7, ఆగస్టు 2011, ఆదివారం

గాయత్రి మంత్రం - భండారు శ్రీనివాసరావు


గాయత్రి మంత్రం - భండారు శ్రీనివాసరావు   

(గాయత్రీ మంత్ర ప్రాశస్త్యం గురించి గతంలో సేకరించి అందించిన సమాచారం పట్ల చాలామంది పాఠకులు సహృదయంతో స్పందించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరికొన్ని అదనపు వివరాలు, విశేషాలు వెల్లడించే ప్రయత్నంలో భాగమే ఇది. మరో విషయం. ఈ రోజు ఆగస్టు ఏడో తేదీ నా 66 వ పుట్టినరోజు. పుణ్యం పురుషార్ధంగా భావించి ఈ అంశం ఎన్నుకున్నాను. ఎక్కడయినా ముద్రారాక్షసాలు కనబడితే  దయచేసి నన్ను క్షమించకండి.)

గాయత్రి మంత్రము.

ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

ప్రప్రధమంగా ఋగ్వేదంలో పేర్కొన్న ఈ పవిత్ర మంత్రం ఒక్కో దేవత పేరుతొ ఒక్కోరకంగా ప్రవచించబడింది.

దేవతలు – గాయత్రీ మంత్రాలు



1. అగ్ని గాయత్రి : ఓం మహా జ్వాలాయ విద్మహే

అగ్ని దేవాయ ధీమహి తన్నో అగ్ని: ప్రచోదయాత్

2. ఇంద్ర గాయత్రి : ఓం సహస్ర నేత్రాయ విద్మహే

వజ్ర హస్తాయ ధీమహి తన్నో ఇంద్ర: ప్రచోదయాత్

3. కామ గాయత్రి: ఓం కామదేవాయ విద్మహే

పుష్పబాణాయ ధీమహి తన్నోనంగ: ప్రచోదయాత్

4. కృష్ణ గాయత్రి : ఓం దేవకీ నందనాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ: ప్రచోదయాత్

5. గణేశ గాయత్రి : ఓం ఏకదంష్ట్రాయ విద్మహే

వక్రతుండాయ ధీమహి తన్నో దంతి: ప్రచోదయాత్

6. గురు గాయత్రి : ఓం సురాచార్యాయ విద్మహే

వాచాస్పత్యాయ ధీమహి తన్నో గురు: ప్రచోదయాత్

7. చంద్ర గాయత్రి : ఓం క్షీర పుత్రాయ విద్మహే

అమృతతత్వాయ ధీమహి తన్నోశ్చంద్ర: ప్రచోదయాత్

8. తులసీ గాయత్రి : ఓం శ్రీ తులస్యై విద్మహే

విష్ణు ప్రియాయై ధీమహి తన్నో బృందా: ప్రచోదయాత్

9. దుర్గా గాయత్రి : ఓం గిరిజాయై విద్మహే

శివ ప్రియాయై ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్

10. నారాయణ గాయత్రి : ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణః ప్రచోదయాత్

11. నృసింహ గాయత్రి : ఓం ఉగ్ర నృసింహాయ విద్మహే

వజ్ర నఖాయ ధీమహి తన్నో నృసింహ: ప్రచోదయాత్

12. పృధ్వీ గాయత్రి : ఓం పృధ్వీదేవ్యై విద్మహే

సహస్రమూర్త్యై ధీమహి తన్నో పృధ్వీ ప్రచోదయాత్

13. బ్రహ్మ గాయత్రి : ఓం చతుర్ముఖాయ విద్మహే

హంసారూడాయ ధీమహి తన్నో బ్రహ్మ: ప్రచోదయాత్

14. యమ గాయత్రి : ఓం సూర్యపుత్రాయ విద్మహే

మహాకాలాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్

15. రాధా గాయత్రి : ఓం వృష భానుజాయై విద్మహే

కృష్ణ ప్రియాయై ధీమహి తన్నో రాధా ప్రచోదయాత్

16. రామ గాయత్రి : ఓం దాశరధాయ విద్మహే

సీతావల్లభాయ ధీమహి తన్నో రామ: ప్రచోదయాత్

17. లక్ష్మీ గాయత్రి : ఓం మహాలక్ష్మేచ విద్మహే

విష్ణు ప్రియాయై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్

18. వరుణ గాయత్రి : ఓం జలబింబాయ విద్మహే

నీల పురుషాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్

19. విష్ణు గాయత్రి : ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు: ప్రచోదయాత్

20. శని గాయత్రి : ఓం కాకధ్వజాయ విద్మహే

ఖడ్గ హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్

21. శివ గాయత్రి : ఓం పంచవక్త్రాయ విద్మహే

మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్

22. సరస్వతీ గాయత్రి : ఓం సరస్వత్యై విద్మహే

బ్రహ్మ పుత్ర్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్

23. సీతా గాయత్రి : ఓం జనక నందిన్యై విద్మహే

భూమిజాయై ధీమహి తన్నో సీతా: ప్రచోదయాత్

24. సూర్య గాయత్రి : ఓం భాస్కరాయ విద్మహే

దివాకరాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్

25. హనుమద్గాయత్రి : ఓం అంజనీ సుతాయ విద్మహే

వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి: ప్రచోదయాత్

26. హయగ్రీవ గాయత్రి : ఓం వాగీశ్వరాయ విద్మహే

హయగ్రీవాయ ధీమహి తన్నో హయగ్రీవః ప్రచోదయాత్

27.హంస గాయత్రి : ఓం పరమహంసాయ విద్మహే

మహాహాంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్

(గాయత్రి గురించి ఋషిపుంగవుల ప్రశంసలు మరో సారి)

(07-08-2011)

8 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

మీ పుట్టిన రోజు సందర్భంగా శుభాభినందనలు.

సో మా ర్క చెప్పారు...

భండారు శ్రీనివాస రావు గారికి జన్మ దిన శుభాకాంక్షలు మరియు పుట్టిన రోజున పంచిన ఆధ్యాత్మిక విందుకు కూడా ధన్యవాదాలు.అక్కడక్కడ ఋక్ స్వరాల్లో ఇబ్బంది వినిపిస్తోంది అని నా అనుమానం.మధ్యలో కొన్ని అక్షరాలు తప్పినట్లుగా గమనించాను.సరి చూడకోరతాను.
మీ వాడు,
అర్క సోమయాజి.

Rao S Lakkaraju చెప్పారు...

శ్రీనివాసరావు గారూ హ్యాపీ బర్త్ డే.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శివరామప్రసాదు కప్పగంతు - ధన్యవాదాలు ప్రసాద్ గారు - భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సోమార్క - అందుకే ముందుగానే మనవి చేసుకున్నాను, ముద్రారాక్షసాలు వుంటే మొహమాటకుండా 'క్షమించవద్దని'. మీ శుభకామనలకు నా ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@రావు ఎస్ లక్కరాజు - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

పూజ్యులు శ్రీనివాసరావు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సోమార్క - నిజమే 'బ్రహ్మ గాయత్రి' లో 'హంస రూడాయ' అనే పదంలో 'డా' కు వొత్తు వుండాలి.ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు