పదుగురాడు మాట పాటియై ధర జెల్లు
ఒక్కడాడు మాట ఎక్కదెందు
ఊరకుండువాని నూరెల్ల నోపదు
విశ్వదాభిరామ.. వినుర వేమ...!
తాత్పర్యం :
ఎక్కువమంది మాట్లాడే మాటకే విలువ ఉంటుంది. ఒక్కడు చెప్పే మాట ఎప్పటికీ చెల్లదు. అటూ, ఇటూ కాని తటస్థుడిని ఎవరూ పట్టించుకోరని ఈ వేమన పద్యం భావం.

అయితే
ఆంధ్రప్రదేశ్ లో పాలకపక్షం, ప్రధాన
ప్రతిపక్షం వేమన నీతిని మరో
విధంగా అర్ధం చేసుకున్నట్టున్నాయి. ఒకే
మాట పదిమంది పదిసార్లు చెబితే అదే నిజమై
పోతుందన్న నమ్మకం పెంచుకున్నట్టు వుంది, వాళ్ళ
తరహా చూస్తుంటే. ఒకరు ఒకటంటే,
దాన్ని ఖండఖండాలుగా ఖండిస్తూ పది మంది పది
అంటారు. వెరసి ఓ వేయి మంది లక్షసార్లు అన్న ఫీలింగు కలుగుతోంది టీవీలు చూసేవారికి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి