7, జులై 2018, శనివారం

అధికారం నోరు మూయిస్తుంది


సోవియట్ యూనియన్ లో స్టాలిన్  అనంతరం అధికారానికి వచ్చిన కృశ్చెవ్ వీలు చిక్కినప్పుడల్లా స్టాలిన్ విధానాలను తూర్పారబడుతుండే వాడు. నిజానికి స్టాలిన హయాములో కృశ్చెవ్ ఆయనకు కుడి భుజంగా ఉండేవాడు. స్టాలిన్  ఏం చెప్పినా  పెదవి విప్పి ఏమీ చెప్పలేకపోయేవాడు.
స్టాలిన్ తదనంతరం కృశ్చెవ్ సోవియట్ కేంద్ర కమిటీ అధినాయకుడిగా పదవి చేపట్టిన  తర్వాత ఆయన స్టాలిన్ ను పదేపదే  విమర్శించే తీరు కృశ్చెవ్ అనుయాయులకు విచిత్రంగా తోచేది. స్టాలిన్ జీవించి వున్న కాలంలో ఆయనకు వీర విధేయుడుగా ఉంటూ, ఆయన  ఏమి చెప్పినా గొర్రెలా  తల ఊపే కృశ్చెవ్ ఇతడేనా అనే అనుమానం వారిని తొలుస్తుండేది. ‘ఆ రోజునే ఇలా ఎందుకు మాట్లాడలేకపోయారు, ఇప్పుడెందుకు ఇలా దుయ్యబడుతున్నారు’ అని అడగాలని వారికి  వున్నా పైకి అనే ధైర్యం ఎవరికీ లేదు. ఒకరోజు  కృశ్చెవ్ ని ఒక యువ నాయకుడు ధైర్యం చేసి మనసులో మాట అడిగేశాడు. కృశ్చెవ్ నవ్వి ఇలా అన్నాడు.
‘మీరు ఈరోజు నా ముందు నోరు తెరిచి మాట్లాడగలుగుతున్నారా! ప్రతిదానికి తందానా అంటున్నారా లేదా! ఆరోజుల్లో నేనూ అదేపని  చేశాను’
ఇది ఒక జోక్ కావచ్చు. కేంద్రీకృత అధికార రాజకీయాలకు అద్దం పడుతుంది.
రోజూ టీవీ చర్చల్లో “మీరు ఆరోజు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు ఎందుకు నిలదీస్తున్నారు” అని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒకరిపై ఒకరు ప్రశ్నలు సంధించుకుంటూ వుంటే ఎందుకో ఏమో  ఈ జోకు జ్ఞాపకం వస్తుంటుంది.  

12 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

పోలిక అంత బాలేదండీ.

స్టాలిన్ మాటలకు తలూపకపొతే సైబీరియాకు తరిమేసే వాడు. మనది ప్రజాస్వామ్యం కనుక ఈ ప్రమాదం లేదు, మరెందుకు కష్టం?

bonagiri చెప్పారు...

ప్రజాస్వామ్యమా, అదెక్కడుంది? ఇక్కడున్నది అయిదేళ్ల రాచరికమే...

సూర్య చెప్పారు...

బొడిగుండుకి మోకాలికి లంకె కనిపిస్తోందేమిటి చెప్మా!

అజ్ఞాత చెప్పారు...

అద్సరే కానండి, రసియాను పక్కనెట్టేద్దాం. కూసింత పదునుగా, కాసింత లోతుగా ఉండే రాజకీయ విశ్లేషణల జోలికి మీరు పోరెందుకు మాస్టారు? మీలాంటి విషయ జ్ఞానమున్న వాళ్ళు కూడా, పట్టనట్లు లేదా మనకెందుకబ్బా అన్నట్లుగా కళ్ళ ముందు జరుగుతున్న పోసికోలు వ్యవహారాలను తూర్పారా పట్టకుండా వదిలెయ్యడం అసలేం బాలేదు సార్. ఉ|| చవటాయను నేను, నీకంటే పెద్ద చవటాయను నేను అంటూ తెల్లారుతూనే తమ బుర్రల్లోని గుజ్జంతా లోకమంతా దణ్ణానికి రంగు రంగుల్లో ఆరేసే బాబూ కొడుకులు తమ దృష్టికి అనరెందుకనో! అవున్లెండి, వాళ్ళు అలా రాసిన వాళ్ళను వెదికి వేటాడి, భుజబలంతో బొక్కలో వేసి బొక్కలిరగ్గొడదామని తహతహలాడుతుంటారని మరచేపోయాను. ఇదేంటి అలా ఎలా మర్చిపోయాను ఇప్పుడే కదా మీరు చెప్పారు అధికారం నోరు మూయిస్తుందని? అబ్బా! నిజాలు చెప్పే వాళ్లకు రోజులా ఇవి? సరే అలాక్కానిచ్చెయండి - సమయానికి తగు మాటలాడుతూ - కర్ర విరక్కుండా పాము చావకుండా. కాలక్షేపం బఠాణీలు - మీకూ - మాకూ.
మరోలా అనుకోకండేం!

