8, జూన్ 2015, సోమవారం

తల రోటిలోనే వుంచండి




తప్పనిసరయి ఇక తప్పదురా అనుకున్నప్పుడు అనుభవించి ఆనందించమని ఇంగ్లీష్ లో ఓ సామెత వుంది.
మంచికో చెడుకో టీవీ అనేది ఇప్పుడు నెసిసరీ ఈవిల్గా తయారయిందన్నది మాత్రం నిజం. తిట్టుకుంటూ అయినా చూడక తప్పని అవసరంగా మారిందన్నది మరో నిజం. కాదనలేని ఈ నిజాల దృష్ట్యా - తిట్టుకోవడం కూడా మానేసి 'టీవీని చూస్తూపోతూవుంటే నష్టపోయేదేమీ వుండదు కరెంటు ఖర్చు తప్ప' అన్నాడో టీవీ విప్లవకవి.

వెనుకటి రోజుల్లో, 'ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది' అంటే దూరదర్శన్ లో అనేవారు నవ్వుతాలుగా. కానీ ఇప్పడు యిరవై నాలుగ్గంటల న్యూస్ చానళ్ళు వచ్చేసిన తరువాత మొదలయిన ఊకదంపుడు చర్చలు చూస్తునప్పుడు 'ఆ పేడా పిడకలే నయమ'నే వారు ఎక్కువయ్యారు. వార్తల అధారంగా వ్యాఖ్యలు, వ్యాఖ్యల ఆధారంగా వార్తలు, మళ్ళీ వీటి ఆధారంగా చర్చలు, వాటిపై తిరిగి ఫోన్ ఇన్ లు’, మధ్యమధ్యలో విలేకరుల విరుపులు, యాంకర్ ల విన్యాసాలు, ‘లక్ష వొత్తుల నోములులక్ష సార్లు నోచుకోవాల్సిన న్యూస్ ప్రెజెంటర్ల మూకుమ్మడి తెలుగు భాషా హత్యాప్రయత్నాలు, బుల్లి తెర నిండుగా ఇప్పుడే అందిన ఎప్పటివో వార్తలు’, తాబేలు, కుందేలు మాదిరిగా డేకుతూ, పాకుతూ వెళ్ళే స్క్రోలింగులు, పంటికింది రాళ్ళలా యాడ్ లు ‘ - ఒకటా రెండా యేమని చెప్పుదు ఆ టీవీల లీలలు. యేమని వర్ణింతునూ ఆ ఛానళ్ళ సొగసులు అన్నాడో వికటకవి.

టీవీల్లో చూపించే చర్చలని చూస్తూ, ఆ చర్చలపై మళ్ళీ  చర్చోపచర్చలు చేసేవాళ్ళని చూస్తూవుంటాము. బుల్లి తెరలపై కానవచ్చే విశ్లేషణ కర్తలే- భుజాలపై శంఖు చక్రాలు పొడిపించుకుని, ‘భుజకీర్తులుతగిలించుకున్న భజన బృందగాన బృందావన విహారులుగా చెలరేగిపోతున్నప్పుడు మేము మాత్రం తీసిపోయామా అన్నట్టు చూసేవాళ్ళు కూడా సినీహీరోల వీరాభిమానుల మాదిరిగా చీలిపోయి, ఆయా రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులను కూడా మించిపోయి శృతి మించి రాగాలుఅందుకుంటున్న తీరుతెన్నులు గమనించేవారికి బ్రోచే వారెవరురా అన్న కీర్తన జ్ఞాపకం వచ్చి- ప్రకటితమో అప్రకటితమో కరెంటు కోతఒక్కటే తమను ఈ సజీవ హింస నుంచి కాపాడగలగలదని గజేంద్ర మోక్షంపద్యాలను తిరగేసి అరగదీస్తుంటారంటూ - ఇవా ఈనాడు జనానికి కావలసినవి? ఇదా ఈ రోజు జనం కోరుకుంటున్నది?’అని బోలెడు బోలెడు  ఆవేశపడిపోయాడో వికటాట్ట కవి.

