19, నవంబర్ 2010, శుక్రవారం

అగ్నిమీళే పురోహితం ........ అను గ్రామఫోన్ రికార్డ్ కధ

చాలా చాలా వస్తువులు మన కళ్ళ ముందే కనుమరుగవుతున్నాయి. విశ్వనాధవారి బాణీలో చెప్పాలంటే ఇదొక పెను విషాదము.
కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పని విష పరిణామాలు.

లాంతర్లు, చిమ్నీలు, రోళ్ళు, రోకళ్ళు, ఎడ్లబళ్ళు, కచ్చడం బళ్ళు, చల్ల కవ్వాలు, మేనాలు, వాటిని మోసే బోయీలు, మేనా మోస్తూ వాళ్ళు చేసే ఒహోం ఒహోం వొహ్ వోహోం వోహోంలు – ఎక్కడన్నా కనవస్తున్నాయా? ఎప్పుడన్నా వినబడుతున్నాయా?

నా చిన్నతనంలో మా సుబ్బయ్య తాతయ్య గారి దగ్గర ఓ గ్రామఫోన్ వుండేది. ధ్వని నలుగురికీ బాగా వినబడడానికి దానికి గమ్మత్తయిన ఆకారంలో వుండే ఒక స్పీకర్ తగిలించేవాళ్ళు. గ్రామ ఫోనుకు అదొక గుర్తుగా వుండేది. పాటల రికార్డులు మందపాటి భోజన పళ్ళాల మాదిరిగా పెద్దగా వుండేవి. వాటిమీద గాయనీగాయకుల పేర్లు, సినిమా పేరు, సంగీత దర్శకుడి వివరాలు ముద్రించేవాళ్ళు. గ్రామఫోనుకు గడియారం మాదిరిగా కీ ఇచ్చి, రికార్డు దానిమీదవుంచి అది తిరుగుతున్నప్పుడు ముల్లును జాగ్రత్తగా గాడిలో పెట్టేవాళ్ళు. ఆ ముల్లును గవర్నర్ అనే పరికరంలో బిగించే వాళ్ళు. రికార్డు తిరగడం ప్రారంభం కాగానే పాట మొదలయ్యేది. మా తాత గారు సంగీతం అంటే చెవికోసుకునేవారు.అందువల్ల ఆయన దగ్గర వున్నరికార్డుల్లో అన్నీ జావళీలే. ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అయినా వూరు వూరంతా ఆ పాటలు వినడానికి పోగయ్యేవాళ్ళు. అంత చిన్న పెట్టెలో నుంచి పాటలు పాడుతున్నదెవరో తెలియక విస్తుపోయేవాళ్ళు. ఏదో మంత్రం పెట్టె పట్టుకొచ్చారని మా తాతగారిని అనుమానించిన వాళ్ళు కూడా వున్నారు.

పొతే, నేను రేడియోలో చేరినప్పుడు గ్రామఫోన్ రికార్డులు వుండేవి. కాకపొతే కాస్త నాజూకుగా చిన్నగా వుండేవి. ఇప్పడు వాటి జాడ కూడాలేదు. అన్నీ కంప్యూటర్ డిస్క్ లే.

రేడియోలో చేరిన కొత్తల్లో ఓ రోజు జంధ్యాల స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తను మొదట డైరెక్ట్ చేసిన ‘ముద్దమందారం’ సినిమా పాటల రికార్డ్ ను ప్రసారం నిమిత్తం తెచ్చి నాకిచ్చివెళ్లడం ఇప్పటికీ ఓ మధుర విషాద స్మృతి.

తన గొంతు తాను వినాలని, తన మొహం తాను చూసుకోవాలని – ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలు వుంటాయంటారు. ఇలా మనసుపడని మనుషులు వుండరేమో కూడా. రేడియోలో తమ గొంతు ఒక్కసారయినా వినపడాలని తాపత్రయపడి అందుకోసం ఎంతగానో ప్రయత్నించిన పెద్దవాళ్ళు ఎందరో నా వృత్తి జీవితంలో పరిచయం అయ్యారు. అలాగే ఋష్యశృంగుడు లాటి పెద్దమనుషులు కూడా ఫోటోలో తమ మొహం ఎలావుందో చూసుకోవాలని ముచ్చటపడడం కద్దు. అలాటి వాళ్లకు వాళ్ళ ఫోటో వాళ్ళకే చూపింఛి చూడండి. పైకి మొహమాటపడి చూసీ చూడనట్టు చూసి వొదిలేసినా, నలుగురు లేని సమయం చూసి ఒక్కమారయినా ఆ ఫోటోను తనివితీరా చూసుకోవడం మాత్రం ఖాయం అనే చెప్పాలి. ఆ రోజుల్లో రేడియోకు, ఈ రోజుల్లో టీవీలకు జనం వెంపర్లాడటం అన్నది జనంలో అంతరాంతరాలలో దాగివున్న వున్న ఈ బలహీనతవల్లే అని అనుకోవాలి.
సరి. మళ్ళీ గ్రామ ఫోన్ రికార్డుల సంగతికి వద్దాం.

ఈ రికార్డులకు హెచ్ ఎం వి (హిజ్ మాస్టర్ వాయిస్)ది పెట్టింది పేరు. ఈ కంపెనీ లోగో పై వుండే కుక్క బొమ్మ జగత్ ప్రసిద్ధం. అసలీ గ్రామ ఫోను రికార్డుల కధాకమామిషు గురించి ఈ కంపెనీ ఓ బుల్లి కరపత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు చెప్పబోయే కధనానికి అదే ఆధారం కనుక ఇది వొండివార్చిన వార్తా కధనం కాదని నమ్మడానికి ఆస్కారాలు వున్నాయి.

పందొమ్మిదవ శతాబ్దం లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త గ్రామఫోను తయారు చేసారు. ఈ ఒక్కటే కాదు - విద్యుత్ దీపం, కెమెరా మొదలయిన వాటిని తొలిసారి కనుక్కున్నది కూడా ఎడిసన్ మహాశయులవారే అన్నది ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి సయితం తెలిసిన విషయమే.

గ్రామఫోను రికార్డుని తయారు చేసిన ఎడిసన్ గారు – ఎవరయినా సుప్రసిద్ధ వ్యక్తి స్వరాన్ని మొదటి రికార్డుపై భద్రపరచాలని తలపోశారు. ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ఆయన మదిలో మెదిలారు.

“మీ స్వరాన్ని రికార్డు చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు కలవాలని” కోరుతూ మాక్స్ ముల్లర్ కి ఆయన వెంటనే లేఖ రాసారు. ఎడిసన్ పై ఎంతో గౌరవ ప్రతిపత్తులు కలిగిన మాక్స్ ముల్లర్, ఎడిసన్ అభ్యర్ధనను అంగీకరించారు. పలానా సమయంలో యూరోపులోని శాస్త్రవేత్త లందరూ ఇంగ్లాండ్ లో సమావేశం అవుతారనీ, అప్పుడువస్తే బాగుంటుందనీ ముల్లర్ జవాబు రాసారు.

ఆవిధంగానే ఎడిసన్ ఆ సమావేశానికి వెళ్లారు. మాక్స్ ముల్లర్ ఆయన్ని సభికులకు పరిచయం చేసారు. అప్పటికే ఎడిసన్ శాస్త్ర ప్రయోగ విజయాలను కర్ణాకర్ణిగా వినివున్న ఇతర శాస్త్రవేత్తలు ఆయన్ని సగౌరవంగా స్వాగతించారు.

తరువాత ఎడిసన్ అభ్యర్ధనపై మాక్స్ ముల్లర్ వేదికపైకి వచ్చి ఎడిసన్ వెంట తెచ్చుకున్న రికార్డింగ్ పరికరం ఎదుట నిలబడ్డారు. ఆయన చెప్పిన మాటలు రికార్డు చేసుకున్న ఎడిసన్ బయటకు వెళ్లి మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం సమావేశ మందిరానికి తిరిగి వచ్చారు. ఈ సారి ఆయన చేతిలో ఒక రికార్డు కూడా వుంది. దాన్ని గ్రామ ఫోనుపై వుంచి ఆ ఉదయం రికార్డు చేసిన ముల్లర్ స్వరాన్ని సభికులకు వినిపించారు.

