17, జులై 2020, శుక్రవారం

నిలువెత్తు వెంకన్న

మూడేళ్ళ నాటి ఓ పచ్చి జ్ఞాపకం - ఓ పచ్చని జ్ఞాపకం

నిలువెత్తు వెంకన్న
అండపిండ బ్రహ్మాండాలను మించినవాడు, అణువులో కూడా ఇమిడేవాడు ఆయనకి చిన్నా పెద్దా తేడాలు ఏమిటి?
అయినా మనిషి కళ్ళకు, మనిషి మనసుకు అన్నీ కొలతలే! యెంత పెద్దగా వుందో అని అనుకోకుండా ఉండలేం.
ఈ వేంకటేశ్వర స్వామి కొయ్య విగ్రహం మా అన్నయ్య మూడో కుమారుడు లాల్ బహదూర్ భండారు ఇంట్లో కొలువు తీరింది.
ఈ చక్కని చెక్క బొమ్మ లాల్ వాళ్ళ ఇంటికి చేరడానికి ఓ చిన్న నేపధ్యం వుంది. అదేదో మా అన్నయ్య భండారు రామచంద్ర రావు గారి మాటల్లోనే:

"ఇంత పెద్ద స్వామి వారి విగ్రహం మా అబ్బాయి లాల్ ఇంటికి రావడానికి ఒక చిన్న సంఘటన ఉంది . ఆ విగ్రహాల షాప్ లో విధేయుడుగా చాలా సంవత్సరాల నుంచీ పనిచేస్తున్న వ్యక్తికి ఆ షాపు యజమాని ఈ విగ్రహాన్ని బహుమతి గా ఇచ్చాడు . ఆ వ్యక్తి మా అబ్బాయి ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు చేస్తూ మా అబ్బాయికి , కోడలుకు సన్నిహితం గా ఉంటాడు .మా అబ్బాయి కుటుంబం పట్ల అభిమానం , కృతజ్ఞతలతో ఒకరోజు చెప్పకుండా వచ్చి ఈ దేవుడు మీ ఇంట్లోనే ఉండాలి అంటూ పెట్టిపోయాడు .చాలా గొడవ చేసి ,బలవంతం చేస్తే ఏదో కొంచెం డబ్బులు అతి కష్టం మీద తీసుకున్నాడు .
చిన్న వాళ్లకు కూడా పెద్ద హృదయాలు ఉంటవి అనటానికి ఆ షాప్ ఓనర్ మరియు చిన్న పనులు చేసుకునే ఆ వ్యక్తి ఇద్దరూ నిదర్శనం .
మా తమ్ముడి భార్య మా పిల్లలను తన పిల్లలాగా చూసుకొనేది. తను ముచ్చట గా తీయించుకున్న ఫోటో ఇది.



2 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

ఇటువంటి విగ్రహం కొనాలంటే కొన్ని లకారాలు పెట్టాలి. వెంకటేశ్వర స్వామి కన్నా ఆ వ్యక్తి ఉన్నతుడుగా కనిపిస్తున్నాడు. మీ దంపతులూ మరియు వెంకటేశ్వర స్వామిన్నూ చాలా బాగున్నారు..నమో వెంకటేశాయ నమ:

Zilebi చెప్పారు...



వెంకన్న దయ కలిగితే తస్సాదియ్యా .....


:)


జిలేబి