ఇదిగో రేడియో చిన్నక్క స్వరం – భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇదిగో రేడియో చిన్నక్క స్వరం – భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, నవంబర్ 2026, గురువారం

ఇదిగో రేడియో చిన్నక్క స్వరం – భండారు శ్రీనివాసరావు

 

రేడియో చిన్నక్క రతన్ ప్రసాద్ గారి గురించి రాసిన తర్వాత, ‘వీలయితే వారి స్వరం రికార్డు వుంటే పోస్ట్ చేయండి’ అనే అభ్యర్ధనలు పెద్ద సంఖ్యలో వచ్చాయి.
వీలుండే వుంటుంది. కానీ ఆ సాంకేతిక పరిజ్ఞానం నాకు బొత్తిగా లేదు. ఈ సమయంలో రేడియో అభిమాని బ్లాగు నడుపుతున్న స్నేహితులు Sivaramaprasad Kappagantu కప్పగంతు శివరామ ప్రసాద్ గారు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారు కూడా ఈ ఆధునిక సాంకేతికతను ఏకలవ్యుడిలా సొంతంగా అలవర్చుకున్నవారే.
మా సంభాషణలో ఒక కొత్త అంశాన్ని ఆయన లేవనెత్తారు. రతన్ ప్రసాద్ గారితో పాటు జీవించి వున్న మరికొంతమంది రేడియో కళాకారులను కూడా ఇంటర్వ్యూ చేసి వారి స్వరాలను, అనుభవాలను భద్రపరచాలి అనేది వారి ప్రతిపాదన. బాధ్యత అంతా తమ భుజస్కంధాలపై వేసుకుంటామని మరో చల్లని మాట చెప్పారు. నాది ఈ క్రతువులో ఉడత సాయం.
వెంటనే ఢిల్లీలో వుంటున్న రతన్ ప్రసాద్ గారికి ఫోన్ చేశాను. వారిది వయో భారం. అయినా పెద్ద మనసుతో సరే అన్నారు. మొన్న ఆదివారం ముహూర్తం పెట్టుకుని అదేదో గ్రూప్ కాలో, కాన్ఫరెన్స్ కాలో ఏదో అంటారు, అది చేసి రతన్ ప్రసాద్ గారిని, నన్నూ కలిపి మాట్లాడారు శివరామ ప్రసాద్ గారు.
దాదాపు గంటకు పైగా మాట్లాడారు చిన్నక్క. ప్రశ్నలు, జవాబులు వారిద్దరి మధ్యనే నడిచాయి. నాది మౌన శ్రోత పాత్ర.
ఇక ఎడిటింగ్ బాధ్యత షరా మామూలుగా శివరామ ప్రసాద్ గారిదే. చాలా కష్టపడి ఎడిట్ చేసి YOUTUBE లోకి అప్ లోడ్ చేసి లింక్ పంపారు.
దాన్ని విని, రతన్ ప్రసాద్ గారు ఫోన్లోనే మహానందపడ్డారు. ఒక మంచి పనిలో చిటికెన వేలు పెట్టానన్న ఆనందం నాకూ కలిగింది.
ఈ యజ్ఞానికి కర్తా కర్మా క్రియ అయిన కప్పగంతు శివరామ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.
See less