ పాటిస్తున్నట్టు లేదు. ఏవయినా నిబంధనలు అడ్డు వచ్చాయేమో తెలియదు.
చివరాఖరుగా చెప్పేది ఏమిటంటే పోలింగు కేంద్రం వద్ద అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు కొందరు పలకరించారు. ఓటు విలువ గురించి మీరు టీవీల్లో చెప్పే సంగతులు బాగుంటాయని ఓ కితాబు ఒకటి.
ఓటు వేయడం మీరు చెబుతున్నంత సులువేమీ కాదు అనే అర్ధం అందులో నాకు గోచరించింది. 

10, ఏప్రిల్ 2019, బుధవారం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్నా


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఈ మధ్యాన్నం  అమరావతిలోని సీయీఓ కార్యాలయానికి వెళ్లి తొమ్మిది పేజీల మెమొరాండం ఎన్నికల ప్రధాన అధికారికి అందచేశారు. ఆ తర్వాత ఆ కార్యాలయం ఎదుటే తమ పార్టీ నాయకులతో కలిసి ధర్నాకు కూర్చున్నారు. రేపు ఉదయం పోలింగు మొదలవుతుంది అనగా ఈరోజు ఈ పరిణామం చోటు చేసుకోవడం సహజంగానే చర్చనీయాంశం అయింది.  సిఈఓ ఆఫీసు ఎదుట ఒక ముఖ్యమంత్రి ధర్నా చేయడం ఇదే మొదటి సారి. అయితే గతంలో వేర్వేరు కారణాలతో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ హోదాలోనే ధర్నాలకు దిగిన దృష్టాంతాలు వున్నాయి.
శ్రీ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆనాటి ఆర్ఎస్ఎస్ నేత సుదర్శన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి గురించి అవమానకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రోశయ్య కూడా ధర్నాలో పాల్గొన్నారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా ధర్నా చేశారు. పరిపాలనా వ్యవహారాల్లో గవర్నర్ కిరణ్ బేడి జోక్యం మితిమీరి పోయిందన్నది ముఖ్యమంత్రి ఆరోపణ. దాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఆ నిరసన మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు.
పొతే మరో తాజా ఉదాహరణ మమతా బెనర్జీ. కేంద్రం తమ ప్రభుత్వాన్ని, తన అధికారులను సీబీఐ వేధింపులకు గురిచేస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ ధర్నాకు దిగారు. రెండు రోజుల నిరసన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోల్ కటా వెళ్లి మమతా బెనర్జీ చేత దీక్ష విరమింప చేసిన సంగతి తెలిసిందే.
అధికారంలో ఉన్న ప్రభుత్వాల అధినేతలే కేంద్ర ప్రభుత్వం తమపై కక్షతో వ్యవహరిస్తోందని నిరసన దీక్షలు చేస్తున్నారు సరే. అది వారికి ప్రజాస్వామ్యం  ప్రసాదించిన హక్కు.
మరి అలాగే, సామాన్యులు కూడా అధికార దర్పాలకు గురవుతూ మౌనంగా వుండిపోతున్నారు తప్ప ఆఫీసుల ముందు ధర్నాలకు దిగడం లేదు. ప్రభువులు అలాంటివారిని కూడా గమనంలో పెట్టుకోవాలి.           

AP voters eyes on which party? || Election Watch - TV9





ఈరోజు బుధవారం ఉదయం  మురళీకృష్ణ నిర్వహించిన  Election Watch  చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కృష్ణారావు (సీనియర్ జర్నలిస్ట్), శ్రీ ఇనగంటి రవి (ఎన్నికల ఫలితాల విశ్లేషకుడు), శ్రీ వీవీ రావు ( ఎన్నికల నిఘా వేదిక)

9, ఏప్రిల్ 2019, మంగళవారం

KSR Live Show | Landslide Win for Jagan Reddy in Andhra - 9th April 2019





ప్రతి  మంగళవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం సాక్షి టీవీ ఛానల్  KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాగోన్నవారు: శ్రీ అజయ్ కల్లాం (మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి)

KSR Live Show | Landslide Win for Jagan Reddy in Andhra - 9th April 2019





ప్రతి  మంగళవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం సాక్షి టీవీ ఛానల్  KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాగోన్నవారు: శ్రీ అజయ్ కల్లాం (మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి)

8, ఏప్రిల్ 2019, సోమవారం

Why Chandrababu Naidu and YS Jagan Neglecting Local Issues? | The Debate...





ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7  న్యూస్  చానల్  The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కే.పీ. చేకూరి (టీడీపీ), శ్రీ సాయి కృష్ణ (బీజేపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ ( జనసేన), శ్రీ చలసాని శ్రీనివాస్ ( ప్రత్యేక హోదా సాధన్ సంఘం నేత),  శ్రీమతి వాసిరెడ్డి పద్మ (వై.ఎస్.ఆర్.సీ.పీ.)

Will YS Jagan Accept Pawan Kalyan Challenge over AP Special Status? | Th...



ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7  న్యూస్  చానల్  The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కే.పీ. చేకూరి (టీడీపీ), శ్రీ సాయి కృష్ణ (బీజేపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ ( జనసేన), శ్రీ చలసాని శ్రీనివాస్ ( ప్రత్యేక హోదా సాధన్ సంఘం నేత),  శ్రీమతి వాసిరెడ్డి పద్మ (వై.ఎస్.ఆర్.సీ.పీ.)