10, ఏప్రిల్ 2019, బుధవారం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్నా


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఈ మధ్యాన్నం  అమరావతిలోని సీయీఓ కార్యాలయానికి వెళ్లి తొమ్మిది పేజీల మెమొరాండం ఎన్నికల ప్రధాన అధికారికి అందచేశారు. ఆ తర్వాత ఆ కార్యాలయం ఎదుటే తమ పార్టీ నాయకులతో కలిసి ధర్నాకు కూర్చున్నారు. రేపు ఉదయం పోలింగు మొదలవుతుంది అనగా ఈరోజు ఈ పరిణామం చోటు చేసుకోవడం సహజంగానే చర్చనీయాంశం అయింది.  సిఈఓ ఆఫీసు ఎదుట ఒక ముఖ్యమంత్రి ధర్నా చేయడం ఇదే మొదటి సారి. అయితే గతంలో వేర్వేరు కారణాలతో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ హోదాలోనే ధర్నాలకు దిగిన దృష్టాంతాలు వున్నాయి.
శ్రీ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆనాటి ఆర్ఎస్ఎస్ నేత సుదర్శన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి గురించి అవమానకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రోశయ్య కూడా ధర్నాలో పాల్గొన్నారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా ధర్నా చేశారు. పరిపాలనా వ్యవహారాల్లో గవర్నర్ కిరణ్ బేడి జోక్యం మితిమీరి పోయిందన్నది ముఖ్యమంత్రి ఆరోపణ. దాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఆ నిరసన మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు.
పొతే మరో తాజా ఉదాహరణ మమతా బెనర్జీ. కేంద్రం తమ ప్రభుత్వాన్ని, తన అధికారులను సీబీఐ వేధింపులకు గురిచేస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ ధర్నాకు దిగారు. రెండు రోజుల నిరసన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోల్ కటా వెళ్లి మమతా బెనర్జీ చేత దీక్ష విరమింప చేసిన సంగతి తెలిసిందే.
అధికారంలో ఉన్న ప్రభుత్వాల అధినేతలే కేంద్ర ప్రభుత్వం తమపై కక్షతో వ్యవహరిస్తోందని నిరసన దీక్షలు చేస్తున్నారు సరే. అది వారికి ప్రజాస్వామ్యం  ప్రసాదించిన హక్కు.
మరి అలాగే, సామాన్యులు కూడా అధికార దర్పాలకు గురవుతూ మౌనంగా వుండిపోతున్నారు తప్ప ఆఫీసుల ముందు ధర్నాలకు దిగడం లేదు. ప్రభువులు అలాంటివారిని కూడా గమనంలో పెట్టుకోవాలి.           

AP voters eyes on which party? || Election Watch - TV9





ఈరోజు బుధవారం ఉదయం  మురళీకృష్ణ నిర్వహించిన  Election Watch  చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కృష్ణారావు (సీనియర్ జర్నలిస్ట్), శ్రీ ఇనగంటి రవి (ఎన్నికల ఫలితాల విశ్లేషకుడు), శ్రీ వీవీ రావు ( ఎన్నికల నిఘా వేదిక)

9, ఏప్రిల్ 2019, మంగళవారం

KSR Live Show | Landslide Win for Jagan Reddy in Andhra - 9th April 2019





ప్రతి  మంగళవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం సాక్షి టీవీ ఛానల్  KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాగోన్నవారు: శ్రీ అజయ్ కల్లాం (మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి)

KSR Live Show | Landslide Win for Jagan Reddy in Andhra - 9th April 2019





ప్రతి  మంగళవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం సాక్షి టీవీ ఛానల్  KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాగోన్నవారు: శ్రీ అజయ్ కల్లాం (మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి)

8, ఏప్రిల్ 2019, సోమవారం

Why Chandrababu Naidu and YS Jagan Neglecting Local Issues? | The Debate...





ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7  న్యూస్  చానల్  The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కే.పీ. చేకూరి (టీడీపీ), శ్రీ సాయి కృష్ణ (బీజేపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ ( జనసేన), శ్రీ చలసాని శ్రీనివాస్ ( ప్రత్యేక హోదా సాధన్ సంఘం నేత),  శ్రీమతి వాసిరెడ్డి పద్మ (వై.ఎస్.ఆర్.సీ.పీ.)

Will YS Jagan Accept Pawan Kalyan Challenge over AP Special Status? | Th...



ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7  న్యూస్  చానల్  The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కే.పీ. చేకూరి (టీడీపీ), శ్రీ సాయి కృష్ణ (బీజేపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ ( జనసేన), శ్రీ చలసాని శ్రీనివాస్ ( ప్రత్యేక హోదా సాధన్ సంఘం నేత),  శ్రీమతి వాసిరెడ్డి పద్మ (వై.ఎస్.ఆర్.సీ.పీ.)

7, ఏప్రిల్ 2019, ఆదివారం

అందరి చూపూ రాజకీయం మీదే



దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు  తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది.
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో,వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక  సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ అయాచితంగా లభిస్తూ ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులతో పోలిస్తే వీళ్ళందరూ  తీసికట్టే.
లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బుసంచులూ  వున్న సినీ నటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడంకోసం  వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ రాజకీయ రంగ ప్రవేశం కోసం అర్రులు చాచేది అందుకే. తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు కూడా  వుండి తీరాలి అనే నిర్ధారణకు వాళ్ళు  వచ్చేస్తున్నారు.  రాజకీయం, ప్రజాసేవ అనే మాటలు కూడా  పొసగని వాళ్లు సయితం  డబ్బు వెదజల్లయినా  ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి  దూరిపోవాలని దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు. ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో నీరాజనాలు. ఎక్కడకు వెళ్ళినా, ఏ దేశమేగినా అతడు  ఒక్కసారి తమను  పలకరిస్తే చాలు అనుకుని పులకరించిపోయే జనాలు. తమ అభిమాన నటుడు కరచాలనం చేసినా జన్మ ధన్యం అయిపోయినట్టు కలలు కనే అభిమాన జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన చిరుద్యోగి తమ గడప తొక్కితే చాలు ఆ నటుడికి దిగ చెమటలు పట్టడానికి.
ఒక వ్యాపారవేత్త వుంటాడు. నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్ళలో బసలు, నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే సిబ్బంది. ఏం సుఖం?  పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో వెళ్ళాడనుకోండి. నెలకు పదివేలు తీసుకునే  సర్కారు ఉద్యోగి ముందు ఆ హోదాలు, ఇంతోటి వైభోగాలు దిగదుడుపే.
ఒక స్మగ్లర్ వుంటాడు. ప్రాణానికి వెరవని వందల గూండాలు వెంట వుంటారు. కుక్కని కొట్టక్కర లేకుండానే కళ్ళు తిరిగే  డబ్బు రాశులు రాశులుగా  రాలిపడుతుంది. ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంతనే వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే భయపడే పరిస్తితి.
మరొకడు వుంటాడు. అతడు కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు అసలే కాదు. అలా అని పెద్ద పేరున్నవాడూ  కాదు. కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోకి దూసుకుపోగలడు. కింది స్తాయి  నుంచి పై స్తాయి అధికారివరకు తలుపులు తోసుకుని వెళ్ళి, పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు.  ముఖ్యమంత్రి పేషీలోకి అనుమతి లేకుండా జొరబడగలడు. చివరాఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి సైతం సందేహించే పోలీసు ఠాణాల్లోకి  సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. ఒక్క మనిషికి  కూడా అధికారిక ప్రవేశం లేని దేవాలయాల్లోకి  పదిమందిని వెంటేసుకు పోగలడు.
అతడే రాజకీయ నాయకుడు. మన కధానాయకుడు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట మాత్రం  రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు వొదిలితే చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం పని తీరు  తాబేలు నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులు తరచూ చెబుతుంటారు. కానీ ఆ సూత్రం వారికి వర్తించదు.  ఎందుకంటే ఆ పొడవాటి చట్టం చేతులు తమ జేబుల్లోనే ఉన్నాయన్న వాస్తవం వారికి తెలుసు. వారి జోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే  వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషయితే ‘బాగు చేయిస్తాం రా’ అని స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడుస్తారు. నాయకుల విషయం వచ్చేసరికి  నిబంధనలన్నీ కట్టగట్టుకుని  గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద వుంటే చాలు  అన్నీ వున్నట్టే లెక్క. అదే అధికార పార్టీ అయితే ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క.
పొలిటికల్ పవర్ కు వున్న పవర్ అలాటిది. అందుకే ఈరోజుల్లో అందరి చూపూ   రాజకీయం మీదే!