21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

జైలిల్లు


ఈమధ్య ఓ రెన్నెళ్ల నుంచి ఇంటిపట్టునే వుండాల్సిన పరిస్తితి.
అనుభవానికి వస్తే కాని అర్ధం కాదంటారు. నిజమే.

వంటింటి కుందేళ్ళుగా వుండే ఆడవాళ్ళు 'ఇంటి బందిఖానాని' ఏళ్లకు ఏళ్ళు యెలా భరిస్తూ వస్తున్నారో కదా!     

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

emaina mee profile msg maarchandi,
mahaa soodigaa vundi.
chadavalekapotunnam.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - మీ సూచనకు ధన్యవాదాలు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ అజ్ఞాత- అంతా పారదర్శకంగా వుండాలని కోరుకునే ఈ రోజుల్లో ఇంకా ఈ 'అజ్ఞాత' పేరుతొ వ్యాఖ్యలు రాయడం ఎమిటో అర్ధం కాని విషయం. అమ్మానాన్న చక్కగా పెట్టిన పేర్లు దాచిపెట్టి 'ఆకాశరామన్న' తరహాలో కామెంట్లు రాయడం వల్ల ఏదో దాచాలన్న ఉద్దేశ్యమే ఎక్కువగా కనబడుతుంది. అయినా సదుద్దేశ్యంతోనే రాశారనుకుని ఈ అజ్ఞాత పాఠకుడికి సమాధానం ఇస్తున్నాను. పూర్వం అంటే ఓ ముప్పయ్యేళ్ళక్రితం ఒక రేడియో శ్రోత పనికట్టుకుని మా ఆఫీసుకు ఫోను చేసి ఈ చద్ది వార్తలు తప్ప ప్రసారం చేయడానికి మీకు కొత్త వార్తలు ఏమీ దొరకలేదా వినలేక చస్తున్నాము' అన్నాడు.ఇంతమాత్రానికే చావులు బతుకులు ఎందుకని మనసులోనే అనుకుని, పరిష్కారం మీ చేతిలోనే వుంది కదా'అనాను. ఏమిటి అన్నాడు మరింత కోపంగా. మీ రేడియో మీట వెనక్కి తిప్పితే వినే గోల తప్పిపోతుంది కదా!' అంటే ఆయన భళ్ళున నవ్వేసి తదనంతర కాలంలో మంచి మిత్ర శ్రోతగా మారిపోయాడు.కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఈ పాడులోకంలో బతకడానికి అవసరం. ఏమంటారు?