అందులో నుంచి వినిపిస్తున్న ముల్లర్ స్వరాన్ని వింటూ యావన్మందీ చేష్టలుడిగి పోయారు. భావి తరాలకోసం ముల్లర్ స్వరాన్ని భద్రపరచిన ఎడిసన్ కృషిని అంతా చప్పట్లు చరుస్తూ మెచ్చుకున్నారు. కరతాళధ్వనులు సద్దుమణిగిన తరవాత మాక్స్ ముల్లర్ మళ్ళీ వేదిక మీదకు వచ్చారు. సభికుల నుద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు.

“ఈ ఉదయం ఎడిసన్ మహాశయులు నా గొంతు రికార్డు చేస్తున్నప్పుడు మీరది విన్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామఫోను నుంచి వెలువడిన నా మాటలు కూడా విన్నారు. నేను ఉదయం ఏమి మాట్లాడానో, ఇప్పుడు మీరు ఏమి విన్నారో ఏమయినా, ఎవరికయినా అర్ధం అయిందా?” అని సభికులను సూటిగా ప్రశ్నించారు.

ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం తాండవించింది.హాజరయిన వారందరూ వారి వారి విభాగాలలో నిపుణులు.అయితే మాక్స్ ముల్లర్ ఏమి మాట్లాడారో వారిలో ఎవరికీ అర్ధం కాని మాట నిజం. ఎందుకంటె ఆ భాష వారికి తెలవదు కాబట్టి. గ్రామఫోను నుంచి వెలువడుతున్న ముల్లర్ స్వరాన్ని వింటూ మైమరచిపోయిన సభికులు ఆ ఆశ్చర్యంలో ఆయన ఏభాషలో మాట్లాడారన్నది గమనించలేదు. వాళ్ళంతా యూరోపు కు చెందినవాళ్ళు కాబట్టి ఆ భాషను వారెప్పుడూ వినివుండలేదు.

సభికుల అశక్తతను అర్ధం చేసుకున్న మాక్స్ ముల్లర్ తానేమి మాట్లాడిందీ తానే స్వయంగా వివరించారు. తాను మాట్లాడింది సంస్కృత భాషలో అన్నది ఆయన చెప్పేవరకు తెలియని శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు.గ్రామ ఫోను రికార్డింగ్ కోసం అంతకుముందు పేర్కొన్న రిగ్వేదం లోని మొదటి శ్లోకాన్ని ఆయనమళ్ళీ చదివి వినిపించారు.

“అగ్నిమీళే పురోహితం – యజ్ఞ స్వదేవ మృత్విజం హాతారం రత్నశాసనం” – ఇలా సాగిపోతుందా శ్లోకం. ప్రపంచంలో మొట్టమొదటి గ్రామఫోను రికార్డుపై రికార్డయిన రికార్డ్ - రిగ్వేద శ్లోకానికి - మాక్స్ ముల్లర్ ఆవిధంగా అందించారన్న విషయం తెలపడమే ఈ కధనం లోని విశేషం.

అదే ప్రసంగంలో మాక్స్ ముల్లర్ చెప్పిన విషయాలు వింటే సంస్కృత భాష గొప్పదనం ఈ కాలం వారికి తెలిసే అవకాశం వుంటుంది. ఆయన ఇంకా ఇలా అన్నారు.

