ఇదెక్కడి న్యాయంCourt rulings లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇదెక్కడి న్యాయంCourt rulings లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జనవరి 2016, సోమవారం

ఇదెక్కడి న్యాయం


కోర్టుల అధికారం కూడా ఇళ్ళల్లో నాన్నల పెత్తనం లాంటిదే అనిపిస్తుంది. అర్ధరాత్రి దాకా బజార్లు పట్టుకు తిరిగొచ్చిన  పిల్లాడు ఇంటి పట్టున పడి వుండేదాకా అన్నం పెట్టొద్దని పెళ్ళానికి హుకుం జారీ చేస్తాడు. పిల్లాడు ఇంట్లో వున్నాడా, వీధుల్లో తిరుగుతున్నాడా అన్నది మళ్ళీ భార్య చెబితేకాని తెలియదు.
కోర్టు ఆదేశం అంటూ అనేక వార్తలు వస్తుంటాయి. ఆ ఆదేశాలు ఎంతవరకు అమలవుతున్నాయో పర్యవేక్షించే వ్యవస్థ  కోర్టులకు వున్నట్టు లేదు. మళ్ళీ ఎవరయినా పిర్యాదు చేసేదాకా కోర్టు ధిక్కరణ కింద చర్య తీసుకోవడానికి లేదు.