14, అక్టోబర్ 2024, సోమవారం

అతి వర్జయేత్!

పొద్దున సాక్షిలో చదివాను. నేను చదివే మరో రెండు ప్రధాన పత్రికల్లో  కనపడలేదు. 

చాలా కాలంగా నేను చెబుతోంది ఇదే. పదవిలోకి రాగానే తమ చుట్టూ వలయంలా ఏర్పడే భద్రతా సిబ్బంది వల్ల ఎంతటి రక్షణ లభిస్తుందో తెలియదు కానీ, వారివల్ల నాయకులకు చెడ్డ పేరు రావడానికి అవకాశాలు ఎక్కువ.

పాత తరం వయోధిక పాత్రికేయులు ఇటువంటి వేడుకలకు  ఆహ్వానం లేకుండా వెళ్ళరు. ఈ తరం పోలీసులకు వారెవ్వరూ తెలియదు. పిలిచిన వాళ్ళే బాధ్యత తీసుకోవడం సముచితంగా ఉంటుంది.

 గతంలో పత్రికల వారిపట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు మా కాలంలో నేను ఎరుగుదును.
కానీ ఆ మంచి కాలానికి కాలం చెల్లింది.
వారిద్దరూ, మాడభూషి శ్రీధర్, పాశం యాదగిరి వయసు రీత్యానే కాకుండా వృత్తి రీత్యా కూడా ఈ పాత్రికేయ రంగంలో పెద్దవారు. భౌతిక గాయాల నుంచి కోలుకోవచ్చు కానీ, ఇలాంటి సందర్భాలలో  మానసిక గాయాల నుంచి కోలుకోవడం కష్టం.
ఈ ఘటనను ఖండిస్తున్నాం అనేది చిన్న మాట.
పునరావృతం కానివ్వం అనేది ఏలికల షరా మామూలు మాట.
ఇంతకంటే ఏం చెప్పను?

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మాడభూషి శ్రీధర్ రాసే వ్యాసాలు అసహ్యం కలిగిస్తాయి. ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులు, కువిమర్శకులు సమాజానికి గుదిబండలు. ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు పొంది తిరిగి తిడుతూ అంటారు. అసలు ఇలాంటి వ్యక్తిని అలయ్ భలయ్ కి పిలవడమే తప్పు. పైగా ఉబోస ఇస్తున్నాడు.

అజ్ఞాత చెప్పారు...

ఎవడ్రా నువ్వు ?
మాడభూషి గారంటే ఎవడనుకున్నావురా వెధవా ?

అజ్ఞాత చెప్పారు...

నా వ్యాఖ్యలో చెప్పాను కదా మరొకసారి చదువు మిత్రమా. అతని వ్యాసాలు వీలైతే చదువు. నీకే బోధపడుతుంది.

అజ్ఞాత చెప్పారు...

ఏమి చదివేది నా బొందా ?
బండారు వారికన్న మాబూ గారి గురించి నీకే తెలుసునేమిట్రా సన్నాసీ ?

అజ్ఞాత చెప్పారు...

ఆయనకు తెలిసిన విషయం ఆయన చెప్పాడు మిత్రమా. నాకు తెలిసిన విషయం నేను చెప్పాను. ఏటి? అర్థమైందేటి?

ఒక సినిమాలో బాలయ్య డైలాగు: గట్టిగా అరవమాకు బాటరీ వీకైపోద్ది 😷.

అజ్ఞాత చెప్పారు...

అంతే నంటారా ?
మీరూ వారిలా మేధావుల్లా వున్నారు
మీరూ మీరూ తేల్చేసుకోండయితే :)


అజ్ఞాత చెప్పారు...

అందరూ పోలోమని వేదిక మీదికి వస్తే మరి సెక్యూరిటీ వాల్లు కుమ్మి వదిలిపెడతారు. అదే జరిగింది. అందులో తప్పేముంది.