సింగపూర్లో కేసీఆర్ - చిన్న మా ఫామిలీ టచ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సింగపూర్లో కేసీఆర్ - చిన్న మా ఫామిలీ టచ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఆగస్టు 2014, గురువారం

సింగపూర్లో కేసీఆర్ - చిన్న మా ఫామిలీ టచ్


తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ పర్యటనలో భాగంగా హోటల్ రిట్జ్ లో భారత పారిశ్రామిక సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. ఆదిత్య కృష్ణ రాయ్ అనే ఒక తెలుగు  యువకిశోరం ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. మీరు చూస్తున్న ఫోటోలో కేసీఆర్ తో కనబడుతున్న శాల్తీ ఆదిత్యే. ఈ ఆదిత్య  యవరయ్యా అంటే మీలో చాలామందికి తెలిసిన నా క్లాస్ మేట్ వనం జ్వాలా నరసింహారావు కుమారుడు. జ్వాలా ఎవరయ్యా అంటే కేసీఆర్ సీపీఆర్వో. సీఎం తో ఆదిత్య కలయికకి జ్వాలా ఉద్యోగానికి ఎంతమాత్రం సంబంధం లేదు. ఈ ఆదిత్య యవరయ్యా అంటే  సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా పసిఫిక్ దేశాలకు గూగుల్ సంస్థ హెచ్ ఆర్ డైరెక్టర్. అంతే  కాదు వాడికి ఇంకో  హోదా వుంది. అది ఇంకా గొప్పది.  అదేమిటయ్యా అంటే ఆదిత్య మా మేనకోడలు విజయలక్ష్మి ఏకైక పుత్రుడు.



(కేసేఆర్ తో ఆదిత్య)