కానీ, ఇక్కడే కరెక్టుగా పైన చెప్పిన సామెత అక్కరకు వస్తుంది. అన్ని వేలుపోసి టీవీలు కొనుక్కున్నదెందుకు? వున్న చీకాకులను మరచిపోయి హాయిగా కాలక్షేపం చేసేందుకు. అంతేకానీ, ఇలా అడ్డమయిన చర్చల్లో తలదూర్చి లేని తలనొప్పులు తెచ్చుకునేందుకు కాదుకదా. అందుకని తెలివయిన వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే టీవీ రోట్లో పెట్టిన తలను రోట్లోనే వుంచేసి రోకటి పోటుని ఆహ్వానించి ఆస్వాదించడం ఒక్కటే శరణ్యం  అంటూ సెలవిస్తున్నాడో ఉచిత సలహా కవి.
అందుకాయన ఇస్తున్న ఉదాహరణలను సోదాహరణంగా గమనించండి.
ముఖ్యమంత్రి గారు ఢిల్లీ బయలు దేరారు'
ముఖ్యమంత్రిగారు శంషాబాదు విమానాశ్రయం చేరుకున్నారు'
'ముఖ్యమంత్రిగారు ఢిల్లీ విమానం ఎక్కారు'
'ముఖ్యమంత్రిగారు కొద్దిగంటల్లో ఢిల్లీ చేరుకుంటారు'
'ముఖ్యమంత్రిగారు మరి కాసేపటిలో ఢిల్లీ చేరుకుంటారు' (ఢిల్లీ విమానం ఎక్కిన వాళ్లు వెళ్ళేది ఢిల్లీయేకదా,  డెహ్రాడూన్  వెళ్ళరు కదా అనే పిచ్చి అనుమానాలు పెట్టుకోకండి. నిజంగా పిచ్చెక్కవచ్చు)
ఎంతో ఆసక్తిని రగిలిస్తున్న ఈ అంశాలపై మేము అంటే మా ఛానల్ మాత్రమే నిర్వహిస్తున్న చర్చను మా ఛానల్ లోనే - ఈ రోజే, ఇప్పుడే చూడండి.

వంటా వార్పూ కార్యక్రమంలో ఇలా చేసి మాడండితరహాలో వెలువడే ఈ రకం ప్రకటనలు వింటుంటే నవ్వు రావడం లేదా? ఇంతటి హాస్యాన్ని ఇరవై నాలుగ్గంటలపాటు ఇంటింటికీ పంచుతున్న తెలుగు టీవీ ఛానళ్ళ నిర్విరామ, నిస్వార్ధ, నిర్వికార సేవా నిరతిని కొనియాడడానికి మీకు మాటలు రావడం లేదా? అయినచో మీకు నిష్కృతి యెట్లు?  మీబోటి బోంట్లకు అదే సరయిన మార్గం. తలను రోటిలోనే వుంచండి. రోకటి పోటుకు వెరవకండి. శేష జీవితానందాన్ని ఆ రోట్లోనే వెతుక్కోండి. శుభం భూయాత్! (Still,  I am proud to be called a media man)



