'ఓ కప్పు కాఫీ పట్రా'
'ఒక్క క్షణంలో తెస్తాను వుండండి'
పదేళ్ళ తరువాత ..
'ఓ కప్పు కాఫీ ఇస్తావా?'
'ఓక్షణం ఆగండి. చేతిలో పని కాగానే పట్టుకొస్తాను'
మరో పదేళ్ళ తరువాత .....
'ఇదిగో! ఏమోయ్! తల నాదుగా వుంది. ఓ కప్పు కాఫీ ఏమైనా
దొరుకుతుందా!'
'అదిగో. ఫ్లాస్క్ లో పోసి పెట్టాను. తాగండి'
ఇంకో పదేళ్ళ తరువాత....
'సరేగాని ఓ కప్పు కాఫీ...'
'ఏమిటి! ఏమిటీ అంటున్నారు. కాస్త గట్టిగా
చెప్పండి''
(చట్టబద్ధమైన హెచ్చరిక: ఆడవారి కాలమానం అందరికీ
ఒక్క లాగా వుండదు. కాలం కలిసిరాకపోతే ఈ మొత్తం సీనూ ఒక్క పదేళ్ళలోపే అనుభవం లోకి
రావచ్చు' )
చిత్రకారులు 'శ్రీరామ్' గారికి కృతజ్ఞతలు
చిత్రకారులు 'శ్రీరామ్' గారికి కృతజ్ఞతలు
