నవ
తెలంగాణా నూతన స్వరూపం
ఆవిష్కృతమైంది. పది జిల్లాల తెలంగాణా ముప్పై ఒక్క జిల్లాల తెలంగాణాగా విస్తృతమైంది.
విజయదశమి పర్వదినం ఈ వేడుకకు వేదిక
అయింది. రెండున్నర ఏళ్ళక్రితం ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం బాహ్య
సరిహద్దులు మార్చుకోకుండానే అంతర్గత స్వరూపాన్ని గుర్తు పట్టలేనంతగా మార్చుకుంది.
పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశించిన ఈ కొత్త ప్రయత్నం కొత్త ఆశలను
చిగురింప చేస్తోంది. ఆశలకు ఊపిరులూదాలంటే, చేసిన దానికన్నా చేయాల్సింది ఎక్కువ వుంటుంది. ప్రభుత్వానికి
నిజమైన సవాలు నేటి నుంచి మొదలవుతుంది. చక్కటి ప్రయత్నం మరింత చక్కటి ఫలితాలు
ఇచ్చేలా చేయాల్సిన బృహత్తర బాధ్యత కేసీఆర్ సర్కారుపై వుంది.
కోడలు కంటానంటే వద్దనే అత్త వుంటుందా?
ప్రజలూ అంతే! ప్రభుత్వాలు మంచి చేయాలే
కానీ ఆహ్వానించి, ఆదరించే మంచితనం వారిలో
పుష్కలంగా వుంది.
శుభం భూయాత్!
14 కామెంట్‌లు:
"పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశించిన ఈ కొత్త ప్రయత్నం" do you really think this is intention? i think the real reason is if you make it small districts there is no big region to fight against state government and district people fight between districts going forward.
Good for politicians IAS IPS officers to increase their posts. 31 districts is ridiculous.
ముఖ్య కారణం తమది చాలా జిల్లాలున్న చాలా పెద్ద రాష్ట్రం అని చెప్పుకోవాలనే కోరిక అనిపించటం లేదూ? అవిభక్త ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల రాష్ట్రం. దాన్ని విడగొట్టించారు. తెలంగాణా రాష్ట్రం వచ్చింది కానీ 10 జిల్లాలే ఉన్నాయి. అంత చిన్న రాష్ట్రమా అనిపించుకోవడం నచ్చలేదేమో? పాత లాగా 23 జిల్లాలూ ఉండాలనుకున్నారేమో? పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు అన్నారు కానీ గమనిస్తే ప్రారంభం 13 కొత్త జిల్లాలంటూ మాత్రమే మొదలెట్టారు. దాంతో పాత వైభవం లాగా మొత్తం 23 జిల్లాలవుతాయి కదా. కానీ Pandora's Box తెరుచుకుంది. ప్రతి ప్రాంతం వారూ తమకో జిల్లా అని ఉద్యమం లేవదీసారు. చివరికి 21 కొత్త జిల్లాలు అయ్యాయి. ఇప్పుడు 31 జిల్లాల రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. పైగా పునర్ నిర్మాణం అని కూడా చెప్పుకోవచ్చు.
త్వరలో నూటోక్క జిల్లాల బంగారు తెలంగాణా ఏర్పడుతుందని ఆశించవచ్చు.
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? కేసీఆర్ తలుచుకుంటే జిల్లాలకి కొదవా?
కేంద్రమంత్రి దత్తాత్రేయ నిర్వహించే "అలయ్ బలయ్" అంటే ఏమిటి శ్రీనివాసరావు గారూ?
దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో చూద్దాం:
Haryana: 22
Chattisgarh: 27
Jharkhand: 24
MP: 51
Orissa: 30
Punjab: 22
మన వాళ్లకు తత్తిమ్మా దేశం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి తక్కువ అనుకుంటా :)
@విన్నకోట నరసింహా రావు:
దసరా మరుసటి రోజు బంధు మిత్రులను కలిసే ఆచారాన్ని అలయ్ బలయ్ అంటారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ శక్తులు అన్నిటినీ మమేకం చేసేందుకు దత్తాత్రేయ ఈ మార్గం ఎంచుకున్నారు. తెలంగాణ పదం వింటేనే నిషేధం విధించే అప్పటి ప్రభుత్వం పండుగ సంబంధ ఆచారం పేరుతొ జరిగే కార్యక్రమాన్ని ఆపలేకపోయింది. బయట కనిపిస్తేనే అరెస్ట్ అయ్యే నాయకులు కూడా నిర్భయంగా దీనికి రాగలిగారు.
తెలంగాణ పదం వింటేనే నిషేధం విధించే అప్పటి ప్రభుత్వం
@జై, నువ్వు ఆపవమ్మని ఓవర్ యాక్షన్. ఎమి చెప్పావు లే! రోజు జాతర చేసినట్లు ఉస్మానియా లో గోడవచేసిన మీరు తెలంగాణ పదం నిషేదించిందని సొల్లుకూతలు. అందరు గుమిగూడి టాంక్ బండ్ మీద గోడవ చేసినపుడు నలుగురు చస్తే మళ్ళి దానిని కూడా ప్రభుత్వం మీదకు తోసి ఆంధ్రోళ్ల ప్రభుత్వం చంపిందని రాసిఉండేవాడివి. నీకెవరు సాఫ్ట్ వేర్ కంపెనిలో ఉద్యోగం ఇచ్చింది? 45ఏళ్లవయసు వచ్చాకకూడా కాలేజి విద్యార్దులాఇంత తెలివితక్కువగా, అనాగరికంగా మాట్లాడుతావ్?
