ఆగస్టు 17 న చక్రం అడ్డంవేసి బతికింది ఈరోజు పొద్దున్నే ఈ విషాద వార్త వినడం కోసమేనేమో!
'డాక్టర్ మనోహర్ గారు మీ మేనల్లుడా? ఆయన సాక్షాత్తు దేవుడండీ ' అని తెలిసిన వాళ్ళు అంటుంటే వొళ్ళు పులకరించేది. నాకంటే ఒకటి రెండేళ్లు వయసులో చిన్న. అయినా ' ఏరా మామా! ఎలా వున్నావ్ ' అని ఫోన్ చేసి పలకరించేవాడు.
లండన్ లో చదువుకుని హైదరాబాద్ లో డాక్టర్ ప్రాక్టీసు. అదీ పిల్లల డాక్టరుగా.
విదేశంలో వున్నప్పుడు అలవాటయిన స్మోకింగ్ ని అరక్షణంలో వదిలేసాడు, చంటి పాప తల్లి ఒకరు మొహం తిప్పుకోవడం గమనించి.
మా కుటుంబంలోనే కాదు, తెలిసిన వాళ్ళ కుటుంబాల్లో ఎవరికి ఏ సుస్తీ చేసినా, ముందు మనోహర్ ని సంప్రదించేవారు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా, విసుక్కోకుండా వాళ్ళు చెప్పేది వినేవాడు. అవసరం అనుకుంటే బయలుదేరి వెళ్ళేవాడు.
అలాంటి మనోహర్ ఇకలేడు.
పిలవకుండానే పలికే డాక్టర్ ఇక పిలిచినా రాడు.
ఇలాంటి వారికి పుణ్య లోకాలు సిద్ధించాలని ప్రత్యేకంగా ప్రార్ధనలు అక్కర్లేదు. అవే వీరికోసం ఎదురు చూస్తుంటాయి.
7-9-2026