NOTE: Courtesy Image Owner

7, జూన్ 2015, ఆదివారం

సతీ నీలాంబరి


నీలాంబరితో ఏకాంబరం పెళ్లి పెళ్లున జరిగిపోయింది. మొదటి రాత్రే ఏకాంబరం భార్యతో చెప్పాడు.
'మనం ఇద్దరం ఒక అవగాహనకు వద్దాం. నా మీద నీకు కోపం వస్తే కేకలు వెయ్యి. కానీ అప్పుడు  మనిద్దరం తప్ప మూడో వ్యక్తి వుండకూడదు. నేనూ అలాగే.  మరొకరు వున్నప్పుడు నీ మీద నోరు పారేసుకోను. అండర్ స్టాండ్?'
'అండర్ స్టాండ్. అల్లాగే' అన్నది నీలాంబరం.
భార్య సహకారం చూసిన  ఏకాంబరానికి ఆమె మీద ప్రేమ పూనకంలా తన్నుకు వచ్చింది.  
'నువ్వుంటే నాకు ఈ లోకంతో పనిలేదు. ఎదురుగా  ఎందరు వున్నా నా కంటికి నువ్వొక్కదానివే...' అంటూ గారాలు పోయాడు.
మర్నాడు కాఫీ తాగేటప్పుడు ఏదో విషయం మీద మాటా మాటా  వచ్చి మొగుడ్ని అత్తామామల ముందే కడిగి పారేసింది నీలాంబరి.  ఏకాంబరం బిత్తరపోయాడు. బిక్కచచ్చిపోయాడు.
ఆ రాత్రి వొంటరిగా వున్నప్పుడు  అడిగాడు 'అందరిముందు ఎందుకు అలా వొంటి కాలి మీద లేచావు' అని.
నీలాంబరి గారాలు పోతూ చెప్పింది.
'ఎవరున్నారు అక్కడ? మీరే కదా అన్నారు, ఎదురుగా నేనుంటే ఇక  ఎవరూ  లేనట్టే అని'
ఏకాంబరం మరోసారి బిక్కచచ్చిపోయాడు. 



NOTE: Courtesy Image Owner

ఎన్నేళ్లయిందో ఈ జోకు చదివి

షేర్ చేసిన మిత్రులకు ధన్యవాదాలు




NOTE COURTESY CARTOONIST AND PUBLISHER OF THE JOKE

6, జూన్ 2015, శనివారం

మౌనమె నా భాష ....


“I get intoxication while talking” అన్నాట్ట వెనుకటికి నాలాటి వాడు. మద్యం సేవించినప్పటికంటే కంటే కూడా మాట్లాడుతుంటే నాకు బాగా కిక్కువస్తుందన్నది మా ఆవిడ వువాచ. అదికూడా తోడయితే పట్టేవాళ్ళు వుండరన్నది ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం.   అదేవిటో నా వదరుబోతుతనం ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయిందన్నది అచ్చంగా  నా సొంత అభిప్రాయం. మాట్లాడడానికి తగ్గ వాతావరణం వుండాలని అప్పుడే మాట బాగా పెగులుతుందని వసకారుడుఏనాడో చెప్పాడు.
