ఏదో సినిమాలో నటుడు నాగభూషణాన్ని ఎవరో
అడుగుతారు ‘మీరేం చేస్తుంటార’ని. ఆ పాత్రలో నాగభూషణం చెప్పిన జవాబు. “దానధర్మాలు
చేస్తుంటాను” ఆయనకి అది తప్ప మరోటి చేతకాదు.
“ఏమిటి మీరిలా రాస్తూనే వుంటారు”
కొందరు మిత్రులు నన్ను ఆరా తీస్తుంటారు. నాదీ అదే పరిస్తితి.
“రాయడం తప్ప నాకు ఇంకోటి చేతకాదు”