14, అక్టోబర్ 2017, శనివారం

దేవుడికి కులమేదీ?


సుమారు అరవై ఏళ్ళ కిందటి మాట.
ఖమ్మం జిల్లా, వల్లభి గ్రామం. కారణం తెలవదు కానీ ఆ వూళ్ళో అగ్రవర్ణాలకు, దళితులకు నడుమ ఘర్షణలు తలెత్తాయి. దళిత వాడకు చెందిన మగవాళ్ళు, పెద్ద పెద్ద ఖామందులు ఎవరూ వూళ్ళో వుండలేక బయట ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్తితి. మా పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు ఆ ఊరుకు పెద్ద. ఆయన పూనికపై నాగపూరు నుంచి కాబోలు, వినోబా శిష్యులు బన్సాలీ గారు వల్లభి వచ్చి అనేక రోజులు అక్కడే మకాం వేశారు. ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేలా రెండు వర్గాల నడుమ సయోధ్య కుదిర్చి వెళ్ళారు.

తరువాత మా బావగారు వూళ్ళో ఓ రామాలయం కట్టించారు. ఒక హరిజనుడిని (ఇప్పుడు ఈ మాట వాడడం లేదు, దళితుడు అంటున్నారు, ఆ రోజుల్లో పత్రికలు  అన్నీ ‘రామాలయంలో హరిజన పూజారి’ అనే పేరుతొ ఒక విడ్డూరమైన వార్తగా ప్రచురించాయి) ఆ గుడిలో పూజారిగా నియమించారు. 

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మంత్ర్రాలు రాకుండా మడీ ఆచారం లేకుండా మాంసాహారం తింటూ పూజలేమి జేస్తారు సార్. సంస్కరణల పేరుతొ ఇలాంటి పనులు చేయడం తప్పు

అజ్ఞాత చెప్పారు...

@అజ్నాత :|

నీహారిక చెప్పారు...

కేరళ ఆలయంలో కూడా ఇలాగే దళిత పూజారులను నియమించినట్లు స్క్రోలింగ్ లో వచ్చింది. ఇక అన్నీ మంచి శకునాలే !

అజ్ఞాత చెప్పారు...

దళితులను పూజారులు చేయడం కాదు వారు చేస్తున్న వృత్తులను అగ్రవర్ణాల వారిని చేయమనండి. చెప్పులు కుట్టడం టాయిలెట్ కడగడం అంట్లతోమి బట్టలు ఉతికేపని.. ఈ పనులు అగ్రకులాల వారు చేస్తారా.

అజ్ఞాత చెప్పారు...

ఆ పనులు అగ్రవర్నాల వారు చేస్తే, అప్పుడు దళితులేమి చేస్తారు? తిని కూచొని కబుర్లు చేప్పుకొంటారా? గద్దరన్నలా మొదటో పాటలు పాడి, వ్యాపారం చేసుకొంటారా?

అజ్ఞాత చెప్పారు...

I think you did not get my view. Can the upper caste people choose the jobs done by Dalits since ages. No it won't happen now. Simply making Dalits as priests is tokenism. Respect their jobs and take up. That is real reform. Everyone become priest or want white collar job. No. Every job for everyone. Yes

అజ్ఞాత చెప్పారు...

Can you tell me why should we choose Dalit jobs? You may think they do not have any respect in the society. But I do not think so. పూజారి ఉద్యోగం టొకనిజమా? ఐతే టివి లో ఐలయ్య ఎందుకు మాకు పూజరి ఉద్యోగం కావాలి అని అడుగుతున్నాడు? చొప్పులు కుట్టే ఉద్యోగం,కమ్మరి,గోల్డ్ స్మిత్,చాకలి,మంగలి, మాకు కావాలి అని అగ్రవర్ణాల వారు అడగటం లేదు కదా! అవి కుల వృత్తులు, కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలకు వంశపార్యపరంగా నేర్పిస్తూంటారు. అవి నేర్చుకోవటానికి స్కుల్స్, కాలేజీలు ఎమి లేవు. నేర్చుకొని ఆ వృత్తులలో అమాంతం చేరిపోవాలంటే!

మీ వృత్తి పై మీకే గౌరవం లేనపుడు, అగ్రవర్నాల వారు వచ్చి చేయాలని ఎందుకు ఆశిస్తావు? మాకేమి ఆ ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేదు. ఆ వృత్తి చేయటం ఇష్టం లేకపోతే, మానేసి వేరే వృత్తి ఎంచుకోండి ఎవరు వద్దన్నారు? మీరేదో ఆ వృత్తులు చేస్తూ సమాజాన్ని ఉద్దరిస్తున్నట్లు పోజులు కొట్టకండి.
ఎంత చెట్టుకు అంత గాలి.

కుట్టడం టాయిలెట్ కడగడం అంట్లతోమి బట్టలు ఉతికేపని చదువుకొన్న దళితుడు చేస్తున్నాడా? చదువుకొన్న అగ్రవర్ణల వారు వచ్చి నువ్వు చెప్పిన పనులు చేయాలని ఆశించటానికి?

That is real reform?

Why should we reform? What is there to reform? మాకు reform అవసరమే లేదు. దళితులలో హిందూ మతం ఇష్టం లేదన్నోళ్ళందరు 90% మతం మారారట, ఇంకేమి ఉంది reform చేయటానికి? ఆ మిగిలిన పది శాతాని చదువు చెప్పించుకొని ఉద్యోగాలు ఇప్పించుకొంటాం.


అజ్ఞాత చెప్పారు...

Hey. Why are you agitated so much.You have your view and argument. It is ok.

అజ్ఞాత చెప్పారు...

Hey. Why are you agitated so much?

Do not play victim card. Those days are over. That's why I gave befitting reply to your argument.