తెలంగాణ వచ్చింది ఆంధ్రాకు శని విడగడైంది. పండుగంటూ జరుపుకోవాలి అంటే ఆంధ్రావాళ్లు చేసుకోవాలి.
// "తెలంగాణ వచ్చింది ఆంధ్రాకు శని విడగడైంది. పండుగంటూ జరుపుకోవాలి అంటే ఆంధ్రావాళ్లు చేసుకోవాలి." //
కరక్ట్ గా చెప్పారు అజ్ఞాత గారూ. అసలు పాత ఆంధ్ర ప్రదేష్ మేప్ చూస్తే సీమాంధ్రా యొక్క వీపు మీద కూర్చున్న కొండ లాగా కనిపిస్తుంది తెలంగాణా ఆకారం. ఇప్పుడు సీమాంధ్రా వీపు మీద నుంచి ఆ బరువు దిగిపోయింది. హేపీ.
వివరించినందుకు థాంక్స్ జై గొట్టిముక్కల గారు. మరో అనుబంధ ప్రశ్న :-
(1). "అలయ్ బలయ్" అనే పదాలకి అసలు అర్ధం ఏమిటి? తెలుగా, ఉర్దూనా?
జైగారూ, దేశంలో ఎక్కువ జిల్లాలున్న రాష్ట్రాల పట్టీ ఇచ్చారు. సంతోషం. కాని అలా సమగ్రంగా లేదు. తెలంగాణాతో సహా, ఆయా రాష్ట్రాల విస్తీర్ణాలూ, జనసంఖ్యా, జనసాంద్రతా కూడా జిల్లాలసంఖ్యతో పాటే చూపితే సౌకర్యంగా ఉంటుంది. కేవలం జిల్లాలసంఖ్య తెలియటం వలన ప్రయోజనం శూన్యం.
@విన్నకోట నరసింహా రావు:
తెలీదండీ ఎవరయినా పెద్దవాళ్ళను అడిగే ప్రయత్నం చేస్తాను.
@శ్యామలీయం:
సదరు గణాంకాలు సునాయాసంగానే దొరుకుతాయి. నేను చెప్పిన రాష్ట్రాలు విస్తీర్ణం లేదా/మరియు జనాభాలలో పోల్చతగ్గ/చిన్నవి. The cases are not too dissimilar. కానీ మొత్తం వివరంగా రాయాలంటే నేను ఒక టపా వేయాలి ఇప్పుడు కుదరడం లేదు.
నా వ్యాఖ్య ముఖ్య ఉద్దేశ్యం జిల్లాల సంఖ్య కాదు. తెలుగు టీవీ తప్ప వేరే అలవాటు లేని వారికి ప్రతీదీ విచిత్రంగా అనిపిస్తుంది. బయట ప్రపంచంలో ఏమవుతుందో తెలుసుకోవడం వలన "మాకే ఎందుకీ కష్టం" భావన పోతుందేమో? Those with a vastly limited window are easily shocked at things commonplace elsewhere.
జైగారూ,
నాకు ఎవరితోనూ తలపడటంపైన ఆసక్తి ఏమీలేదు. మరింతసమాచారం కోసం అడిగానంతే. మీరు "తెలుగు టీవీ తప్ప వేరే అలవాటు లేని వారికి ప్రతీదీ విచిత్రంగా అనిపిస్తుంది." అనేసారు. మన్నించాలి. నాకు 'తెలుగు టీవీ తప్ప వేరే అలవాటు' లేకపోవటం కాదు టీవీచూడటం ఒక అలవాటు కాలేదు. గణాంకాలు సులువుగా దొరుకుతాయన్నారు - మంచిది. అన్ని గణాంకాలు సులువుగా దొరికి కేవలం జిల్లాలసంఖ్య దొరకటంకష్టం అనా మీరు అవి ఇచ్చారు? మీరన్నట్లు నేను 'vastly limited window' లో ఉన్నవాడిని కావచ్చు. నా ప్రపంచం నాది. అందులో అక్షేపణ ఏముంది. కొన్ని రంగాల విషయంలో నాది vastly limited window ఐతే మరొకరిది వేరే రంగాలలో vastly limited window కావచ్చును. మీ వ్యాఖ్య ఇబ్బంది కలిగించిందని చెప్పటానికి విచారిస్తున్నాను. ఈ భండారువారి బ్లాగులో ఎవరన్నా ఏమన్నా అనవచ్చు ఎవర్నైనా సరే కాబట్టి ఇక్కడ వ్యాఖ్య వ్రాయటానికి జంకుతూనే వ్రాసాను. బాగానే పరాభవించారు.
@శ్యామలీయం:
Sir,
I was not referring to you but the various "anonymous" commentators who came to conclusions without considering the "outside Telugu media" world.
This is not the first time it happened: there was a post on the so called "one minute late" rule for entrance exams. Many folks refused to consider the pan-India norm.
I wish to reiterate my comment was not so much about the count or rationale for districts but the mindset of many (not you) that refuses to look beyond what the Telugu media chooses to raise.
కామెంట్‌ను పోస్ట్ చేయండి