24, ఫిబ్రవరి 2024, శనివారం

మూడు రోజుల్లో ముగిసిన 47 ఏళ్ళ జీవితం – భండారు శ్రీనివాసరావు

 

సరిగ్గా నేటికి ఇరవై రోజుల క్రితం నా నెత్తిన ఓ పిడుగు పడింది. మెదడు మొద్దు బారింది. నా కలంలో ఇంకు ఇంకిపోయింది. చుట్టూ ఉన్న ప్రపంచం చీకటి అయిపోయింది. నలభయ్ ఏడేళ్ల వయసున్న నా రెండో కుమారుడు సంతోష్ ఈ నెల ఫిబ్రవరి నాల్కో తేదీ ఉదయం కార్డియాక్ అరెస్టుతో కన్ను మూశాడు. ఒకటో తేదీ చెస్ట్ కంజెషన్ కంప్లయింట్ తో అపోలో ఆసుపత్రిలో చేరాడు. మొదటి రోజు అడ్మిషన్, రెండో రోజు ఐ సీ యు, మూడో రోజు వెంటిలేటర్, నాలుగో రోజు ఉదయం మా ప్రయత్నం మేము చేశాం అనేసి చెట్టంత కొడుకుని కట్టెగా మార్చి ఇంటికి పంపేశారు. అలా మూడు రోజుల్లో మావాడి నలభయ్ ఏడేళ్ల జీవితం ముగిసిపోయింది.

అయిదేళ్ళ క్రితం మా ఆవిడ నిర్మల ఇలాగే నన్ను వదిలేసి పై లోకాలకు వెళ్లి పోయింది. అప్పుడు ఇలాగే రంపపు కోత. ఇప్పుడు ఏకంగా కడుపు కోత.

నా కోడలు నిషా బాధతో పోలిస్తే నాదెంత అని సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి నాది. ఎదిగే పొద్దు వాళ్లది. వాలే  పొద్దు నాది.

‘భరింప శక్యం కాని బాధ ఏమిటి?’ అని యక్షుడు ధర్మరాజుని ప్రశ్నిస్తే, ‘పెద్ద వాళ్ళ కళ్ళ ముందే చిన్నవాళ్లు దాటిపోవడాన్ని మించిన బాధ ఏముంటుంది అంటాడు. 

పిల్లల్ని ముద్దు పేర్లతో కాకుండా అసలు పేర్లతో పిలవాలి అనే కోరికతో నా పిల్లలకు సందీప్,  సంతోష్ నామకరణం చేసుకున్నాను. ఎప్పుడూ అరె ఒరే పిలవలేదు. ఇప్పుడు తప్పడం లేదు.

      

‘నన్ను సరే! నీ ప్రాణానికి ప్రాణం అయిన నీ రెండేళ్ల కూతురు జీవికను వదిలి ఎలా వెళ్ళావురా సంతోష్!  జరిగి రోజులు గడిచిపోతున్నా నేను ఇంకా  ఇలా వున్నాను అంటే నేను తండ్రి నేనా!

నాది గుండా! రాతి బండా!

(24-02-2024)




12 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

సానుభూతి తెలుపడం తప్పించి ఏమీ చేయలేని స్థితి రావు గారు.

సంతోష్ గారి ఆత్మశాంతి కలుగు గాక.

అజ్ఞాత చెప్పారు...

Deeply pained to know about the demise of your son sir. May he attain Sadgathi. Om shanti. Heartfelt condolences to you and your family. May God give the strength to overcome this irreplaceable loss to you.🙏

sarma చెప్పారు...

జీవితంలో జరగకూడని సంఘటన, అంతులేని వ్యధ. దురదృష్టం. బాధపడటం తప్పించి ఏమీ చేయలేని అసహాయత. సానుభూతి తెలపడం తప్పించి ఏమీ చేయలేని నిస్సహాయత. అతని ఆత్మ సద్గతిని పొందాలని భగవంతునితో మొర.

Bonagiri చెప్పారు...

శ్రద్ధాంజలి

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కొడుకు కోడలు మనవరాలిని పరిచయం చేశారు. బాగా గుర్తున్నారు. వాళ్ళతో కాసేపు మాట్లాడాను కూడా.

ఇప్పుడీ వార్త విని అవాక్కయ్యాను. మధ్య వయసు వాళ్ళకు, యువకులకు కూడా హఠాత్తుగా గుండె ఆగిపోయి మరణం సంభవించడం ఈ మధ్య ఎక్కువవుతోంది. బహుశః పరుగులు పెట్టిస్తున్న ఈనాటి జీవన శైలి కలిగిస్తున్న విపరీతమైన stress ప్రధాన కారణం అంటారు. ఏమైనప్పటికీ మీకు వ్యక్తిగతంగా దెబ్బ మీద దెబ్బ అని చెప్పాలి.

మీకందరకూ నా ప్రగాఢ సానుభూతి. మీకు ఇతర కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, మీ కొడుకు ఆత్మకు సద్గతిని ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 🙏

అజ్ఞాత చెప్పారు...

కరోనా వాక్సిన్ దుష్ప్రభావం వల్ల కూడా కొంత మంది యువకులలో అసాధారణ హృద్రోగ మరణాలు సంభవిస్తున్నాయి అని కూడా అంటున్నారు.

అజ్ఞాత చెప్పారు...

Condolences to you and your family. May his soul rest in peace. Stay strong and take care of your health.

Lalitha చెప్పారు...

అయ్యో! ఎంత కష్టం మీకు తండ్రిగా... అంతకు మించిన కష్టం మీ కోడలు గారిది, మీ మనవరాలిది. ఏమనాలో తోచట్లేదు. మీ కుటుంబానికి ఈ సమయంలో అవసరమైన ధైర్యం, సాంత్వన కలగాలని కోరుకుంటున్నాను.

అజ్ఞాత చెప్పారు...

Very sorry to hear about your loss, Srinivasa Rao garu.

అజ్ఞాత చెప్పారు...

Deep condolences to you and your family sir. I come to Maalika to read specific blogs and yours is the main among them. It was painful to see this one. Praying for strength to you and your family sir.

raamudu చెప్పారు...

శ్రీనివాసరావు గారు, ఇంత కాలం మీరు పోస్ట్లు వయోభారం వల్ల తగ్గించేరు అనుకొన్నాను. కానీ ఈదుర్ఘటన నిస్సందేహంగా కోలుకోలేనిది. సంతోష్ గారికి సద్గతులు కలగాలని కోరుకొంటూ, మీరు మళ్ళీ వ్రాయండి. మీరు తెరుకోవడానికి అదే సరైన ఉపకరణం.

నీహారిక చెప్పారు...

🙏