8, డిసెంబర్ 2018, శనివారం
Discussion on Exit Poll Results | Lagadapati Rajagopal Survey Result | P...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యొతి పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్
7, డిసెంబర్ 2018, శుక్రవారం
ఊహాతీత చర్చలు – భండారు శ్రీనివాసరావు
శుక్రవారం ఉదయం ఏడుగంటలకు మహా న్యూస్ తో మొదలయి, @ న్యూస్
రిపబ్లిక్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 1, టీవీ 9,
ఏపీ 24
X 7 ఛానల్
డిబేట్ తో రాత్రి ఎనిమిదిన్నరకు నా టీవీ సంచారం ముగిసింది. పోలింగు నాడే ఫలితాలు
గురించీ, పోలింగు ముగిసిన తర్వాత సాయంత్రం నుంచి ఎక్జిట్ పోల్స్, ఇలా ఊహాగాన చర్చలు నిరంతరంగా సాగాయి.
మధ్యాహ్న భోజనం మిస్సయినా, మధ్యలో వీలు
చేసుకుని పోలింగు కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం మాత్రం మిస్సవలేదు. అదో ఊరట.
ఘడియ తీరిక లేదు, గవ్వ రాబడి లేదు అనే
సామెత నా లాంటి వారిని చూసి పుట్టిందేమో!
5, డిసెంబర్ 2018, బుధవారం
దేవుడిని కాకపోయినా ఓటరుని
1976 నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నాను. అంటే సీనియర్ ఓటర్నే. కానీ నా సీనియారిటీ పోటీ చేస్తున్న అభ్యర్ధులకు తెలిసినట్టు లేదు. అయినా నా ఓటు వల్ల ఉపయోగం లేదనుకున్నారేమో తెలియదు. ఎవ్వరూ మా ఇంటి వైపు కన్నెత్తి చూడలేదు. దానికి బాధ లేదు. ఎలాంటి ఆబ్లిగేషన్ లేకుండా నా ఓటు నాకు నచ్చిన వారికి వేయవచ్చు. టీవీ చర్చల్లో నాతోపాటు పాల్గొనేవాళ్లు ఒకరిద్దరు కూడా మా నియోజకవర్గం నుంచి బరిలో వున్నారు. కలిసినప్పుడు చెప్పాను కూడా. అయినా ఎవరూ ఫోన్ కూడా చేయలేదు. అంతవరకూ అదృష్టవంతుడినే.
ఇంతవరకు ఎవ్వరూ రాకపోయేసరికి, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళిచ్చే చీట్లు కూడా రాకపోయేసరికి అసలు జాబితాలో వున్నానా లేనా అనే సందేహం కలిగి సీఈఓ వెబ్ సైట్ శోధించాను. ఓటయితే వున్నది. పోలింగు కేంద్రం వివరాలు కూడా వున్నాయి. కాకపొతే పదడుగుల దూరంలో ఉన్న కేంద్రం కాకుండా పది ఫర్లాంగుల దూరంలో ఉన్న కేంద్రానికి వెళ్ళాలి. ఆటకు తక్కువ, నడక్కు ఎక్కువ. పరవాలేదు. మాఇంట్లో అందరికీ ఓట్లు వున్నట్టు నా శోధన తెలిపింది.
పొతే, మా అపార్ట్ మెంట్లో మరో డజను ఫ్లాట్లు వున్నాయి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వాకబు చేసుకుంటున్నారు, చీట్లు వచ్చాయా లేదా అని. రాలేదు. రాకపోతే పాయె, ఓట్లయితే వున్నాయి.
అదే పది వేలు.
చిత్రం ఏమిటంటే మా ఏరియాలో ఉన్న అనేక మంది తెలిసిన వాళ్లకు ఫోటోతో ఉన్న ఓటరు చీట్లు వచ్చేసి చాలా రోజులయింది.
4, డిసెంబర్ 2018, మంగళవారం
KSR Live Show | రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్ - 4th December 2018
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ 'కేఎస్ఆర్ లైవ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీమతి సునీత (టీబీజేపీ), శ్రీ దేవేందర్ రెడ్డి (టీకాంగ్రెస్), శ్రీ నాగేష్ (టీఆర్ఎస్).
KSR Live Show | రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్ - 4th December 2018
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ 'కేఎస్ఆర్ లైవ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీమతి సునీత (టీబీజేపీ), శ్రీ దేవేందర్ రెడ్డి (టీకాంగ్రెస్), శ్రీ నాగేష్ (టీఆర్ఎస్).
CPS pre-poll survey : Public Pulse || Telangana Assembly Elections 2018 ...
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలపై సెంటర్ ఫర్ సెఫాలజి సర్వీస్ సంస్థ వాళ్ళు నిర్వహించిన సర్వే ఫలితాలను సోమవారం రాత్రి TV 9 ఛానల్ ప్రసారం చేసింది. ఈ సందర్భంగా క్లుప్తంగా నిర్వహించిన చర్చలో నాతోపాటు సి పి ఎస్ సంస్థ నిర్వాహకులు శ్రీ వేణుగోపాల్, శ్రీ మురళీకృష్ణ (TV 9) పాల్గొన్నారు.
3, డిసెంబర్ 2018, సోమవారం
Debate on Is Possible 33% Reservation For BC in Legislatures | The Debat...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ చానల్ Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీమతి మాధవి (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీఆర్ఎస్), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ పట్టాభి (టీడీపీ)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)