వాన రాకడ ప్రాణం పోకడ తెలియవని సామెత.
గవర్నమెంటు ఆఫీసుల్లో సిబ్బంది రావడానికీ, తిరిగి
ఇళ్ళకు పోవడానికీ నియమిత సమయాలు వుంటాయి. రావడం సంగతి వాళ్ళ ఇష్టం కానీ పోవడం
మాత్రం ఠంచనుగా టైముకే అని గిట్టని వాళ్ళు అంటుంటారు. కరెంటు కోతల విషయంలో ఇది తిరగబడ్డట్టు
వుంది. తీయడం మాత్రం ఒక నిమిషం అటూఇటూ కాకుండా తీస్తారు. తిరిగి ఇవ్వడం మాత్రం
వాళ్ళ దయా మన ప్రాప్తం.