“మొత్తం మానవేతిహాసంలో వేదాలు మొట్టమొదటి పాఠాలు. అందులో అగ్నిమీళే పురోహితం అనేది తొలి వేదం అయిన రిగ్వేదం లోని మొదటి శ్లోకం. వెనుకటి రోజుల్లో,ఆదిమ యుగంలో- వొళ్ళు దాచుకోవడానికి దుస్తులు ధరించాలన్న ఆలోచన కూడా లేకుండా,చెట్టుకొమ్మలపై చింపాంజీల మాదిరిగా గెంతుతూ యూరోపులోని జనం అనాగరిక జీవనం గడుపుతున్న కాలంలోనే- నివసించడానికి ఇళ్లు అవసరమనే ధ్యాసకూడా లేకుండా కొండ గుహల్లో కాలక్షేపం చేస్తున్న రోజుల్లోనే- భారతీయలు నాగరిక జీవనం సాగిస్తూ, మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే రీతిలో సార్వత్రిక వేదాంతాన్ని ప్రబోధించే జీవన సూత్రాలను వేదాల రూపంలో అందించారు. ఎడిసన్ మహాశయులు నా స్వరాన్ని రికార్డు చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఈ వేద శ్లోకాన్ని ఎంచుకోవడానికి కారణం ఇదే” అని ముగించారు మాక్స్ ముల్లర్.

(ప్రముఖ పండితులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి కృతజ్ఞతలతో  –భండారు శ్రీనివాసరావు)

20 కామెంట్‌లు:

manavaani చెప్పారు...

వివరణకి చాలా ధన్యవాదములు.
అలనాటి ఆ రికార్డింగుని వినగలిగే భాగ్యం
కలిగితే ఎంత బాగుండునో..

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

Vow! Amazing narration too! Thankyou Srinivasa rao gaaru

సుజాత వేల్పూరి చెప్పారు...

అత్యద్భుతంగా ఉంది టపా! గ్రామ ఫోన్ మీద మొదటి సారి రికార్డ్ అయింది ఒక సంస్కృత శ్లోకమని నాకిప్పటిదాకా తెలీదు!

ఇప్పుడు కూడా యాంటిక్స్ అమ్మే షాపులో గ్రామ ఫోన్ కనపడితే ఆశ్చర్యానందాలతో చూస్తాను ఇప్పటికీ!

చాలా అమేజింగ్ గా ఉంది మాక్స్ ముల్లర్ శ్లోకం రికార్డింగ్ కథ

అజ్ఞాత చెప్పారు...

ఈ ఒక్కటే కాదు - విద్యుత్ దీపం, కెమెరా మొదలయిన వాటిని తొలిసారి కనుక్కున్నది కూడా ఎడిసన్ మహాశయులవారే అన్నది

>>తొలిసారి కనుక్కున్నది

Nope, In addressing the question of who invented the incandescent lamp, historians Robert Friedel and Paul Israel list 22 inventors of incandescent lamps prior to Joseph Wilson Swan and Thomas Edison.

And

Sir Joseph Wilson Swan KBE (31 October 1828 – 27 May 1914) was a British physicist and chemist, most famous for the invention of the incandescent light bulb for which he received the first patent in 1878.

>>పందొమ్మిదవ శతాబ్దం లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త గ్రామఫోను తయారు చేసారు.

The earliest known invention of a phonographic recording device was the phonautograph, invented by Frenchman Édouard-Léon Scott de Martinville and patented on March 25, 1857.


>>ఎవరయినా సుప్రసిద్ధ వ్యక్తి స్వరాన్ని మొదటి రికార్డుపై భద్రపరచాలని తలపోశారు.

Again NOPE.

In December, 1877, a young man came into the office of the SCIENTIFIC AMERICAN, and placed before the editors a small, simple machine about which very few preliminary remarks were offered. The visitor without any ceremony whatever turned the crank, and to the astonishment of all present the machine said : " Good morning. How do you do? How do you like the phonograph?" The machine thus spoke for itself, and made known the fact that it was the phonograph..."

You can get first reports about this Chicago Daily Tribune on May 9 1877.


This whole story is cooked, just like many such stories.

అజ్ఞాత చెప్పారు...

ఈ రికార్డులకు హెచ్ ఎం వి (హిజ్ మాస్టర్ వాయిస్)ది పెట్టింది పేరు. ఈ కంపెనీ లోగో పై వుండే కుక్క బొమ్మ జగత్ ప్రసిద్ధం. అసలీ గ్రామ ఫోను రికార్డుల కధాకమామిషు గురించి ఈ కంపెనీ ఓ బుల్లి కరపత్రాన్ని ప్రచురించింది.

