దమ్ముందా? ధైర్యముందా? – భండారు శ్రీనివాసరావు
తర్డ్ రేట్ తెలుగు సినిమాల్లో తరచుగా వినవచ్చే ఈ రెండు పదాలు ఈ మధ్యకాలంలో బుల్లి తెరల వార్తల్లో, చర్చల్లో పదే పదే వినబడుతున్నాయి.
‘జగన్ కు దమ్ముందా? చంద్రబాబుకు దమ్ముందా? రాజీనామాలు ఆమోదించే ధైర్యం దమ్మూ స్పీకర్ నాదెండ్ల కు వున్నాయా? ఆమోదించమని చెప్పే దమ్ము సీఎం కిరణ్ కు వుందా? రాజీనామాలు ఆమోదింపచేసుకునే దమ్ము ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వుందా?’
ఇలా ఎవరికి వారు ఎదుటివారిపై చెలరేగిపోయేవారే. ధైర్యం దమ్మూ తమకే వుందనీ, ఎదుటివారికి ఈ రెండూ సున్నా అని ఎగబడిచెప్పే వారే.
ఈ సవాళ్ళ అర్ధం ఏమిటి? అసలెవరికీ దమ్మూ ధైర్యం లేవనా?
ఒకటి మాత్రం వీరందరికీ తెలుసు.
అసలు సిసలు ధైర్యం దమ్మూ వున్నవాళ్ళు జనంలో వున్నారు.
కానీ వారు వాటిని బయటకు చూపడానికి ఇంకా రెండేళ్లకు పైగా టైముంది.
అదే వీళ్ళకున్న దమ్మూ ధైర్యం! (15-10-2011)

మాటలు కోటలు - చేతలు బీటలు