కరోనా పుణ్యమా అని కార్పొరేట్ ఆఫీసుల్లో మూడేళ్ళుగా వర్క్ ఫ్రం హోం పేరుతొ పసిపిల్లల తల్లులు అయిన మహిళా ఉద్యోగినులకు మంచి వెసులుబాటు లభించింది. అలాగే, ఇంట్లో చూసుకునే పెద్దలు లేక తల్లీ తండ్రీ ఇద్దరూ ఆఫీసులకు పొతే, ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన పిల్లలకు కూడా ఒంటరితనం నుంచి గత మూడేళ్ళుగా విముక్తి లభించింది. ఏ సుఖమైనా కొన్నాళ్ళే కదా! నెమ్మదిగా వర్క్ ఫ్రం హోం విధానం గతంలోకి జారుకుంటోంది. ఆఫీసులకు రమ్మని పిలుపులు మొదలయ్యాయి.
మా పిల్లలు కూడా కార్పొరేట్ ఉద్యోగులే. రేపో మాపో
ఆఫీసులకు వెళ్ళాల్సి వస్తుందని తెలుసు. అంచేత మా మనుమరాలిని కనిపెట్టి
చూసుకోవడానికి ఇరవైనాలుగు గంటలు ఇంట్లోనే వుండే ఆయాని వెతికి పెట్టారు. ఓ నలభయ్
ఏళ్ళక్రితం మా ఆవిడ అమ్మవొడి పేరుతొ చిక్కడపల్లి లో నిర్వహించిన చైల్డ్ కేర్
సెంటర్ లో పాతిక ముప్పయిమంది పసివారి ఆలనా పాలనా ఇలాగే చూసేది.
కొత్తతరం కదా! కొత్త ఆలోచనలు.
ఆఫీసు నుంచి కూడా జీవిక బాగోగులు ఓ కంట కనిపెట్టి చూడడానికి ఇంట్లో, ఇదిగో ఈ కింద
ఫోటోలో కనిపిస్తున్న సీ సీ కెమెరాను అమర్చారు.
1-2-2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి