ఓరి భగవంతుడా ! – భండారు శ్రీనివాసరావు
దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.
వున్నాడని నమ్మేవాళ్ళంటారు.
దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు. నాకయితే ఇద్దరూ కరక్టే అనిపిస్తుంది.
దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు. వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, నమ్మకం లేని ఆ భగవంతుడూ నమ్మని వీళ్ళను కనుక్కోడు. నమ్మిన ఆ దేవుడూ నమ్మేవాళ్లను పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.
దేవుడున్నాడో లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.
తొక్కితే రాయి – మొక్కితే సాయి. అంతా నమ్మకం.
దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.
దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు వారు నాస్తికులయినా సరే భగవంతుడనే సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు ‘కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవ దేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.
దేవుడ్ని నమ్మని గోరాగారు ‘దేవుడు లేదు’ అనేవాడు. ‘లేదు’ ఏమిటండి ‘లేడు’ అనాలిగా అంటే ‘అసలు లేని వాడు పుంలింగం అయితే ఏమిటి స్త్రీ లింగం అయితే ఏమిట’ని ఎదురు ప్రశ్న వేసేవారు. ఆయన వ్యక్తిత్వశోభ ముందు అలా చెల్లిపోయింది. కాకపోతే ఇప్పుడు బెజవాడ నాస్తిక కేంద్రం వారికి గోరానే దేవుడు. ఆ మాటకొస్తే దేవుళ్ళందరూ ఇలా అవతరించిన వాళ్ళేనేమో. వాళ్ల వాళ్ల కాలంలో తమ గుణగణాలచేత విఖ్యాతులయిన వాళ్లు తదనంతర కాలంలో దేవుళ్ళుగా కొలవబడ్డారేమో.
దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ).
‘నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటాన’ని ఎంత మొత్తుకున్నా వినే దెవరు? ‘చెట్టులో,పుట్టలో అంతటా నేనే’ అన్నా విన్నదెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.
మా చిన్నప్పుడు వంటింట్లో గోడమీద ఎర్రగా ఓ చదరంలో వేంకటేశ్వర స్వామి నామాలు వుండేవి. అదే అందరికీ పూజాగృహం. స్నానం చేసిన తరువాత అక్కడ నిలబడి ఓ దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడో! ‘పూజ రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.
పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!
దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.
నమ్మని వాళ్లు అదేదో సమాజసేవ అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమపని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం తగ్గిపోతుంది.
సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు.
(07- 09- 2011)
(ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత)

8 కామెంట్‌లు:
సార్! మీరు చెప్పిన దాంట్లో కొంత క్లారిటీ లోపించిందేమో అనిపించింది.
నాస్తికులు పనిగట్టుకుని దైవదూషణ చేయడం నేనైతే ఎక్కడా చూడ లేదు. వారు కేవలం దేవుని పేరుతో వ్యాప్తిలోకి తెచ్చే మూఢనమ్మకాలను, మోసాలను, నేరాలను, ఇంకా చెప్పాలంటే దేవుడి పేరు చెప్పి మసీదుల్లో, చర్చీల్లో, గుళ్ళల్లో లౌడ్ స్పీకర్లుపెట్టి చేసే శబ్దకాలుష్యం లాంటి వాటిని మాత్రమే విమర్శిస్తారు. కాకపోతే "దేవుడు లేడ"నే తమ వాదాన్ని కూడా ప్రకటిస్తారు. అది దైవదూషణ అనుకొంటే తప్ప వేరే దైవదూషణ ఏదీ చేసినట్టు కనపడదు.
కాకపోతే కొంతమంది వీర-అస్తికులు మటుకు దైవ దూషణ చేయడం పరిపాటే. ఒక మతంవారు మరో మతం వారి దైవాలను దూషించడం, లేదా తప్పుగా వ్రాయడం, చిత్రించడం, వీలైతే ధ్వంసం చేయడం మాత్రం అక్కడక్కడా కనపడుతుంది.
