9, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఎంతెంత కాలం? ఇంకెంత కాలం??




ఏకఛత్రాదిపత్యంగా పాలించిన మహా మహా చక్రవర్తులు సయితం ఒక వయసు రాగానే కొడుకులకు రాజ్యభారం అప్పగించి వానప్రస్తాశ్రమానికి వెడతారని పురాణ కధలు చెబుతాయి.
మరి భారత ప్రజాస్వామ్యంలో అలాంటి వీలు ఎందుకు లేదని కొందరి ఘోష.
ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికెవ్వరికీ రిటైర్ మెంటు లేదు. కొన్ని నియంతృత్వ దేశాలు, కమ్యూనిష్ట్ దేశాలను మినహాయిస్తే గొప్ప గొప్ప ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా ఒకే వ్యక్తి సుదీర్ఘ కాలం అధికారపీఠంపై కొనసాగిన దాఖలాలు లేవు. అమెరికా విషయమే తీసుకుందాం. ఆ దేశ అధ్యక్షుడిగా ఎవరయినా సరే రెండు దఫాలు, అంటే ఎనిమిదేళ్ళకు మించి ఏ ఒక్కరూ వైట్ హౌస్ ను అంటిపెట్టుకుని ఉండరు. ఒక పార్టీ అధికారంలో దీర్ఘ కాలం అధికారంలో ఉండవచ్చు కానీ, ఒకే వ్యక్తి, అతడు ఎంతటి ప్రజ్ఞాధురీణుడైనా సరే అధ్యక్షుడిగా నియమిత కాలాన్ని మించి పదవిలో వుండడం కుదరదు. అమెరికా అధ్యక్షుడిగా గతంలో పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్న వాళ్ళు అయిదుగురు వున్నారు. ఎవరికి వారు తమ ప్రవృత్తికి తగిన వ్యాపకాన్ని ఎంచుకుని శేష జీవితం గడుపుతున్నారు. అధ్యక్షుడిగా ఉన్నకాలంలో వారందరూ తమ తమ తెలివితేటలకు తగినట్టుగా పాలనా వ్యవహారాలను చక్కదిద్దారు. ప్రపంచ రాజకీయాలను శాసించారు. అయితే ప్రతిదానికీ ఒక ముగింపు వుంటుంది. వైట్ హౌస్ లో వుండగా దుర్నిరీక్షంగా పాలించిన వారందరూ ఇప్పుడు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఈ అయిదుగురు మాజీ అధ్యక్షులు, బారక్ ఒబామా, (డెమోక్రాటిక్ పార్టీ- 2009), జార్జ్ డబ్ల్యూ. బుష్, జూనియర్, (రిపబ్లికన్ పార్టీ-2001) బిల్ క్లింటన్,(డెమోక్రాటిక్ పార్టీ- 1993), జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్ సీనియర్, (1981-89),రిపబ్లికన్ పార్టీ, జిమ్మీ కార్టర్ (1977-81) డెమోక్రాటిక్ పార్టీ. వేర్వేరు పార్టీలకు చెందినవారు అయినప్పటికీ అప్పుడప్పుడూ కలిసి అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు.
జిమ్మీ కార్టర్ వయసు ఇప్పుడు 94 సంవత్సరాలు. కొన్ని వందల గదులతో అలరారే శ్వేత భవనం (వైట్ హౌస్) లో అధ్యక్షుడిగా సకల సదుపాయాలతో జీవించిన ఈ వృద్ధ రాజకీయ నాయకుడు ఎప్పుడో 1961లో కట్టుకున్న ఒక సాదా సీదా రెండు పడక గదుల ఇంట్లో తన భార్యతో కలిసి శేష జీవితం గడుపుతున్నారు. వారాంతపు రోజుల్లో ఇరుగు పొరుగు వారితో కలిసి పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటారు. ఈ విందుల కోసం వృద్ధురాలయిన కార్టర్ భార్య స్వయంగా యోగర్త్ తయారుచేసి వడ్డిస్తుంది. అప్పుడప్పుడూ బయటకు వెళ్లి చౌకగా వస్తువులు దొరికే డాలర్ స్టోర్ లో షాపింగ్ చేస్తుంటారు. ఒకప్పుడు ఎయిర్ ఫోర్స్ వన్ వంటి ప్రెసిడెంట్ ప్రత్యేక విమానంలో దర్జాగా తిరిగిన కార్టర్ దంపతులు ఇప్పుడు అవసరం పడ్డప్పుడు సాధారణ కమ్మర్షియల్ విమానాల్లో ప్రయాణిస్తుంటారు అంటే ఒక పట్టాన నమ్మలేం.
జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్.
జీవించి వున్న అమెరికన్ అధ్యక్షులు అందరిలోకి పెద్దవాడు. శ్వేత సౌధంలో అధ్యక్షుడిగా వున్నది నాలుగేళ్లయినా దాన్ని వదిలి పెట్టి వెళ్ళే నాటికి సొంత నివాసం అంటూ లేదు. పదవీ విరమణ చేసి వైట్ హౌస్ నుంచి బయటకు రాగానే బుష్ తాత్కాలికంగా కొంతకాలం తన స్నేహితుడి ఇంట్లో వున్నారు. తరువాత ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయారు. విచిత్రం ఏమిటంటే ఈ సీనియర్ బుష్ కుమారుడు జార్జ్ బుష్ కూడా తదనంతర కాలంలో అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఇలా తండ్రీ కొడుకులు అమెరికా అధ్యక్షులు కావడం అన్నది ఇది రెండో సారి. గతంలో జాన్ ఆడమ్స్, ఆయన కుమారుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ కూడా అధ్యక్షులుగా శ్వేత సౌధంలో పనిచేసారు.
ఏళ్ళు మీద పడ్డా సీనియర్ బుష్ మానసికంగా చాలా చురుకు. తన తొంభయ్యవ జన్మదినం నాడు హెలికాప్టర్ లో ఆకాశం లోకి వెళ్లి, అక్కడనుంచి పేరాచ్యూట్ సాయంతో స్కై డైవింగ్ చేశారంటే బుష్ మహాశయుల ధైర్యసాహసాలు ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు.

