6, ఫిబ్రవరి 2021, శనివారం

మౌనమే మీ భాష .... భండారు శ్రీనివాసరావు

 ఒకప్పుడు (ఇప్పుడు కాదు) కమ్యూనిస్ట్ పార్టీలు గురించి చెప్పుకునేవారు, అంతర్గత సమావేశాల్లో విధాన నిర్ణయాలు గురించి పొట్టు పొట్టయినా, బయటకి మాత్రం అందరూ ఒకే మాట మీద ఉంటారని. ఇప్పుడు అన్ని పార్టీలది ఇదే వరస. పై వాళ్ళు ఏది చెబితే అట్టడుగు కార్యకర్త వరకు అందరిదీ అదే మాట. ఒకే మాట. అంతేకాదు, టీవీ చర్చల్లో పాల్గొనే పార్టీల అధికార ప్రతినిధులు, ఆఖరికి సోషల్ మీడియా కార్యకర్తల  వరకు  అందరూ పొల్లుపోకుండా ఒకటే మాట మీద వుండడం ఈ ప్రజాస్వామ్య దేశంలో విచిత్రమే అనిపిస్తుంది.  ఒకప్పుడు నెహ్రూ మంత్రివర్గంలో ఉన్న సర్దార్  వల్లభాయ్ పటేల్, ప్రధాని మాటకు ఎదురు చెప్పేవాడని,  పటేల్  ధైర్య సాహసాలకి అది  నిదర్శనం అని గొప్పగా చెప్పుకుంటూ వుంటాం.

ఈనాడు అలా అధిష్టానం మాటకు ఎదురు చెప్పగల  పటేల్ వంటి నాయకులు ఎవరూ కానరావడం లేదు. అంతా ఒకే మాట మీద నిలబడి వున్నందుకు సంతోషపడాలో, లేక మరోమాట చెప్పే స్వతంత్రం లేని రాజకీయ వ్యవస్థలో వున్నందుకు ఖేదపడాలో అర్ధం కాని పరిస్థితి.

గృహస్తు ఇంటి పెద్ద కావచ్చు. కానీ ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ సబబే అని చెప్పలేం. అలానే  ప్రభుత్వాలు, పార్టీలని ఆజమాయిషీ చేసే నాయకులు కూడా అన్నీ మంచి నిర్ణయాలే తీసుకుంటారని అనుకోలేం.

ప్రజాస్వామ్య  వ్యవస్థలో  అది పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చర్చ జరిగేంతవరకు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకసారి నిర్ణయం అయ్యాక ఇక చర్చలు అనవసరం. (06-02-2021)

 

2 కామెంట్‌లు:

bonagiri చెప్పారు...

పొట్టు పొట్టయినా...
అంటే ఏమిటండి?

Zilebi చెప్పారు...



మీరన్నది సబబండి :) మాదీ అదేవమాటండి వేరే మాటే లే దండి :)