చదువుకునే రోజులనుంచి నాకీ మాటల పిచ్చి వుందనీ అందుకే చదువు చెట్టెక్కిందనీ మా పెద్దవాళ్ళు అంటుండగా అనేకసార్లు వినే అదృష్టం నాకు కలిగింది. అయినా వేరే ఆటలకన్నా నాకు మాటల ఆటలుఅంటే వున్న వ్యామోహం ఏమాత్రం తగ్గలేదు. బహుశా రేడియోలో ఉద్యోగం ఇవ్వడానికి నాకు వున్న అనర్హతలను ఈ అదనపు అర్హత కప్పిపెట్టిందేమో అని అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎస్సారార్ కాలేజీలో నాకంటే వయస్సులోనూ, చదువులోనూ పెద్దవాళ్లయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు వుండేవాళ్ళు. కాస్త వీలు దొరికితే చాలు వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు మొదలు పెట్టేవాడిని. శ్రద్ధ, సుధ అనే పేర్లు కలిగిన వాళ్ళిద్దరూ వాళ్ల నోట్సులు రాసిపెట్టేవరకు నా మాటలు విని ఆ తరువాత ఎంచక్కా మంచిది వెళ్ళి రండిఅనేసేవాళ్ళు. అలా అని మాటల వల్ల అసలు ఏమాత్రం ఉపయోగం లేదనే  గొప్ప  అభిప్రాయానికి వెంటనే  రానక్కర లేదు. వెనుకటికి నేను రైళ్ళలో రిజర్వేషన్ లేకుండానే ఈ మాటల మంత్రంతో తేలిగ్గా ప్రయాణాలు చేసేవాడిని. నిలుచుని కాసేపు కూర్చున్న వాళ్ళతో మాటలు కలిపేవాడిని. ఆ తరువాత వాళ్లు మాటల మైకంలో పడిపోయి  అదేమిటి మాస్టారు అలా నిలబడేవున్నారు వచ్చి ఇలా కూర్చోండిఅని జాగా ఇచ్చేవాళ్ళు. కొండొకచో మరికొందరు శ్రోతలు మరీ మొహమాట పడిపోయి నా మాటలు వింటూ వాళ్లు లేచి నిలబడి నాకు కూర్చునే జాగా ఇచ్చేవాళ్ళు. రేడియో ఉద్యోగంలో చెప్పక్కర లేదు. ఆఫీసుకి  పోవడమే గగనం కాని వెళ్ళానంటే చాలు న్యూస్ యూనిట్ చిన్న సభా ప్రాంగణంగా మారిపోయేది.  
అలాటి ఘన చరిత్ర కలిగిన  నేను ఈ నడుమ యెందుకు మాటలాటలు  తగ్గించానని మా ఆవిడ సయితం అనుమానిస్తోంది. వున్నట్టుండి ఈ వయస్సులో అంటే అరవై  ఎనిమిది దాటిన  తరువాత మా  ఆయనకు కాసింత పెద్దమనిషితనం కానీ  రాలేదు కదాఅని బోలెడు బోలెడు సంతోషం కూడా  పడిపోతోందష. తెలుగు  సీరియళ్ల ప్రోత్సాహాక ఉద్యమంలో మునిగిపోయి టీవీల్లో రాజకీయ చర్చలు పట్టించుకోకపోవడంవల్ల ఆవిడకు ఈ జ్ఞానోదయం ఆలశ్యం అయిందని నా అనుమానం.
నిజమే. టీవీ చర్చావేదికల్లో ఒకరిని మించి మరొకరు  దూషణలతో కూడిన తిరస్కారాలవల్ల కలిగిన మాత్సర్యసహిత ప్రేలాపనలు పక్కన కూర్చుని వినీ వినీ   నాకు మాట పడిపోతోందని ఆవిడకు తెలవదు.