నీహారిక చెప్పారు...

బాబూ కొడుకులు అంటే కేసీఆర్ గారిని ఉద్దేశ్యించి అన్నారా ?
అత్తమీద కోపం...సామెత గుర్తువస్తోంది.మీరెందుకు పేర్లు వ్రాయలేదూ ?

అజ్ఞాత చెప్పారు...

నిహారిక గారు, మొత్తం మీద పుట్టినింటిపై అభిమానాన్ని దాచుకోలేకపోయారు. బాబుని మించి బాబూ - లానే బాబుని మించి బాబూ --- ఇంతకీ నిజ్జంగానే వాళ్లెవరో మీకు అంతుబట్టలేదంటారు? అచ్చం వాళ్ళ మీడియా లానే విషయాన్ని ప్రక్కదారి పట్టించడానికి ఎంత తాపత్రయం? అవునవును వాళ్లిద్దరూ ఇప్పుడు జత కట్టడానికెవరూ కనుచూపు మేరలో లేక
మీ పార్టీ చంకెక్కడానికి రెడీ అవుతున్నారుటగా. తప్పదు మీరిలానే ఉండాలి, కాస్తంత సాఫ్ట్ గా.

నీహారిక చెప్పారు...

ఏవిటా పరాచికాలు ? కేసీఆర్ లాంటి వాడే చెయ్యి విసిరి అవతలపారేస్తే, బాబు గారు చెయ్యి ఇస్తారంటారా ? మీ నోట్లో పంచదార పోయాలి.

అజ్ఞాత చెప్పారు...

నయం, అరాచకమన్లేదు. ఓ చిన్న కరెక్షన్. కెసిఆర్ చెయ్యి విసరలేదు, నరికి అవతల పారేశాడు.
బాబు గారు చెయ్యి ఇస్తారు. ఆపై చెయ్యి ఇస్తాడు కూడా. మీకిదో శుభవార్త అనిపిస్తే - భేషుగ్గా అలానే
రెండు చెంచాల పంచదార నోట్లో కొడుదురు లెండి.

hari.S.babu చెప్పారు...

భండారు మాస్టారికి సజ్జనత్వం ఎక్కువ!గంగిగోవు లాంటివారు!ఆయనకి కోపం వస్తే పట్టలేం, అలుగుటయే యెరుంగని అక్జాతశత్రుడు అలిగినట్టు తయారవుతుంది - పాపం ఆయన్ని రెచ్చగొట్టకండి!ఈ మజ్జెనే ఘ్నానోదయం అయ్యి నేనూ తిట్ల పురాణం ఆపేసి చిరతపులి లాంటివాణ్ణి కాస్త గంగిగోవులా అయిపోయా!బ్లాగులోకపు కలహభోజనులకి ఇక పస్తులే సుమీ!

సూర్య చెప్పారు...

నిజ జీవితం లో కొట్టుకుంటోంది చాలదా?బ్లాగుల్లో కూడా కొట్టుకోవాలా!

అజ్ఞాత చెప్పారు...

కడుపులో సెత్త సేరుకుపాయె. ఏడనో సోట డొక్కోవాల గద తమ్మీ. బ్లాగులతే సరైపాయె. మరోసోటైతే సీరి ఎండేస్తరు!

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత "కడుపులో సెత్త" -
ఎంతో సొచ్చనంగా 23 సాలు స్టే లతో పుఠం పెట్టించుకున్నా ఎలుగు తగ్గని సొచ్చమైన నిప్పు, ఇండియా నుంచి బయటికి వచ్చిన జోదెద్దుల బండిని, జెల్లీ నుంచి రాగానే, ఏదో జాయ్గా ఓ మాటన్న నన్ను, కంపడగానే, ఇంత సొచ్చనంగా సెత్త సెత్తగా అభినింది, అసమదీయులకు ప్రమాదపు శాతం సహజన మరణవ్ తే తప్పించి నందుకు మిమ్మల్ని అభినింది నాను.
అవునవును ఆయనెవరో ఫారినోడు అప్పుడెప్పుడో మన రాష్ట్రానికి (అప్పుడు మన రాష్ట్రమే) వచ్చినోడు, సచ్చినోడు, వచ్చామా వెళ్ళామా అనుకోకుండా - ఇలాంటి హామీలు మా దేశం లో గానీ ఇస్తే, అదేంటీ మీరన్నారు 'మరోసోటైతే సీరి ఎండేస్తరు!' - సరిగ్గా అదే మాటన్నాడు. సరిగ్గా మీరూ అదే మాటన్నారు. మీకూ తెలుసు మన దేశం లో గనుకే మనోళ్లకీ వన్నెలు, చిన్నెలు. ఎన్కెనక ఏ సంగతున్నా నిప్పులాంటి మాట చెప్పారు. నేను తప్పయినా మీరు నిప్పండీ. అవునా కాదా తమ్ముళ్లూ?