Husband and Wife లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Husband and Wife లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, ఆగస్టు 2013, శనివారం

మనసు మాట్లాడుతుందా? యేమో?


భార్యాభర్తల నడుమ మాటలు తక్కువ అనే అపకీర్తి సమాజంలో వుంది. ఇందులో నిజమెంతో తెలవదు.
మొన్న ఖమ్మం ఓ పెళ్ళికి వెళ్ళి వచ్చాం. గాలి మార్పో, నీటి  మార్పో తెలియదు. తనకు ఒకటే రొంప. ‘ జలుబు వెలగని బలుబు’ అన్నారు ముళ్లపూడి వారు.
ఈరోజు అంటే ఈ రాత్రి ఓ రాత్రివేళ చూస్తే తను పక్కనలేదు. లేచి చూస్తే పూజగదిలో ఓ దుప్పటి కప్పుకుని పడుకుని వుంది.
పొద్దున్నే నేను ఓ ఛానల్ కు వెళ్ళాలి. పక్కన పడుకుంటే జలుబు అంటుకుంటుందేమో అని ఆలోచించి ఈ పని చేసి వుంటుంది.
మనసుతో మాట్లాడ్డం అంటే ఇదేనేమో! 



(31-08-2013)