అందుకే అన్నారు - 

అంతయు మన మేలునకే.
NOTE: Courtesy Image Owner  

అమావాస్య చంద్రులు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 07-06-2015, SUNDAY)  

చంద్రుడు ఎంతో కాంతివంతం అయితేనే కాని అమావాస్యనాడు కనిపించడు. ఇప్పుడు రెండు కొత్త తెలుగు రాష్ట్రాలను ఇద్దరు చంద్రులు పాలిస్తున్నారు. కేవలం అనుభవం, సమర్ధత కారణంగానే ప్రజలు వారిద్దర్నీ ఈ గద్దెలు ఎక్కించారు. అనుభవంలో కాని, రాజకీయ చాణక్యంలో కాని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఒకరికొకరు ఏమాత్రం  తీసిపోరు. వీరికి వున్న ఈ సానుకూల లక్షణాలు అన్నీ జనరంజకమైన పాలనకు దోహదం చేసి తీరాలి. మరి ఏడాది కాలం గడచిపోయింది కానీ జనాలు కోరుకున్నది ఏమన్నా జరిగిందా?
నిజానికి వీరిద్దరూ తమ తమ పరిధుల్లో, తమ ఆలోచనలకు తగ్గట్టు సుపరిపాలనకు పధకాలు రచిస్తూ పోయిన మాట నిజమే. ఎన్నికలకు ముందు చేసిన సవాలక్ష వాగ్దానాల బెడద లేకపోతే మరిన్ని మంచి ఫలితాలను ఇప్పటికే రాబట్టి వుండేవారేమో కూడా. అయితే ఆ హామీల్లో  కొన్ని ముందరి కాళ్ళకు బంధాలై కూర్చున్నాయి. ఉదాహరణకు  రైతుల రుణ మాఫీ. హామీ నెరవేర్చాము అని చెప్పుకోవడానికే కిందెత్తు, మీదెత్తు అయ్యారు. తీరా చేసారా అంటే ఏదో అరకొర అని అందరూ మెటికలు విరిచేవాళ్ళే  కాని, చెప్పింది మొత్తం చేసి చూపెట్టారు అనుకోవడానికి ఏమీ  లేదు. షరతులు వర్తిస్తాయి అనే వాణిజ్య ప్రకటనల మాదిరి మొత్తం మీద ఏదో పని పూర్తి చేశాం అని చేతులు దులుపుకోవాల్సిన  స్తితి.
హామీల అమలు నూటికి నూరు శాతం పూర్తిగా పూర్తి చేయలేకపోవడానికి కూడా వారి కారణాలు వారికి వున్నాయి. కొత్త రాష్ట్రాల్లో వూహించని  కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. కొన్ని స్వయంకృతాలు. మరికొన్ని  ప్రకృతి ప్రసాదాలు.
రెండో అంశం వారి చేతిలోనే కాదు, ఎవరి చేతిలోను లేదు. ఇక మొదటిది స్వయంకృతం. ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు. ఈ రెండింటి మధ్యా వారిద్దరూ కొన్ని పనులు చేసుకుంటూ పోయారు. ఏడాది గడిచిన తరువాత కూడా, ఇద్దరు ముఖ్యమంత్రుల పాలనపై ప్రతిపక్షాలను మినహాయిస్తే, ప్రజల్లో అంతగా వ్యతిరేకత కానరాక  పోవడానికి బహుశా అడపా దడపా చేస్తూ వచ్చిన కొన్ని మంచి పనులే కారణం కావచ్చు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అద్భుతం చేసి చూపెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణా ప్రాంతం విద్యుచ్చక్తి కొరతతో చీకటి మాయం అయిపోతుందని ఆరోజుల్లో భయపెట్టిన వాళ్లు వున్నారు. భయపడిన వాళ్ళూ వున్నారు. అయితే మండించిన వేసవిలో కూడా ఈసారి విచిత్రంగా కరెంటు సరఫరా జరిగిన తీరు చూసి ప్రత్యర్దులే చాటుగా నోటి మీద వేలు వేసుకున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కొత్త రాజదానికోసం వేలాది ఎకరాలను ప్రజలనుంచి సమీకరించగలిగారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కాని భూమి పూజ క్రతువు కూడా పూర్తిచేసి అనుకున్నది చేసి, కొత్త రాజధానిని  అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి తీరుతాననే కొత్త ఆశలను చిగురింప చేశారు. అది జరిగితే అదొక పరమాద్భుతం అవుతుంది.
ఇద్దరు ముఖ్యమంత్రులు సాధించిన విజయాలు మరికొన్ని లేకపోలేదు. పత్రికా ప్రకటనల్లో కనిపించిన జాబితాలు కొంత అతిశయోక్తిగా వున్నప్పటికీ పరవాలేదు అడుగులు సరిగానే, సరైన దిశలోనే పడుతున్నాయన్న ఆశలు కలుగుతున్నాయి.