హరి గారికి - మీ వ్యాఖ్య చూసిన తరువాత నా వ్యాసాన్ని మరోసారి సరిచూసుకున్నాను. నాస్తికులు దైవ దూషణ చేస్తున్నారని నేను ఎక్కడా రాయలేదు.శబ్ద కాలుష్యం అన్న పదం కూడా టీవీ చర్చలు గురించి ప్రస్తావిస్తూ వాడినదే.నా ఉద్దేశ్యం దేవుడున్నాడా లేదా అన్నది కాదు ఇవ్వాళ కావాల్సింది.ఆయన్ని ఆయన మానాన వొదిలేసి ఇంకా అవసరమయిన అంశాల పట్ల దృష్టి సారించమని చెప్పడమే నా మనసులోని మాట.నేను కమ్యూనిస్ట్ రష్యాలో వున్నప్పుడు మతం మత్తుమందు అని మతాల ఆనవాళ్ళు కూడా లేకుండా పేర్లు సైతం మార్చివేసారు. డెబ్బయ్ ఏళ్ళు అలా గడచినా తరువాత ఆ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది.బీదాబిక్కీ అంతా అనుకు బాధ పది వుంటారు. కానీ ఇప్పుడేమి జరిగింది. భూమి గుండ్రం అన్నట్టు అంతా వెనకటి మాదిరిగానే.ఏడు దశాబ్దాల ఘన చరిత్రను,లేని వాళ్ల రాజ్యాన్ని వాళ్ల చరిత్ర పుటల్లో నుంచి తీసివేసారు.దేవుడ్ని, మతాన్ని వ్యక్తిగత వ్యవహారంగా చూస్తే ఇన్ని సమస్యలు వుండవని కవి హృదయం. - భండారు శ్రీనివాసరావు
భండారు శ్రీనివాసరావు గారు,
"నమ్మని వాళ్లు అదేదో సమాజసేవ అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు." అన్న వ్యాఖ్య చూసి అలా రాశాను.
సమాధానానికి ధన్యవాదాలు.
భండారు గారు,
మీవ్యాసంలో మీరు చెప్పిన కొన్ని విషయాల్లో నేణు మీతో విభేదిస్తున్నాను.
- నాస్తికులంటే దేవుడు లేడని నమ్మేవారుకారు, దేవుడు అనే కాన్సెప్ట్‌పై నమ్మకం లేనివారు. ఒక విషయంపై నమ్మకం లేకపోవడం ఒక నమ్మకం కాదు.
- దేవుడు లేడు అని చెబుతూ డబ్బులు దండుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? దేవుడు లేడు అని చెప్పేవారు మరో ఇతర మార్గంద్వారా డబ్బులు దండుకుంటుంటే అది నాస్తికత్వం తప్పు కాదు కదా.
- దేవుడిపై చర్చ చెయ్యడం దేవుడి పేరు చెప్పి మోసం చేసేంత ప్రమాదకరం ఎంతమాత్రం కాదు. అసలు అది తప్పయితే నాస్తికత్వంపై చర్చ కూడా తప్పేకదా?
- దేవుడిపై నమ్మకం సమస్య కాదు, దేవుడి పేరుచెప్పి దోచుకోవడం మాత్రం సమస్యేకదా? అక్రమ లసెన్సుల ద్వారా గనులను దోచుకోవడానికీ నేణు దేవున్ని అని చెప్పి దోచుకోవడానికీ పెద్ద తేడా ఏముంది? మన దేశంలో నాస్తికులు ఎవరు అభ్యంతరాలు లేవదీసినా ఇలాంటి దోచుకోవడంపైనే కదా (కమ్యూనిస్టుదేశాల సంగతి వదిలేస్తే).
>>నమ్మని వాళ్లు అదేదో సమాజసేవ అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు.
దేవుళ్ళ మీద ఒంటికాలి పై లేస్తే పర్వాలేదు మాష్టారు కానీ నాస్తికవాదం/హేతువాదం పేరుతో దేవుడిని నమ్మేవాళ్ళను sub human లుగా ట్రీట్ చేస్తారు. సమస్య అక్కడే మొదలుతుంది.. ఏథిజం నుంచీ ఫాసిజం కు చాలా సులువుగా గోడదూకుంతుంటారు. ఇలాంటి వాళ్ళు మతం ఒక మత్తు మందు అంటే కామెడీగా ఉంటుంది.
@హరి,సత్యాన్వేషి,కార్తిక్ - అందరికీ ధన్యవాదాలు.హేతువాదులనీ,నాస్తికులనీ వేరు చేసి చూడకపోవడం వల్ల వస్తున్న అపోహలు ఇవి. నాస్తికులు,ఆస్తికులు రెండు భిన్న ధ్రువాలు.కలపాలని ప్రయత్నించడం వృధా.ఈ చర్చ అనంతమని కూడా రాశాను.నా ఉద్దేశ్యం జనాలను జాగ్రుత పరచవలసిన అంశాలు ఇంకా చాలవున్నాయని.- భండారు శ్రీనివాసరావు
"ఏథిజం నుంచీ ఫాసిజం కు చాలా సులువుగా గోడదూకుంతుంటారు. "
ఆహా, ఏమి చెప్పావన్నా, టోపీలు తీసితిమి :-)
@Kumar N -ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
కామెంట్‌ను పోస్ట్ చేయండి