2, నవంబర్ 2011, బుధవారం

కాశ్మీర్ జోక్




కాశ్మీర్ జోక్
ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి ప్రసంగిస్తున్నాడు.
కాశ్మీర్ అంశంపై మాట్లాడడానికి ముందు భారత  పౌరాణిక ఇతిహాసంలోని  ఒక ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. పూర్వకాలంలో కాశ్యప మహర్షి అనే దేవముని వుండేవాడు. ఆయన పేరు మీదనే కాశ్మీర్ కు ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆయన కాశ్మీర్ లో  సంచారం చేస్తుండగా ఒక చోట ఆయన పాదం ఓ బండ రాతికి తగిలింది. వెంటనే ఆ రాతినుంచి జలధార వెలువడి అక్కడ ఒక నీటి కొలను ఏర్పడింది. ఆ తటాకంలో స్నానం చేసి అనుష్టానాలు తీర్చుకోవాలనుకున్న కశ్యప ముని తన వొంటిపై వున్న నార  వస్త్రాలను గట్టున పెట్టి నీటిలోకి దిగాడు. స్నానం ముగించుకుని వొడ్డుకు చేరేసరికి అక్కడ వొదిలి వెళ్ళిన వస్త్రాలు కనిపించలేదు. ఒక పాకీస్తానీ జాతీయుడు కశ్యప ముని వస్త్రాలను అపహరించుకు పోయాడు....”
భారత ప్రతినిధి ప్రసంగానికి పాక్ ప్రతినిధి అడ్డుతగిలాడు.
“ అంత పురాతన కాలంలో పాకిస్తాన్ అన్నదే లేదు. ఇక మా జాతీయుడొకరు ముని వస్త్రాలను దొంగిలించాడని చెప్పడం భారత వాదనలోని డొల్లతనాన్ని సూచిస్తోంది.”
“అదే నేను కూడా చెబుతున్నాను. కాశ్మీర్ భారత దేశంలో ఎప్పటినుంచో అంతర్భాగం అన్న విషయాన్ని పాక్ ప్రతినిధి కూడా తెలిసో తెలియకో ఇప్పుడు అంగీకరించారు.”
ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ చర్చను ఆలకిస్తున్న మిగిలిన దేశాలవాళ్ళు భారత ప్రతినిధి చేసిన ముగింపు  వ్యాఖ్యకు ఒక్కసారిగా గొల్లుమన్నారని వేరే చెప్పనక్కరలేదు.
తోక: నెట్లో కనబడ్డ ఓ ఇంగ్లీష్ జోక్ కు ఇది తెలుగు అనువాదమని నేను కూడా వేరే రాయనక్కరలేదు (02-11-2011) 

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అప్పటికి పాకిస్తాన్ లేదు కాబట్టి ఇప్పుడు కూడా లేనట్టా? కాదు కదా. జోక్ నాకు అర్ధం కాలేదు/ జోక్ లా అనిపించలేదు.

Murthy Ravi చెప్పారు...

అప్పటికి పాకిస్తాన్ లేదు కాబట్టి ఇప్పుడు కూడా లేనట్టా? కాదు కదా. జోక్ నాకు అర్ధం కాలేదు/ జోక్ లా అనిపించలేదు.
-moorthi.rln

అజ్ఞాత చెప్పారు...

:)) బాగుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Murthy Ravi - ఇంగ్లీషులో చదివినప్పుడు నాకూ అలాగే అనిపించింది.నిజానికి ఇది జోక్ కాదు. రిపార్టీ (REPARTEE)అనవచ్చేమో. అలా అనుకుని చదివిచూడండి- భండారు శ్రీనివాసరావు

చదువరి చెప్పారు...

:) బావుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@తుమ్మల శిరీష్ కుమార్ - ధన్యవాదాలు