పోతే, మరికొన్ని అంశాలు వారి అనుభవానికి, విజ్ఞతకు అనువుగా లేని మాట వాస్తవం. రాష్ట్రాలు ఏర్పడి, నూతన ముఖ్యమంత్రులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచీ, ఆ ముహూర్త బలం ఎలాటిదో కాని, ఇరువురి నడుమ పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్తితి. ఏవిషయం తీసుకున్నా, వివాదం కానిది లేదు. ఏ సమస్య తీసుకున్నా సానుకూలంగా పరిష్కారం అయ్యింది లేదు. ఈ వివాదాలకు ఎవరు ముందు తెర తీసారు అనేది పక్కనబెడితే, వాటికి తెరదించడం యెట్లా అనే విషయంలో ఎవరు ముందు చొరవ చూపుతారు అనే ప్రశ్న జవాబు లేకుండానే మిగిలిపోయింది.  ఏరోజు పేపరు తిరగేసినా చిటపటలే! ఏ టీవీ పెట్టి చూసినా పటపటలే! పిల్లలు ఆసక్తిగా చూసే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ఫిలిం మాదిరిగా అనుక్షణం ఒకరిపై మరొకరు పై చేయి అనిపించుకోవాలనే తాపత్రయమే కానవస్తోంది. ఆ కార్టూన్ చిత్రాల్లో వినోదం వుంది. కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల 'పొడగిట్టని' పోరాటవైఖరి అనేకమందికి మనస్తాపాన్ని కలిగిస్తోంది. ఈ అనేకమందిలో వారిద్దరి సమర్ధత పట్ల అచంచల విశ్వాసం కలిగిన వారి వీరాభిమానులు కూడా వున్నారన్నది వాస్తవం.
ముందు పేర్కొన్నట్టు ఏడాదిలో ఏమి ఆలోచించారో, ఏమేమి పధకాలకు రూపకల్పన చేశారో అవన్నీ ఒక తీరుకు వచ్చి అమలుకు నోచుకునే తరుణంలో, రెండు రాష్ట్రాల అవతరణ దినోత్సవం, లేదా దీక్షా దినం ఏ పేరు పెట్టినా ఏడాది పుణ్యకాలం పూర్తయి రెండో ఏట అడుగు పెట్టే సమయంలో చోటుచేసుకున్న కొన్ని ఉదంతాలు వారికే కాదు మొత్తం రాజకీయ వ్యవస్థకు సయితం మేలు చేసేవి కాదు. ఈ సంఘటనలతో ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రత్యక్ష ప్రమేయం వుండకపోవచ్చు. కానీ తమ హయాములో జరిగిన ఇటువంటి పరిణామాల విషయంలో వారు ఎంతో కొంత బాధ్యత తీసుకోవాలి. జరిగిన దానిని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలని చూడడం ఈనాటి రాజకీయ విలువల ప్రకారం గర్హ్యనీయం కాకపోవచ్చు. అయినా కాని, కొన్ని సందర్భాలలో రాజకీయాన్ని పక్కనబెట్టి చూసే సుగుణం నాయకులకి వుండితీరాలి. అలా కాక మొండిగా వ్యవహరించడం వల్ల వారి పేరు ప్రతిష్టలు పలచపడే ప్రమాదం వుంటుంది.                   

కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ గ్రామరు చెప్పడానికి ఒక లెక్చరర్ వుండేవాడు. పిల్లలు ఆయన క్లాసులో తెగ అల్లరి చేసేవాళ్ళు. ఆయన ఒకటే అనేవాడు.'పిల్లలూ. మీరు ఎలాగు గోలచేయకుండా వుండలేరు. కనీసం కాస్త తగ్గించి అల్లరి చేయండి'అని.
ఆయన అన్నట్టు ఈనాటి రాజకీయాల్లో కూడా  విలువల్ని అతిగా ఆశించలేము. విలువలతో రాజకీయం చేయడం ఇప్పుడెక్కవ్వరికీ సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే, చెప్పేది ఒక్కటే, కనీస విలువల్ని కాస్త కాపాడండి, అమావాస్యనాడు కూడా కనబడే చంద్రుడి మాదిరిగా మీ ప్రతిభను ప్రదర్శించండి అని మాత్రమే. (06-06-2015)

రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com మొబైల్:  98491 30595                

5, జూన్ 2015, శుక్రవారం

కొన్ని ముదురు ఇంగ్లీష్ జోకులు



"వెల్డింగ్ (అతుకు వేసేటప్పుడు) చేసేటప్పుడు ముందు రవ్వలు వస్తాయి. తరువాత అతుకు పెట్టిన రెండూ గట్టిగా అటుక్కుపోతాయి. అదే వెడ్డింగ్ లో ముందు ఇద్దరు వ్యక్తుల నడుమ బంధం ఏర్పడుతుంది. తరువాత ఆగకుండా రవ్వలు వస్తాయి"
"చుట్టూ చీకట్లు కమ్ముకుంటే తొలగించమని ముందు దేవుడ్ని ప్రార్ధించండి. ఫలితం లేనిపక్షంలో వెంటనే వెళ్ళి కరెంటు బిల్లు కట్టి రండి"
"ఎవడయినా భార్యకు కారు డోరు తెరిచిపట్టుకున్నాడు అంటే అతగాడికి కారు అన్నా కొత్తది కావాలి. భార్య అయినా కొత్తది అయుండాలి"   
"మనసు ఉద్రిక్తం కావడం, ఆందోళన కలగడం,  భయం వేయడం ఇవన్నీ  వేర్వేరు సందర్భాలలో అనుభవానికి వస్తాయి. భార్య కడుపుతో వున్నదని కబురు వింటే మనసు  సంతోషంతో ఉద్రిక్తం అవుతుంది. స్నేహితురాలు నెల తప్పిందని తెలిస్తే గాభరా, ఆందోళన తప్పవు. ఇద్దరూ గర్భం ధరించారన్న వార్త ఒకేసారి తెలిసింది అనుకోండి. ఇకచెప్పేది ఏముంది, గాభరా ఆందోళనా, భయం ఇత్యాదివన్నీ ఒకేసారి ఆవహిస్తాయి"
"గ్రామరు పీరియడ్ లో టీచరు పాఠం చెబుతూ చింటూని అడిగింది.
'ఈ పీరియడ్ కు వున్న ప్రాధాన్యత తెలుసా' అని.
చింటూ చెప్పాడు.
'సరిగ్గా తెలియదు కానీ మేడం, ఒకసారి ఇంట్లో ఈ మాట విన్నాను. మా చెల్లెలు అమ్మతో ఈనెల పీరియడ్ రాలేదని చెబుతోంది. అది విని మా అమ్మ స్పృహ తప్పింది. నాన్నకు గుండెపోటు వచ్చింది. మా డ్రైవర్ పత్తా లేకుండా పోయాడు'
చింటూ తండ్రిని అడిగాడు, నమ్మకానికి రహస్యానికి అర్ధం ఏమిటని. తండ్రి బదులు చెప్పాడు.

'నువ్వు నా కొడుకువి. ఆవిషయం నమ్మకంగా చెప్పగలను. అదిగో ఆ పక్కింట్లో నీ స్నేహితుడు వున్నాడు చూడు. వాడూ నా కొడుకే. కాని అది రహస్యం. పైకి చెప్పుకోలేను'  
NOTE: Image courtesy: Instant humour.com 

3, జూన్ 2015, బుధవారం

Aditya the great

Full story published in FORBES about Aditya Krishna Roy Vanam, only son of my friend Vanam Jwala Narasimha Rao and my niece Smt Vijaya Lakshmi - "Square is looking to grow if a recent hire is any indication.


(VANAM ADITYA KRISHNA ROY)


On Monday night, former Google GOOGL +0.92% executive Aditya Roy announced on his LinkedIn profile that he had joined the payments company to head up recruiting, human resources and diversity initiatives as its “Head of People.” Roy had been previously been working as Google’s director of people operations in the Asia Pacific region out of Singapore.

With more than 1,000 people in places including San Francisco, Tokyo and Melbourne, Square has gone from a startup that focused mainly on payment processing to a company offering a variety of small businesses services including loans, marketing and restaurant delivery. While the company came under heavy scrutiny last year after reports said that it was performing poorly had lost $100 million in 2013, the hiring of Roy suggests a different narrative as Square looks to expand and bolster its workforce.

“Adi bring to Square more than 15 years of people experience and a deep understanding of what it takes to build a strong, global organization,” said a Square spokesperson in an email.

Before joining Square, which raised $150 million in October at a $6 billion valuation, Roy spent almost 10 years at Google. He started there as a human resources manager in his native India after previously working at Dell and Career Launcher, an education startup. Roy officially started his new job on Monday, according to LinkedIn, and is based out of Square’s San Francisco headquarters.

The Square spokesperson did not comment on the company’s current financial performance, though CEO Jack Dorsey said in a recent interview with Buzzfeed that previous rumors of the company’s downward spiral were wrong. “The most negative press—the loss, the acquisition, the IPO—was just not based on reality,” he said. “We invested our money to grow the company, which every single company out there does. We chose not to focus on profit in order to focus on growth.”


“I think the biggest thing that the year of bad press put upon us and focused us on was how important it is to make sure that we have not just an internal cohesion but an external cohesion, and that there are visible connections between everything that we’re doing,” he added."

NOTE COURTESY FORBES.COM)