3, అక్టోబర్ 2011, సోమవారం

సేకరించిన ‘శ్రీ’ సూక్తాలు – భండారు శ్రీనివాసరావు





‘శ్రీకరా! అంటే ఒట్టు – సూకరా అంటే తిట్టు – అన్నాడు మహాకవి’


‘తొక్కితే రాయి – మొక్కితే సాయి’


‘శాస్త్రం – చట్టం ఒప్పుకుంటే దొంగే దొర’


‘రాజకీయం అంటే వారసత్వం కాదు పౌరసత్వం’


‘పిసినారిని మించిన దాత లేడు’


‘కొత్త తరాన్ని కొత్త రక్తాన్ని ఆహ్వానించ లేనివాళ్ళు పాత మోడల్ కారు మాదిరిగా మిగిలిపోతారు.’


‘భక్తులందు వీ.ఐ.పీ. భక్తులు వేరయా అన్నాడు వేమన్న’


‘ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు - కానీ, ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా అనే డౌటు.


‘కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపెడుతుంది. నిజమే! కానీ టైం కు కూడా టైం ఇవ్వకపోతే పాపం టైం మాత్రం ఏం చేస్తుంది?’


‘చిన్న దొంగలు జిల్లాలో జైళ్ళలో మగ్గుతుంటారు. పెద్ద దొంగలు జనం మధ్యే దొరల్లా తిరుగుతుంటారు’


‘విన్నది మరచిపోతాము. చూసింది గుర్తుంటుంది. చెయ్యడం వల్ల విషయం బోధపడుతుంది.’


‘నాలికతో ఎలా మాట్లాడాలో తెలియడానికి మనిషికి మూడేళ్ళు పడుతుంది. కానీ దాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా సరిగ్గా వాడుకోవాలో తెలియడానికి జేవితకాలం కూడా సరిపోకపోవచ్చు’

(03-10-2011)





7 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

‘నాలికతో ఎలా మాట్లాడాలో తెలియడానికి మనిషికి మూడేళ్ళు పడుతుంది. కానీ దాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా సరిగ్గా వాడుకోవాలో తెలియడానికి జేవితకాలం కూడా సరిపోకపోవచ్చు’
____________________
This is the best.

Praveen Mandangi చెప్పారు...

>>>>>
‘తొక్కితే రాయి – మొక్కితే సాయి’
>>>>>
సన్యాసి దగ్గర రాగి చెంబులో ఉంటే తీర్థం, ఇంటిలోని ఇత్తడి చెంబులో ఉంటే కొబ్బరి నీళ్ళు.

Praveen Mandangi చెప్పారు...

ఇలాగే చాలా ఉన్నాయి. ఉదాహరణకి "ఇంటిలో చేస్తే లడ్డూ, గుడిలో చేస్తే ప్రసాదం".

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Rao S Lakkaraju,and @ PraveenSarma - సంతోషం - మంచి మాటలెప్పుడు కూడా సార్వజనీకాలు. మంచి నీటి చెలమలో వూటలాగా తోడినకొద్దీ బయటకు వస్తాయి. ఇవేవీ ఎవరి సొంతం కాదు. అందుకే 'సేకరించిన శ్రీ సూక్తాలు' అని ముందే పేర్కొన్నాను - భండారు శ్రీనివాసరావు

Praveen Mandangi చెప్పారు...

నిజమే, ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఆ రాగి చెంబులో ఉన్నవి కొబ్బరి నీళ్ళు అని తెలిసి, తీర్థం అనుకుని తాగేసి, సన్యాసి హుండీలో డబ్బులు వేసే వాళ్ళని చూస్తే జాలి వెయ్యదా? లడ్డూని ఏ స్వీట్ షాప్‌లోనో కొనుక్కోకుండా తిరుపతికో, శ్రీశైలానికో వెళ్ళేవాళ్ళని చూస్తే ఇదేమి చాదస్తం అనిపించదా? సున్నపు రంగు పూసిన సాయిబాబా విగ్రహానికి రంగు ఊడితే సాయిబాబా విగ్రహం నుంచి విభూతి రాలిందనుకునేవాళ్ళని చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థమవుతుందా? అందుకే మీరు ‘తొక్కితే రాయి – మొక్కితే సాయి’ అన్నప్పుడు పై సమాధానాలు వ్రాసాను.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@praveen sarma - అందుకే నమ్మకం ముఖ్యం. దేన్నయినా అమ్మించాలన్నా, ఏ విషయాన్నయినా నమ్మించాలన్నా నమ్మకమే ప్రధానంగా పనిచేస్తుంది.నమ్మి చెడిన వాళ్లు లేరు. నమ్మించి చెడగొట్టనివాళ్లు లేరు.మంచికీ చెడుకూ అడ్డగీత ఇక్కడే.-భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

/నీటి చెలమలో వూటలాగా తోడినకొద్దీ బయటకు వస్తాయి. ఇవేవీ ఎవరి సొంతం కాదు./
బాగ చెప్పారు. ముక్కోడి నోట్లోంచి బూతుల్లాగా... :)) :P