---

Another Nope,

http://en.wikipedia.org/wiki/Gramophone_Company

అజ్ఞాత చెప్పారు...

@తార:
చితగొట్టేశారేంటండి పాపం :)


శ్రీనివాస్ గారూ మహామహోపాధ్యాయ పుల్లెల శ్రిరామచంద్రుడుగారు ఏటు నుండి తెచ్చారటా? కనుక్కుందురు.

ఋగ్వేదం గొప్పతనం చెప్పటానికి దాన్ని ఇంత కధలోకి పెట్టక్కర్లేదేమో.Neverthless great imagination!

The funny part is - ఋగ్వేదాన్ని మాత్రం ఎవరూ అర్ధం చేసుకోలేదు పాత రోజుల్లో అయినా - గ్రాంఫోన్లో ఐనా - నేటి నెట్‌లో ఐనా!
-rayraj.wordpress.com

రవి చెప్పారు...

@శ్రీనివాస రావు గారు: మాక్స్ ముల్లర్ గారి మాట నేను విన్నది ఇంకో విధంగా ఉంది. "This is the first utterance of WHITE race in the world" - ఇలా అన్నాడని తిరుమల రామచంద్ర గారు ఉటంకించారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అగ్ని మీళే పురోహితం గురించి చదువరులు రాసిన అభిప్రాయాలు, వ్యాఖ్యలు చదివిన తరవాత ఇది రాస్తున్నాను. ఇది నా సొంత కల్పన కాదనీ, హెచ్ ఎం వీ వారి కరపత్రం నుంచి తీసుకున్న సమాచారమనీ ముందే మనవి చేసుకున్న విషయాన్ని గమనించకపోవడం వల్ల- ఈ అపోహలు తలెత్తాయని అనుకుంటున్నాను. వివాదాలకు దూరంగా, ఎవరూ నొచ్చుకొని విధంగా రచనలు వుండాలనే సిద్దాంతానికి కట్టుబడి వున్నాననీ, వుంటాననీ మరోసారి తెలియచేసుకుంటున్నాను. ఇంగ్లీషులో వున్న వేద శ్లోకం ప్రధమ పాదం గురించి పండితులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారితో మాట్లాడిన తరువాతనే బ్లాగులో పెట్టాను. కనురెప్పలకిందే కనుమరుగవుతున్న అనేక అంశాలను గురించి రాయడం మొదలు పెట్టి, ఆ తరువాత చదివిన కరపత్రం విషయాలను దానికి జోడించడం జరిగింది.-నమస్కారాలతో – భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

I dont mean you cooked this, I mean, who ever said, its from HMV pamphlet is itself cooked, to add credibility to their story they added that line saying its from HMV's pamphlet.

Google Max Muller Edison, you will get thousands of posts in the same lines, but with different proofs.

I request you to verify facts before writing such, and this is nothing to do with your blog, I too like your blog, no offense.

Happy blogging.

...

Taara

అజ్ఞాత చెప్పారు...

ఇక్కడ ఎవరు ఏది రాసినా ఏదో రకంగా కెలికి జడ్జ్ చేయడానికి, ఆ తర్వాత రాయనా వద్దా అంటూ పోల్స్ పెట్టి ఇతరుల సమయం కూడా వృధా చేయడానికి కొందరున్నారు లెండి. వాళ్ళని అహా ఓహో అంటూ పొగిడేవారూ..చూశారుగా పైన! ఇదే బ్లాగ్లోకం అంటే మరి! మీకేమో కొత్త కదా!

అయినా పర్లేదు, మీ బ్లాగు ఎంతో బావుంటున్నది. వ్యాఖ్యలు రాయకపోయినా చదువుతాను. మీరు రాస్తూ ఉండండి. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరని సామెత ఉండనే ఉంది. కానీండి!

రాజేష్ జి చెప్పారు...

