20, నవంబర్ 2018, మంగళవారం
KSR Live Show | KCR Criticizes Telangan Mahakutami - 20th November 2018
ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీమతి పద్మజ (వైసీపీ), శ్రీ ప్రకాష్ రెడ్డి (టీబీజేపీ), శ్రీ విద్యాసాగర్ (టీఆర్ఎస్), శ్రీ కృష్ణ కుమార్ గౌడ్ (టీ కాంగ్రెస్).
19, నవంబర్ 2018, సోమవారం
Why Telangana Parties Neglecting Women In Election Candidates? | The Deb...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సివీఎల్ నరసింహారావు ( భార్యా బాధితుల సంఘం, ఫోన్ లైన్లో), శ్రీమతి మాధవి (టీబీజేపీ), శ్రీ తాడూరి శ్రీనివాస్ ( టీఆర్ఎస్), శ్రీమతి యామిని (టీడీపీ), శ్రీ నారాయణ మూర్తి ( వైసీపీ).
Why AP Govt Is Neglecting MLA Chintamaneni Prabhakar Acts On Officers? |...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సివీఎల్ నరసింహారావు ( భార్యా బాధితుల సంఘం, ఫోన్ లైన్లో), శ్రీమతి మాధవి (టీబీజేపీ), శ్రీ తాడూరి శ్రీనివాస్ ( టీఆర్ఎస్), శ్రీమతి యామిని (టీడీపీ), శ్రీ నారాయణ మూర్తి ( వైసీపీ).
Is Indian Laws Neglecting Men Problems with Women Laws? | The Debate wit...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సివీఎల్ నరసింహారావు ( భార్యా బాధితుల సంఘం, ఫోన్ లైన్లో), శ్రీమతి మాధవి (టీబీజేపీ), శ్రీ తాడూరి శ్రీనివాస్ ( టీఆర్ఎస్), శ్రీమతి యామిని (టీడీపీ), శ్రీ నారాయణ మూర్తి ( వైసీపీ).
18, నవంబర్ 2018, ఆదివారం
పార్టీ టిక్కెట్లు, ఓ జ్ఞాపకం
1999 ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ అసెంబ్లీకి,
పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు రావడంతో ఢిల్లీలో పార్టీ టిక్కెట్ల హడావిడి
అంతాఇంతా కాదు. ఢిల్లీలోని ఏపీ భవన్, హోటళ్ళు పార్టీ టిక్కెట్లు ఆశి౦చేవారితో వారి
మద్దతుదారులతో కిటకిటలాడిపోయాయి. నేనప్పుడు ఏదో పనిమీద వెళ్లి ఢిల్లీ ఏపీ భవన్ లో
వున్నాను. చివరి నిమిషం వరకు పార్టీ అధిష్టానం టిక్కెట్లు ఖరారు చేయకపోవడంతో
అభ్యర్ధులు చాలా టెన్షన్ పడ్డారు. మిగిలిన రాష్ట్రాల అభ్యర్ధులను నిర్ణయించి ఏపీ
వంతు వచ్చేసరికి నామినేషన్ల దాఖలుకు ఆఖరు ఘడియ దగ్గర పడింది. ఎట్టకేలకు అభ్యర్ధుల
ఎంపిక పూర్తయింది. వాళ్ళు హైదరాబాదు వెళ్లి గాంధీ భవన్ లో బీ ఫారాలు తీసుకుని
మళ్ళీ వారి వారి నియోజకవర్గాలకు వెళ్ళాలి. చుట్టుపక్కల అయితే పర్వాలేదు. ఉమ్మడి
రాష్ట్రం కనుక అటు ఆదిలాబాదు నుంచి శ్రీకాకుళం వరకు దూర ప్రయాణాలు చేయాల్సిన
వాళ్ళు మరింత ఉడ్డుగుడుచుకున్నారు. ముందు ఢిల్లీ నుంచి హైదరాబాదు చేరడం పెద్ద
పరీక్షగా మారింది. అందరికీ రిటర్న్ టికెట్స్ వున్నాయి కానీ అవి కన్ఫర్మ్ కావడం
అసాధ్యం. అప్పట్లో ఇప్పట్లా విమాన సౌకర్యాలు లేవు. హైదరాబాదు నేరుగా వెళ్ళే విమాన సర్వీసులు
చాలా తక్కువ. అవన్నీ చాలావరకు బుక్కయిపోయాయి. ఢిల్లీ నుంచి కలకత్తానో, బెంగళూరో,
చెన్నయో వెళ్లి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లయిట్ పట్టుకోవాలి. ఎక్కడ లెక్క తప్పినా మొత్తం
అన్నాళ్ళు పడిన శ్రమ వృధానే.
ఆ సమయంలో నాకు తెలిసిన ఒక రాజకీయ
మిత్రుడు ఎయిర్ లైన్స్ లో ఎవరయినా తెలుసా అని నన్ను వాకబు చేసారు. ఆ సమయంలో
ఆంధ్రాలో తుపాను ప్రమాదం వచ్చి పడింది. ఎయిర్ లైన్స్ బుకింగ్ కౌంటర్ లో అడిగితే,
నేను రేడియో విలేకరిని కనుక నా టిక్కెట్టుకు ఇబ్బంది లేదనీ, ఎమర్జెన్సీ కోటాలో కన్ఫర్మ్ చేసి ఇస్తామని
చెప్పారు. కానీ అవసరం ఆయనది కదా!
