29, జులై 2011, శుక్రవారం

సులభంగా చావాలంటే? – భండారు శ్రీనివాసరావు

సులభంగా చావాలంటే? – భండారు శ్రీనివాసరావు


జీవితమే మధురమూ అని పాడుకోవడం సులభమే. కాని జీవించడం అంత వీజీ ఏమీ కాదు. అందుకని దాన్ని అర్ధం చేసుకోవాలనే అర్ధం పర్ధం లేని ఆలోచనలను వొదిలేసుకుని ఎంచక్కా జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టండి.

దానికి కొన్ని చిట్కాలున్నాయి. హాయిగా నవ్వుకోవడం. వీలయితే నవ్వించడం.

“హాయిగా జీవించడం సరే ! సులభంగా జీవితాన్ని అంతం చేసుకునే నిఖార్సయిన పద్ధతులు ఏమయినా వున్నాయా గురువుగారూ!” అని అడిగాడొక శిష్యులుంగారు.

“మూడున్నాయి రాసుకో’ అని మొదలు పెట్టాడు మూడొచ్చిన గురువు.

“మొట్టమొదటి పధ్ధతి. రోజూ పది పెట్టెలు సిగరెట్లు వూదేసేయ్. పదేళ్లు ముందుగానే గుటుక్కుమంటావ్.

“రెండోది – రోజూ క్రమం తప్పకుండా మందు కొట్టు. ముప్పయ్యేళ్ళు ముందుగానే టపా కట్టేస్తావ్.

“ఇక ఆఖరు చిట్కా ఏమిటంటే – కనుముక్కుతీరు చక్కగా వున్న అమ్మాయిని చూసి నిజాయితీగా ప్రేమించడం మొదలు పెట్టు. ముందుగా ఏం ఖర్మ. ప్రతిరోజూ చచ్చి బతుకుతుంటావ్.”

(29-07-2011)

4 కామెంట్‌లు:

Praveen Sarma చెప్పారు...

ప్రేమ విఫలమైనంతమాత్రాన చావాలని రూల్ లేదు. పదేళ్ళ క్రితం నేను మా దూరపు బంధువుల అమ్మాయిని ప్రేమించాను. ఆమె వయసులో నా కంటే నాలుగేళ్ళు పెద్దది కావడం, పల్లెటూరివాళ్ళకి వయసు, ఎత్తు పట్టింపులు ఎక్కువగా ఉండడం వల్ల మా వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోలేదు. అలాగని నేను దేవదాసుగా మారి మందు, సిగరెట్లు తాగలేదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Praveen Sarma - సరదాకు రాసినవాటిని సీరియస్ గా తీసుకోకండి ప్లీజ్ - భండారు శ్రీనివాసరావు

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

ఖర్మ కాలి ఆ అమ్మాయితో పెళ్ళి అయిందనుకోండి. అప్పుడు చావుకి భయపడనఖ్ఖర్లేదు.(సరదాకి)

Praveen Mandangi చెప్పారు...

ప్రేమ అనేది పవిత్రమైనది. జోక్‌గానైనా ప్రేమని వైరాగ్యంతో సమానం అనకూడదు.