10, మార్చి 2021, బుధవారం
సీఎమ్ జగన్ తన పదవికి రాజీనామా చేయాలి – భండారు శ్రీనివాసరావు
సీ ఎం రాజీనామా చేస్తేనే , కేంద్రం విశాఖ ఉక్కు విషయంలో మెట్టు దిగివస్తుందని ఓ నాయకుడు అన్నట్టు టీవీల్లో వస్తోంది. మరి ఆ నాయకుడు కూడా పదవిలేని వాడేమీ కాదు. ముందు తన పదవికి రాజీనామా చేసి మరొకరిని చేయమంటే ఒక పద్దతిగా వుండేది. కానీ అలా చేస్తే రాజకీయం ఎలా అవుతుంది.
9, మార్చి 2021, మంగళవారం
Political snippets
“ఇంతకీ ఏం జరిగింది”
“గతంలో తాను చెప్పిన వీడియో క్లిప్పింగ్ మరోసారి
వేసుకోండని చెప్పి ప్రెస్ మీట్ ముగించి చక్కాపోయాడు”
"....పీకలేక పోయారు"
(రాయలేక చుక్కలు)
టీవీ
చర్చల్లో ఇది 'అనుమతించబడిన' పద ప్రయోగం అయిపోయింది.
చింతించి వగచిన ఏమి ఫలము?
'పార్టీ
ప్రయోజనాలు ప్రధానంకాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని నొక్కి చెబుతూవస్తున్నవారికి ఇప్పుడు
నిర్ణయం తీసుకోవడం అగ్ని పరీక్ష'
‘మహిళా దినోత్సవం
ఒక్క రోజన్నా ఆడవారిపై వేధింపుల వార్తలు రాకుండా వుంటే బాగుండు’
దురాశ అని తెలిసీ
ఆశ పడడం అంటే ఇదే కాబోలు!
'ఎన్నో
ఏళ్ళ పోరాటం తర్వాత రాష్ట్రం ప్రాంతాల వారీగా విడిపోయింది. ఎలాటి పోరాటం అవసరం
లేకుండానే ప్రాంతాలు పార్టీల వారీగా విడిపోతున్నాయి.'
"ఎన్నికల్లో
పోరాటానికి డాలూ, కత్తులూ, మనీ, మద్యం ఈ గోలంతా ఎందుకు? చడీచప్పుడు లేకుండా ప్రత్యర్ధి ఓటు తీయించేస్తే పోలా!"
డయల్
చేయగానే
మీకూ
నాకూ మధ్య
'కరోనా'
8, మార్చి 2021, సోమవారం
అలనాటి రష్యాలో అతివల హవా!
అక్కడ అన్ని విషయాల్లో పెద్దపీట స్త్రీబాలవృద్ధులదే.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తుపాకి
పట్టగలిగిన ప్రతి ఒక్క మగవాడినీ- వయస్సుతో నిమిత్తం లేకుండా యుద్ధరంగానికి పంపిన
కారణంగా - దేశాన్ని నడిపేందుకు మహిళల తోడ్పాటు అవసరమయిందని చెప్పుకుంటారు. ఆ
రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే
పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని
ప్రత్యేక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ
వారికి సమకూర్చింది. చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో
ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్ళు మనవద్ద మాదిరిగా ప్లాటు ఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపును
కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిగే పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి
వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో
మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చా జీవితానికి
ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన
వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా యిరవయి ఏళ్ళు
నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం
కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు 'పండగనాడుకూడా పాత మొగుడేనా ' అనే
వారి సంఖ్య పెరిగింది.
సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న
విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత పెళ్ళాంతో, ఆమె
తాజాగా కట్టుకున్న కొత్త మొగుడితో కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో నివసించాల్సిన
పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని సరదాగా
చెప్పుకునేవారు. అయితే అక్కడ ' ఏకపతీవ్రతం ' చేస్తున్న ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. పిలిపెంకో అనే ఎనభై ఏళ్ళ 'యువకుడితో' మా కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆయన
గారి ఏకైక భార్య గత కొన్ని దశాబ్దాలుగా ఆయనగారితోనే
కాపురం చేస్తోంది. ఒకే మొగుడితో కాపురం అన్న సూత్రమే ఆవిడనూ, మా ఆవిడనూ జత కల్పిందని పిలిపెంకో మహాశయులవారి అభిప్రాయం. చివరికి ఈ
అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే మేము ఇండియా తిరిగి వచ్చినతరవాత కూడా ఆ
పిలిపెంకో దంపతులు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో వారం రోజులు వుండి వెళ్ళారు.
