1970. అంటే నలభయ్ ఏడేళ్ళ నాటి ముచ్చట.
బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్
ఎడిటర్ గా చేరిన తొలి రోజులు. ఎడిటర్ నార్ల గారు హైదరాబాదుకు మకాం మార్చడంతో
నండూరి రామమోహన రావు గారే పత్రిక బాధ్యతలు చూస్తున్నారు.
“ఏం రాయమంటారు?”
నండూరి వారికి నా ప్రశ్న.
“ఏదైనా రాయండి, ఏమి రాసినా అది మీకు ముందు అర్ధం అయిందా లేదా చూసుకోండి”
నండూరి వారి జవాబు.