@శ్రీనివాసరావు గారు

ధన్యవాదాలు.. ఇంతటి అమూల్యమైన సమాచార0 పంచుకున్నందుకు.

@ హజ్ఞాత గారు : ఎవరు ఏది రాసినా ఏదో రకంగా కెలికి జడ్జ్ చేయడానికి
...ఆ తర్వాత రాయనా వద్దా అంటూ పోల్స్ పెట్టి ఇతరుల సమయం

:))..literally ROFL

అజ్ఞాత చెప్పారు...

>>ఇక్కడ ఎవరు ఏది రాసినా ఏదో రకంగా కెలికి జడ్జ్ చేయడానికి

Really? Nice try, but why don't you show mistakes in my argument? Instead you always try to judge me as "Kelukudu", only way to stop it is find a contradiction in each of my argument, thats only way to prove me wrong.

...

Taara

రాజేష్ జి చెప్పారు...

Truely?? Let me take on and chime in. First of all, Do remind that this is not a fault finder show and especially I am very reluctant towards that unless there is a solid reason.

Now let us come to point.

Here, Mr.Srinivas written an article and shared over here to all. His intention would be to let know others that grabbed from his experience with AIR(Radio). Well and Good.

First of all, It is well-known fact that science is always evolving and transforming into umpteen changes. By deducing from that fact, It is obvious inventions and conceivings of material in past could be mismatched and tends to alter. It is like some researchers can dig and found that X was the one who invented XYZ but at later other could explore and says NO, X concealed that conceive from Y and then Invented XYZ. Thus, Y is the first one. Agreed, No harm and this is happening from era of decades. For instance, at my childhood, I was brainwashed with Pythagoras established Pythagoras theorem, but later come to know It was Aryabhatta.

Saying that, It is very apparent for anyone in the same field with subtle common-sense can grasp that the article would be outdated. Then there exactly, his wisdom with humbleness always taken into worthy while showing up those subtle mistakes whilst expressing gratitude towards his inclination towards sharing. It is a matter fact that, I may not be expert in one area, but that area is hard-linked with my area of interest to share. Thus, when sharing my area of interest, for me rest is out-of-scope and needless to do research but would welcome if someone from that area pointed inaccuracy with sense-of-humor. Thus everyone agreed.

But what you did is just pin-pointing and said bluntly which is worthless and that may bring accolades in short time, but not in long run. Your vast knowledge(!) of science(?) coerced you to take this as opportunity just to exhibit your shitty skills(?). For that, I believe you had your own blog with huge self-trumpet!. Here, I am not saying pointing mistake is incorrect, but you easily, at your convenience, forget atleast to express a note of thanks to his hardwork did to translate that piece into native language and the passion to share over here. Instead, you pointed index finger and said cooked whilst you forget other four fingers pointing you especially that MIDDILE FINGER. That is utterly nonsense for me as a blogger.

The way you shouted "cooked" and related replies always given impression that Mr.Srinvias created fascinated story with lies and that subsequently pushed other readers with same ill-feeling(rayraj). Apart from that, the dangerous fact doing that, would always casting down writer to write such articles further. I second Srinivas what he said in this matter. ofcourse, He need not to reply your dimwit replies but did so with modesty. i.e ALL.

అజ్ఞాత చెప్పారు...

@Rajesh

LOOOOOOOOOOOOOOL

అజ్ఞాత చెప్పారు...

బేవార్స్ గా బ్లాగుల్లో తిరుగుతూ తలతిక్క కామెట్లు పెట్టే రాజేష్_జి ఇంగ్లీషు దురద సొల్లును నే ఖండిత్తన్నా.

karlapalem Hanumantha Rao చెప్పారు...

ఎంత కొత్త విషయం ఎంత తేటగా చెప్పారండీ! మీ టపా చదివినప్పుడల్లా నన్ను నేను కాసేపు మరిచి పోతుంటాను!మీ బ్లాగ్ ఒక పాఠ్య పుస్తకం లాంటిది .ఎన్ని సార్లని కృతజ్ఞతలు చెప్పుకోను !