గమ్మత్తేమిటంటే నాకూ, మా ఆవిడకు రష్యన్ తెలియదు. వారిద్దరికీ
వాళ్ళ భాష తప్ప మరోటి తెలియదు.అయినా అనుబంధానికి ఇది అడ్డంకే కాలేదు.
బొమ్మను చేసి, ప్రాణము పోసీ....భండారు శ్రీనివాసరావు
(మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని)
బ్రహ్మగారు
సత్యలోకంలో బాసింపట్టు వేసుకుని, రేడియో వింటూ చేసే వంట లాగా, అర్ధాంగి వీణావాణి చెబుతున్నవిదంగా
సృష్టి కార్యం పూర్తి చేస్తున్నారు.
'అందం
అరవై దోసిళ్ళు' అన్నది సరస్వతి.
అక్షరాలా
అరవై దోసిళ్ళు అందం కొలిచి పోశాడు విధాత.
'సౌకుమార్యం
పాతిక గుప్పిళ్ళు' అన్నది సరస్వతమ్మ.
'తధాస్తు' అన్నాడు
బ్రహ్మలుంగారు.
'అమ్మతనం
అరవై, ఆత్మబలం
ఆరు, అహంకారం
మరో ఆరు. వినయం అయిదు, అణకువ ఆరు, మేధస్సు ముప్పాతిక గుప్పిళ్ళు, మానసిక బలహీనతలు మరో ముప్పాతిక, శారీరకబలం
కూరలో లవణం మాదిరిగా తగినంత.' చెప్పుకుంటూ పోతోంది చదువుల తల్లి. విధాత వింటూ మరో చేత్తో ఆ
బొమ్మకు మెరుగులు దిద్దుతున్నాడు.
బొమ్మ
పూర్తయింది. దాని అందం చందం చూసి హాటకగర్భురాణికే మతిపోయింది. ఇంత సౌందర్యం, ఇన్ని
తెలివితేటలు, అమ్మో ఇంకేమైనా వుందా అని గాభరా పడిపోయింది.
భార్య
కంగారు చూసి బ్రహ్మ తన బోసి నోళ్ళతో ముసి ముసి నవ్వులు నవ్వాడు.
నవ్వి చెప్పాడు.
"నువ్వు
పాళ్ళు చెబుతున్నప్పుడే అనుమానం వచ్చింది. కొన్ని శృతిమించుతున్నాయేమో అనికూడా
అనిపించింది. అదీ మంచిదేలే, సరే పోనీలే అనుకున్నాను. “ఎందుకంటావా? శారీరక బలం వంటలో లవణం మాదిరిగా తగినంత
అన్నావు. దానికి ఇన్ని పాళ్ళు అని చెప్పలేదు. ఉజ్జాయింపుగా కొలిచివేసేటప్పుడు కొంత
తభావతు తధ్యం. ఇక మానసిక బలహీనతలు ఏకంగా ఎక్కువే పెట్టావు. పాళ్ళు ఎక్కువైనా
కష్టమే అన్న సూత్రం నువ్వు పట్టించుకోలేదు. వంటకం పూర్తయింది. ఇక రుచి అంటావా.
వేసే దినుసుల పాళ్ళని బట్టి వుంటుంది. అలాగే, ఈ బొమ్మ బతుకూ అంతే. తెలివితేటలు, బలాబలాలు, మేధస్సు
యేది తీసుకున్నా ఎవరికీ తీసిపోని మాట నిజమే. కానీ పాళ్ళలోనే తేడా. అందువల్లే ఈ
విషయాల్లో ఒక స్త్రీకి మరో స్త్రీకీ ఎంతో తేడా. దండలో దారంలాగా అమ్మతనం ఒక్కటే
ఆడవారందరికీ ఉమ్మడి ఆభరణం. అదొక్కటే ప్రపంచానికి కూడా పెద్దదిక్కు, ఆ
గౌరవంతోనే సరిపుచ్చుకుని మిగిలిన అన్నింటినీ తేలిగ్గా మరచిపోతుంది. ఈ పుత్తడి బొమ్మకు
నేనిస్తున్న అదనపు వరం ఇదొక్కటే!'
