11, జులై 2018, బుధవారం

ఎంతమంది చదువుతారు? – భండారు శ్రీనివాసరావు


లక్ష సర్క్యులేషన్ వున్న పత్రికలో మన వ్యాసం అచ్చవుతే ఆ లక్షమందీ దాన్ని చదువుతారు అనుకోవడం ఓ భ్రమ. కాకపొతే ఎక్కువమంది  కళ్ళల్లో పడే అవకాశం ఎక్కువ. కాదనను.
ప్రేమలేఖను ఎంతమంది చదువుతారు చెప్పండి. ప్రేయసి ఒక్కరు చదివితే చాలని మురిసిపోతాడు ప్రియుడు.
నలుగురూ చదవాలనే ఏ రచయిత అయినా కోరుకుంటాడు. అయితే ఆ ‘నలుగురు’ లక్షమంది కావచ్చు, ‘నలుగురే’ కావచ్చు.
అందుకే నేను రాసేది ప్రతిదీ ఇటువంటి సాంఘిక మాధ్యమాలలోనే పోస్ట్ చేస్తాను.
నాకిదో ‘తుత్తి’

6 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

ఒకప్పుడు చదవాలనే తాపత్రయం ఉండేది.

రోడ్డు మీద దొరకిని చిత్తుకాగితం ముక్కనైనా, గ్రంథాలయాల్లో దొరికిన నా వయస్సుకు మించిన అధ్యత్మికగ్రంథాలనైనా దేనినీ వదిలే రకం కాను నేను. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు రాత్రి కిరాణాకొట్లో ఏదో సరుకు తీసుకొని రమ్మంటే తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఏదో కాగితం దొరికితే దారివెంట వస్తున్న లారీ లైట్ల వెలుగులో చదివేందుకు ప్రయత్నించాను. లారీవాడు దాన్ని ఆపి నన్ను చెవిపుచ్చుకొని ఇంటికి లాక్కుపోయి విషయం చెప్పి బాగా చీవాట్లు వేయించాడు.

బ్లాగుల్లో వ్రాయటం మొదలుపెట్టిన క్రొత్తలో ఎవరన్నా చదువుతున్నారా అని కుతూహలంతో నిత్యం పరిశీలించేవాడిని. ఎవరూ చదవటం లేదని విచారపడ్డ సంఘటనలూ ఉన్నాయి. చివరికి రాముడికోసం వ్రాస్తున్నప్పుడు ఆయనొక్కడూ చదివితే చాలదా అన్న మాట తట్టటంతో శాంతించాను.

ఇప్పుడు చదవాలన్న అసక్తి బాగా తగ్గింది.
ఇప్పుడు వ్రాయాలన్న ఆసక్తి కూడా బాగా తగ్గింది.

దారిదొకికే దాకానే పుస్తకాల వలన ఉపయోగం అన్నాడు మిలారేపా.
రాయక పోతేనేం అన్నాడు చలం చివరకి.

M KAMESWARA SARMA చెప్పారు...

ఏ అక్షరాన్నైనా కాగితం తనలో దాచుకుంటుంది గాని కొన్ని అక్షరాలే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయని మీకు తెలియందికాదుగా మాస్టారు. ఆర్టికల్ బాగుంటే ఒకటికి రెండు సార్లు చదువుతారు , నలుగురికి చదవమని రిఫర్ చేస్తారు. వాసి కదా ముఖ్యం రాసి కన్నా. ఎన్నో పుస్తకాలు కొంటాం దాచుకునేవి మాత్రం కొన్నే గదా

అజ్ఞాత చెప్పారు...

అసలు రచయితలు కష్టపడి రాసే బుచికి రచనలు చదివే ఓపిక ఎవ్వలికి లేదు.ఏదో ఆత్మ తుత్తి కోసం రాసుకుంటారు పాపం. పాతకాలం లో మాదిరి సంపుటాలు రాస్తే కిలోల లెక్కన అమ్ముకోవాల్సిందే.

శ్యామలీయం చెప్పారు...

అయ్యా Mk Sarma గారూ, వాసి కదా ముఖ్యం రాసి కన్నా అన్నది సత్యం. ఎన్నడూ నేను రాశి కోసం వ్రాసిన వాడను కానని దయచేసి గమనించ గలరు.

నీహారిక చెప్పారు...

మీరు కాలేజీ చదువుకునే రోజుల్లో "ఊసుపోక" అని ఒక ప్రేమలేఖ వ్రాసానని ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ వ్రాసారు.ఇపుడది పోస్ట్ చేస్తారా ?
సొంతంగా వ్రాయలేనివారికి పనికివస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

శ్యామల్ సార్. శర్మ గారు ఎదో చెబితే మీరు ఎదో ఊహించుకొని వివరం ఇవ్వడం అవసరమా. ఎందుకో మీరు ప్రతి విషయానికి ఎక్కువగా స్పందించుతారు.