ఈ మీమాంసలో వున్నప్పుడు నాకు ఒక
వ్యక్తి చటుక్కున గుర్తుకు వచ్చారు. ఆయన నేను మాస్కో రేడియోలో పనిచేసేటప్పుడు
మాస్కోలో ఎయిర్ ఇండియా ఆఫీసులో పెద్ద అధికారిగా వుండేవారు. తరచూ కలుస్తూ వుండేవాళ్ళం.
ఇద్దరం కలిసి ఎయిర్ లైన్స్ ప్రధాన
కార్యాలయానికి వెళ్లాం. ఆయన ఇప్పుడు జనరల్ మేనేజర్ అయ్యారు. బయట పియ్యేని కలిసి నా
ప్రవర చెప్పుకుని ఆయన్ని కలవాలని చెప్పాను. నా మాస్కో పరిచయం గురించి తెలిసిన
తర్వాత ఆ పియ్యే లోపలకు ఫోను చేసి పలానావారిని పంపించమంటారా అని అడిగి, అనుమతి
తీసుకుని ఒక బంట్రోతును ఇచ్చి లోపలకు
పంపారు. పంపేముందు, వచ్చిన విషయం ఏమిటని అడిగితే ఓపెన్
టిక్కెట్టు కన్ఫర్మేషన్ కోసం వచ్చామని
చెప్పాము. ఆ పియ్యే చిరునవ్వు నవ్వి, ‘ఆయన్ని కలిసి ఈ చిన్నపని అడగకండి, అదేదో
నేనే చేసి పెడతానని, అప్పటికప్పుడే ఎవరికో ఫోను చేసి టిక్కెట్లు కన్ఫర్మ్ చేసాడు. వచ్చిన
పని అయిపొయింది కనుక ఆ పియ్యేకి కృతజ్ఞతలు చెప్పి, మాస్కో పెద్దమనిషిని లోపల
కలిసినప్పుడు టిక్కెట్ల విషయం ఎత్తకుండా ఇతరత్రా పిచ్చాపాటీ మాట్లాడి వచ్చేసాము. చాలా
ఏళ్ళ తర్వాత కలిశాను కనుక ఆయన కూడా బాగా
సంతోషపడ్డారు.
ఇక మా మిత్రుడి సంగతి చెప్పక్కర లేదు.
అధిష్టానం ఆఖరు నిమిషంలో పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. ఆఖరు నిమిషంలో విమానం
టిక్కెట్టు కన్ఫర్మ్ అయింది.
తరువాత ఆయన తన ప్రతిభతో ఎమ్మెల్యే
అయ్యారు. తదనంతర కాలంలో మంత్రి కూడా
అయ్యారు.
లేబుళ్లు:
ఓ జ్ఞాపకం,
పార్టీ టిక్కెట్లు
చిన్న విజ్ఞప్తి – భండారు శ్రీనివాసరావు
అనేక సంవత్సరాలు అయింది రామాంజనేయ
యుద్ధం సినిమా చూసి. అందులో ఆంజనేయుడు శ్రీరాముడితో వాదం పెట్టుకుంటూ ఒక పద్యం
చదువుతాడు. ఒకప్పుడు కలిసివుండి, ఒకరికొకరు సాయం చేసుకుని ఇప్పుడు విడిపోయి ఒకరిపై
ఒకరు దుమ్మెత్తి పోసుకునే రాజకీయ పార్టీల ప్రతినిధులను చూస్తున్నప్పుడు నాకీ పద్యం
ఎందుకో జ్ఞాపకం వస్తుంది.
నిన్ననో మొన్ననో ఈటీవీ ‘పాడుతా తీయగా’
కార్యక్రమంలో విశ్వనాద్ గారు, బాలూ గార్ల సమక్షంలో ఒక పిల్లపిడుగు ఈ పద్యం పాడుతుంటే చటుక్కున కాగితం తీసుకుని కొంత రాసుకున్నాను.
అయినా కొన్ని గ్యాపులు మిగిలిపోయాయి. మీలో ఎవరికయినా తెలిస్తే దయచేసి పూరించి పూర్తి
పద్యం పంపాలని నా కోరిక.
నేను రాసుకోగలిగినంతవరకు ఆ పద్యం:
ఆంజనేయుడు:
“సీతమ్మ జాడ మీ చెవివేయమైతిమా నాటితో
రామాయణంబు సున్న
“సేతుబంధన మాకు చేతగాదంటిమా
రావణు౦డిందాక రాజ్యమేలు
“మైరావణుని ప్రాణ మర్మంబు తెలపమా
యుద్ధమ్ము లంక అబద్ధమగును
“నిశిరాత్రివేళ సంజీవి తేమైతిమేని
సౌమిత్రి స్వర్గాన సభలుదీర్చు
“ఆలుబిడ్డలు మాకు ప్రాణాలటంచు అపుడు,
ఆనాడు కిష్కిందవీడి రామైతిమేమి..........”
“......... అది మా కోతి లక్షణ౦బు, మా
జాతి లక్షణంబు.... ఇపుడు నేడు ఇటుల చింతించి చింతించి వగచిన వగచిన ఏమి ఫలము?”
పార్టీల పాట్లు..నేతల పోట్లు | News Scan LIVE Debate With Vijay | 18th No...
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ ఉదయం TV 5 Vijay Narayan's News Scan చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ దుర్గాప్రసాద్ (టీటీడీపీ), శ్రీ తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), శ్రీ ప్రేమేంద్ర రెడ్డి (టీబీజేపీ).
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)