11, జూన్ 2012, సోమవారం

మైండ్ బ్లాంక్ కావడమంటే!


మైండ్ బ్లాంక్ కావడమంటే!
“ఛీ! ఛీ!! పాడుకొంప పాడుకొంపనీ- ఇల్లు ఇరకటం ఇల్లాలు మర్కటం అంటే ఇదే కాబోలు. సమయానికి ఒక్కటీ కనబడి చావదు. పాడు కొంప పాడుకొంపనీ ....”
                  “ఏమండీ మిమ్మల్నే! ఇందాకటినుంచి గొంతుచించుకుని పిలుస్తుంటే వినిపించుకోరేం! ఏమిటా పరధ్యానం. ఆఫీసులో టైపిస్టు పిల్ల గుర్తొచ్చిందా ఏమిటి?”
“అబ్బెబ్బే ....ల్లే ల్లే ల్లే ల్లే ల్లేదు లేవే”
                 “ఇంటెడు చాకిరితో ఇవతల నేనల్లాడి పోతుంటే అవతల మీరు ఎవరెవర్నో తలచుకోడాలు, మురిసిపోడాలు. సిగ్గు లేకపోతే సరి. సరే దోభీ వచ్చాడు. నాకేమన్నా పది చేతులా! ముందా పద్దు సంగతి చూడండి.”
“స్సస్సస్సస్సరి లేవే! ఆ! చెప్పవయ్యా!! చీరెలెన్ని? లంగాలెన్ని?”

                       “ప్యాంట్లు మూడు – బనీన్లు రెండూ”

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇల్లు ఇరుకటం, ఇల్లాలు మరుకటం అనగా ఇంటికి రెండు ద్వారాలు, ఇల్లాలు మరు కటం మన్మధుని... అయ్యా అదీ సంగతి మీకూ తెలుసులెండి. ఊరికే....:) :) :)

అజ్ఞాత చెప్పారు...

హ్హ్వాహ్వాహ్వా