26, అక్టోబర్ 2016, బుధవారం

పనికొచ్చే ముక్క


నాకొక మంచి నాస్తిక మితృడు వున్నాడు. ఒక రోజు వాళ్ళింటికి వెళ్ళే సరికి రేడియోలో ఆధ్యాత్మిక  ప్రవచనాలు వింటూ కనిపించాడు. నా మొహంలో ఆశ్చర్యం గమనించి అతడే చెప్పాడు.
ఆచార్యుల  బోధనల్లో దేవుళ్ళ ప్రసక్తి ఎలా వున్నప్పటికీ, మంచి జీవితం గడపడానికి పనికొచ్చే అనేక విషయాలు వుంటాయని, అంచేతే వాటిని క్రమం తప్పకుండా వింటుంటానని అన్నాడు.

భేషయిన మాట!   

6 కామెంట్‌లు:

sarma చెప్పారు...

బతకనేర్చినవాడు :)

అజ్ఞాత చెప్పారు...

ఇలాంటి వాళ్లనే హిపోక్రైట్స్ అంటారు. పైకి నాస్తికుణ్ణని కబుర్లు. కారులో వెళ్తూ రామా నను బ్రోవరా అనే త్యాగరాజ కీర్తనలు వినడం. అడిగితే ఇలాంటి సమాధానాలే వస్తాయి. ఏళ్ళు వచ్చేసరికి దైవభక్తి వచ్చి కూర్చుంటుంది చావు భయం వల్లో మరో దాని వల్లో. అటు పక్క నాస్తికత్వం వదలదు. అంచేత ఇలాటి సమాధానాలు చెప్తూ ఉంటారు. దేవుడున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ.

Zilebi చెప్పారు...పనికొచ్చు ముక్క ప్రవచన
మని నాస్తిక మిత్రుడొకడు మస్తుగ జూచెన్
తను బతక నేర్చిన మనిషి
యనుమానము లేదు మేలు యశముల బొందున్ !

జిలేబి

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత
అందులో సంగీతాన్ని అస్వాదిస్తున్నది,భక్తిని కాదు, అర్ధం చేసికోరూ!!! చాదస్తులన్నారందుకే!!!!!

Zilebi చెప్పారు...


యిది యేదో కుంపటికి వేణువూదినట్టుందే :)

జిలేబి

అజ్ఞాత చెప్పారు...

Zilebi
నారదాయనమః తమరుండగా లోటేమీ :)