(March, 8)
7, మార్చి 2021, ఆదివారం
ఏమి సేతురా లింగా - భండారు శ్రీనివాసరావు
పూర్వం కమ్యూనిస్టుల ఏలుబడిలో సోవియట్ యూనియన్ వర్ధిల్లిన కాలంలో రేడియో మాస్కోలో దాదాపు ఎనభైకి పైగా ప్రపంచభాషల్లో వార్తాప్రసారాలు జరిగేవి. నేను తెలుగు విభాగం బాధ్యుడిగా ఉండేవాడిని. అప్పుడు సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్.
ఇన్ని
ప్రపంచ భాషలకు సంబంధించిన వార్తలను ముందు
ఇంగ్లీష్ భాషలో తయారు చేసి వాటి ప్రతులను
అన్ని విభాగాలకు పంపేవారు. వాటిని ఆయా భాషల నిపుణులు తమ భాషలలోకి అనువదించి
ప్రసారం చేసేవాళ్ళు. నాకు సహాయకుడిగా కొంచెం కొంచెం తెలుగు తెలిసిన గీర్మన్ అనే రష్యన్ ఉండేవాడు.
‘మీరు
అసలు ప్రతి ఇస్తున్నారు సరే. మీ వార్తల్ని మీరు అనుకున్నట్టు యధాతధంగా
అనువదిస్తున్నామా లేదా అనే సంగతి మీకెలా తెలుస్తుంది’ అని అడిగాను. దానికి ఆయన
చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.
‘ప్రతి
వార్తలో దాదాపు మా నాయకుడి పేరు అనేకసార్లు
వస్తుంది. మీరు ఎన్నిసార్లు
ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ అంటారో దాన్ని మా వాళ్ళు విని,
మా దగ్గర వున్న ఒరిజినల్ బులెటిన్లో ఆ పేరు ఎన్ని సార్లు వచ్చిందో సరిచూసుకుని
అప్పుడు మీరు సరిగా అనువాదం చేస్తున్నారో
లేదో మావాళ్ళు కనుక్కుంటారు’ అని కర్ణుడి జన్మ రహస్యం నా చెవిన వేశాడు.
అంటే
ఇక ఎటువంటి పరిస్తితిలోనూ సర్వనామాలు పనికిరావు అనేది బోధపడింది.
అందుకా,
‘ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ప్రకటించారు, ప్రెసిడెంట్ మిహయిల్
సెర్గేవిచ్ గోర్భచేవ్ ఇంకా ఇలా అన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్
పేర్కొన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఉద్ఘాటించారు’ అంటూ ఒకే
పేరాలో నాచేత అష్టోత్తరం చదివిస్తున్నారు అనే వాస్తవం ఎరుకలోకి వచ్చింది.
సరే!
ఆ శకం ముగిసింది.
ఇలాంటిదే
మరో విశేషం నా కంట పడింది.
ఆఫ్రికా
దేశం అయిన ఉగాండాను ఇదీ అమీన్ అనే నియంత పాలించేవాడు. రేడియో కంపాలాలో ప్రతి రోజు
అయన గురించిన వార్తలే ప్రముఖంగా ప్రసారం అయ్యేవి. ఆయనకు రేడియోలో తన పూర్తి పేరు
చెప్పాలని మక్కువ. నియంత తలచుకుంటే కానిదేముంది. కాకపోతే ఒక ఇబ్బంది ఎదురయింది.
పూర్తి పేరు అయితే పరవాలేదు కానీ తనకున్న బిరుదులు, మెడల్స్ కూడా జోడించి
చెప్పాలని ఆదేశం. నియంత పాలించే ఆదేశంలో ఆయన ఆదేశం శిరోధార్యమాయే. దాంతో ఒకటికి పదిసార్లు రేడియోలో ఆయన పేరు వచ్చేది.
ఒకటికి పదిసార్లు జనం దాన్ని వినాల్సివచ్చేది. ఎలా అంటే ఇలా:
“His Excellency the President of the
Republic of Uganda, General al Haji Idi Amin Dada, VC, DSO, MC……”