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

రాజు గారికి –ఎంతో అభిమానంతో మీరు రాసారు. కృతజ్ఞతలు. ‘మార్పు చూసిన కళ్ళు’ రాసి ఏండ్లు పూండ్లు గడిచిపోయాయి. నేను చూసిన మాస్కో కూడా ఇప్పుడు అప్పటి మాస్కో మాదిరిగాలేదు. రష్యా సయితం నేడు అన్ని దేశాల రీతిలోనే ‘తానులో ముక్కగా’ మారిపోయింది. చిన్నప్పుడు పుస్తకాల్లో ‘గుప్తుల స్వర్ణ యుగం’ గురించి చదువుకున్నాం, వీధుల్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారని. అలాగే మా మాస్కో జీవితం కూడా ‘నమ్మలేని నిజాల జాబితా’ లోకి చేరిపోయింది. పుస్తకం వేసినా ప్రయోజనం ఏమిటన్న నిస్పృహ తోనే చివరికి ‘బ్లాగు’లో పెట్టి చేతులు దులుపుకోవాల్సి వచ్చింది. పైగా, మాస్కోలో మా కుటుంబం గడిపిన రోజుల్లో – నాకు పార్టీలు, ఇజాల అంటూ సొంటూ ఏమీ లేదు. హైదరాబాదు నుంచి వెళ్ళిన ఒక సామాన్య పౌరుడిగా నా అనుభవాలు రాసాను. అలాంటప్పుడు ఎవరో ఏదో పట్టించుకుని పుస్తకం వేస్తాం అంటారన్న భ్రమలు లేకే బ్లాగుని ఆశ్రయించాను. జరిగిన ఆలస్యం అల్లా బ్లాగుల గురించి లేటుగా తెలియరావడమే. కాకపొతే, ఈ ‘బ్లాగు లోకంలో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన నా పరిస్తితి ఇంకా ‘అ ఆ ఇ ఈ’ ల దశే. ఏదయినా నేర్చుకోవాలన్న తపనకు అరవై పైచిలుకు వున్న నా వయస్సు అడ్డురాదనే నమ్మకంతోనే బ్లాగు ప్రపంచంలో బుడిబుడి అడుగులు వేస్తున్నాను. - ధన్యవాదాలతో –భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
VISSAFOUNDATION.BLOGSPOT.COM చెప్పారు...

మనదైన గతవైభవ కీర్తిని, దీప్తిని మీదైన శైలిలో "మేరా భారత్ మహాన్". అని చదువుతున్న వారు ఉత్తేజంతో ఉప్పొంగెలా పదునుతేరిన మీ పాత్రికేయ కలంనుంచి జాలువారిన ఈ - మాక్స్ ముల్లర్ గళం నుంచి జాలువారిన “అగ్నిమీళే పురోహితం – యజ్ఞ స్వదేవ మృత్విజం హాతారం రత్నశాసనం” కధనం చదువరులను పునీతులను చేస్తూ తన్మయులను చేస్తోంది! మీకు మా హృదయపూర్వక శుభాభివందనములు! శ్రీ భండారు శ్రీనివాసరావు గారు!!

deekshit.chs చెప్పారు...

బండారు శ్రీనివాసరావు గారు,
నమస్తే!
గ్రామఫోన్ రికార్డ్ కధ చాలా చక్కగా వివరించారు. కానీ ఋగ్వేదం లోని మొదటి శ్లోకం మీరు ఇలా వ్రాశారు.
“అగ్నిమీళే పురోహితం – యజ్ఞ స్వదేవ మృత్విజం హాతారం రత్నశాసనం".
కానీ అన్ని చోట్ల ఈ క్రింది విధంగానే మాత్రమే ఉంది:
"అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్ | హోతారం రత్నధాతమమ్ ||"
దయచేసి పరిశీలించి, వీలున్నచో మీ బ్లాగ్ లో సరి చేయ కోరుతున్నాను.
PS: ఇదే విషయాన్ని గురించి ఇంతకుముందు ఎవరైనా మీకు సూచించారు ఏమో తెలియదు.