క్రియ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
క్రియ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, నవంబర్ 2017, మంగళవారం

మరో మంచి లక్ష్యం దిశగా తెలంగాణా ప్రభుత్వం

నేను రేడియోలో పనిచేసే రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తుమ్మల నాగేశ్వర రావు గారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఆయన మా రేడియోకు ప్రధాన శ్రోత. రోడ్డుమార్గాన  ఖమ్మం జిల్లాకు వెళ్లి వస్తున్నప్పుడు, మధ్యాన్నం 1.10  లేదా  సాయంత్రం  6.15  అయితే చాలు, మంత్రి గారు ప్రయాణిస్తున్న మోటారు వాహనం రోడ్డు పక్కన నిలిచిపోయేది. ప్రాంతీయ వార్తలు పూర్తిగా విన్న తరువాత మళ్ళీ బయలుదేరేది. (అప్పట్లో ఇప్పటి నాలుగు లేన్ల రహదారి లేదు, అంచేత ఎక్కడపడితే అక్కడ కారు ఆపుకునే వెసులుబాటు వుండేది)

ఇప్పుడు  కూడా నాగేశ్వర రావు గారు తెలంగాణా ప్రభుత్వంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు ఈ మధ్య వేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆయన చైర్మన్. లోగడ 108, 104 పధకాల రూపకల్పనలో పాలుపంచుకున్న తెలంగాణా బిడ్డలు డాక్టర్ ఏ.పీ.రంగారావు, డాక్టర్ బాలాజీ ఊట్ల, ‘క్రియ’ సంస్థ ఆధ్వర్యంలో గత కొద్ది కాలంగా హైదరాబాదు, విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించేందుకు 1033 అంబులెన్స్ సర్వీసుకు రూపకల్పన చేసి నూతన సాంకేతికపరిజ్ఞానంతో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. తుమ్మల నాగేశ్వర రావు గారు ఈ ప్రయోగ వివరాలను తెలుసుకుని వారిద్దరినీ క్యాబినెట్ ఉపసంఘం సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కావాల్సిందని కోరారు. ఈ నెల పదో తేదీన జరిగే తొలి సమావేశంలో తగిన చర్చలు జరిగి,  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన ఫలితాల సాధన దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.    

10, మార్చి 2017, శుక్రవారం

‘క్రియే’టివిటీ



“సర్లెండి, మీకు ఉదయం తిన్న కూరే గుర్తుండదు, ఇక మనుషుల్ని ఎక్కడ గుర్తు పడతారు’ అంటుంది మా ఆవిడ.
ఇంటిలిఫ్టులో ఒక పెద్ద మనిషి తారస పడ్డాడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేనూ బదులుగా చిరునవ్వు నవ్వి ‘ఎవరింటికండీ’ అన్నాను. ఆయన గతుక్కుమన్నట్టు అనిపించింది. తరువాత చెప్పింది మా ఆవిడ, ఆయన మా పక్క అపార్టుమెంటు ఓనరని.
ఇళ్ళల్లో సంగతి ఏమో కాని, ఆఫీసుల్లో ప్రత్యేకించి టీం వర్కు అవసరం వున్న కార్యాలయాల్లో పనిచేసేవారికి ఒకరికొకరు తెలిసివుండడం అన్నది చాలా అవసరం.
బహుశా ఈ ‘సంస్కృతి’  పెంచాలనే ఉద్దేశ్యంతో కాబోలు ‘క్రియ’ సంస్థలో సిబ్బందికి ఒక పోటీ నిర్వహించారు. గాలి ఊదిన బెలూన్లపై పనిచేసే సిబ్బంది పేర్లు రాసివుంటాయి. ఒకొక్కరూ వెళ్లి ఒక బెలూన్ తీసుకుని దానిపై పేరు రాసి వున్న సొంతదారుకు వాటిని అందచేయాలి. ఇలా సరిగ్గా చేయగలిగితే పనిచేసే వారందరూ ఒకరికొకరు తెలిసినట్టు లెక్క. సిబ్బందిలో ‘బృంద సంస్కృతి’ పెంచడానికి ఇటువంటి ‘క్రియేటివిటీ’ కార్యక్రమాలు చాలా అవసరం అనిపించింది.