Image may contain: 4 people, people smiling, people standing and suit

Photo Courtesy: Image Owner

8 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న ఎమెల్యే లు
2009 నుండీ ఉన్నారు.వారికే మళ్ళీ ఈసారి కూడా టికెట్స్ ఇచ్చారు. ఏ వ్యక్తి అయినా ఒక పది సంవత్సరాలు మాత్రమే దీక్షగా పనిచేయగలడు.

(ఏ మనిషికైనా శుక్ర దశ కూడా 20 సంవత్సరాలే ఉంటుంది. శుక్ర దశలో కూడా అంతా మంచే జరగదు.)
ఒక మనిషి పది సంవత్సరాలు మించి పదవిలో ఉండడం ఆ దేశానికి/రాష్ట్రానికి అనవసరం.
దేశం/రాష్ట్రం గురించి ఎవరాలోచిస్తారు ?

Chiru Dreams చెప్పారు...

పైకి ప్రజాస్వామ్యం పూత పూసుకున్న రాజరికం

అజ్ఞాత చెప్పారు...

@Niharika , aithe modiki inko chance ivvalaa ?

:venkat

నీహారిక చెప్పారు...

రామజన్మభూమి తీర్పు ఎన్నికలకు అడ్డుకాకపోతే మోడీ మళ్ళీ పీ ఎం అవుతారు. కేసీఆర్ గారు కూడా గ్యారెంటీగా సీ ఎం అవుతారు. ఆంధ్రాలో ఎలాగూ చంద్రబాబు నాయుడిగారి అవసరం ఉంది.

प्रवीण చెప్పారు...

మోదీ గాణ్ణి నమ్మితే వామనావతారాన్ని నమ్మినట్టే. నేను చేసేది వ్యవసాయం. మోదీ గాడి వల్ల డీజిల్ రేట్లు నిరంతరం పెరుగుతూ పోతే ట్రాక్టర్ అద్దెలు ఏటేటా పెరుగుతూ పోతాయి. అప్పుడు నేను పశువుల కాపరిగా మారాల్సి వస్తుంది.

సూర్య చెప్పారు...

ఒక వ్యక్తి ఇతరులను సంబోధించే విధానం ఆ వ్యక్తి పరిణతి ని సూచిస్తుంది.

प्रवीण చెప్పారు...

ఉద్యోగి ఇష్టం లేకపోయినా బాస్‌ని మీరు, గారు అనే అంటాడు. మోదీని అలా గౌరవించాల్సిన అవసరం నాకేమిటి?

సూర్య చెప్పారు...

హహహ మాంచి కామెడీ!