17, డిసెంబర్ 2010, శుక్రవారం

నమ్మకం - భండారు శ్రీనివాసరావు

నమ్మకం - భండారు శ్రీనివాసరావు 


ఆ మెయిన్ రోడ్డు తిన్నగా పొతే మా మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు తిరిగే చోట మరో రోడ్డు పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. ఆ దోవన వచ్చే వాహనదారులు ఆ రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, మెయిన్ రోడ్డులో వేరే వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధ్రువ పరచుకుని కానీ ఆ రోడ్డులోకి ప్రవేశించేవారు కారు.అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కు అలవాటు పడివున్న నాకు మాత్రం ఆ వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో అన్న భీతి పీడిస్తూ వుండేది. “ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా!” అనేవాడిని మావాడితో.

“నమ్మకం” అనేవాడు మా వాడు స్తిరంగా.

“అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో అక్కడ మీరలా ఆచి తూచి నడుపుతున్నారు. ఏదయినా అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ నడుపుతోంది నమ్మకమే!” అన్నాడు అమెరికాలో పదేళ్ళ నుంచి వుంటున్న మా వాడు మరింత నమ్మకంగా.

అమెరికన్లు ఒక పట్టాన ఎవరినీ నమ్మరంటారు. కానీ వారి జీవితాలన్నీ కేవలం ‘నమ్మకం’ ప్రాతిపదికపై నిశ్చింతగా నడిచిపోతున్నాయి.

చెక్కు ఇస్తే చెల్లుతుంది అన్న నమ్మకం.

వస్తువు కొంటే నాణ్యత వుంటుందన్న నమ్మకం, నచ్చని వస్తువును తిరిగి వాపసు చేయగలమన్న నమ్మకం,

కారు నడిపేటప్పుడు వెనుకనుంచో, పక్కనుంచో అడ్డదిడ్డంగా వేరే వాహనాలు దూసుకు రావన్న నమ్మకం,

ఫ్రీ వేస్ మినహాయిస్తే మిగిలిన రోడ్లను జీబ్రా క్రాసింగ్ ల వద్ద దాటేటప్పుడు ఎంతటి వేగంతో వచ్చే వాహనమయినా స్పీడు తగ్గించి కాలినడకనపోయేవారికి దోవ ఇస్తుందన్న నమ్మకం,

బహిరంగ ప్రదేశాలలలో పొరబాటున యెంత ఖరీదయిన వస్తువును మరచిపోయినా దాన్ని పరాయివారు పొరబాటున కూడా వేలేసి తాకరన్న నమ్మకం,
పలానా టైం కు వస్తామని చెబితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం,
అవతల వ్యక్తి ఏమిచెప్పినా అది మనల్ని మోసం చేయడానికే అన్న భావం ఏకోశానా వుండకూడదనే నమ్మకం-

ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.
ఇలాటి నమ్మకం ఏదయినా,
ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలము.

ఎందుకంటే – ఈ అరవై ఏళ్ళ పైచిలుకు స్వతంత్ర ప్రజాస్వామ్యం మనకిచ్చిందీ, మిగిల్చిందీ ఏమోకానీ ‘నమ్మకం’ అన్న పదాన్ని జీవితాల్లో కనబడకుండా చేసింది.

నాయకులు తమ అనుచరులనే నమ్మరు.
నీడలా వెన్నంటే వుంటూ, తందానా అనకముందే తాన అని అంటూ, ప్రతి చిన్న విషయంలో ఆహా ఓహో అని భజన చేసే కార్యకర్తలు – కడకంతా తమ వెంట వుండరన్న అపనమ్మకం నాయకులది.

అనుచరులు నాయకులని నమ్మరు.
తమ నాయకుడు ‘తన నాయకుడికి’ ఎలా పంగనామాలు పెట్టాడో అన్న వాస్తవానికి వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి. అవసరమయితే నిచ్చెన మెట్లెక్కినట్టు నాయకుడి తలపైనే కాలుమోపి పైమెట్టుకి ఎగబాకాలనే తాపత్రయం వారిది.

జనం ఈ కార్యకర్తలని నమ్మరు.
ఎందుకంటె తమపేరు చెప్పి వసూలు చేసే మొత్తంలో తమకు ముట్టినదెంతో అణాపైసలతో సహా వారికి లెక్కలు తెలుసు కాబట్టి.

జనాన్ని రాజకీయులు నమ్మరు.
ఎన్నికలు కాగానే మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వారితో పనేమిటన్నది వారి నమ్మకం.

ఇక మీడియా.
ఒక ఛానల్ ను మరో ఛానల్ నమ్మదు. అందుకే ఒకే వార్త రెండురకాలుగా కనిపిస్తుంది. వినిపిస్తుంది.
ఒక పత్రికను మరో పత్రిక నమ్మదు. ఒక పత్రికలో వచ్చిన వార్తను మరో పత్రిక వ్యాఖ్యాన సహితంగా ఏకిపారేస్తుంది.

ఇప్పుడు చెప్పండి!

నమ్మకం గురించి ఎవరయినా మాట్లాడినా,
నమ్మకస్తులు గురించి ప్రస్తావించినా
నమ్మొచ్చునంటారా?

(17-12-2010)

11 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Good comparison in he matter of believing between the societies of US and India.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అజ్ఞాత గారికి – నా రాతల పట్ల మీకున్న ‘నమ్మకానికి’ నా కృతజ్ఞతలు – భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

good one !

Rao S Lakkaraju చెప్పారు...

నమ్మకం మీద మీ వ్యాసం చాలా బాగుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

To A to Z dreams -many thanks-bhandaru srinivasrao

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

ధన్యవాదాలు లక్కరాజు గారు –భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

Loved the way you put it together.... but, sometimes i do wonder 'why???'... why the people here in US follow the rules by default and it's the other way around in our INDIA? In HYD I got honked at for stopping at red light :)
May be we should start teaching this 'following rules' culture to our kids at schools first...
My 6 year old (who goes to a public elementary school in US)spends more time learning 'classroom rules', 'student responsibilities', 'student rites', 'how to face bullying' etc., than the time he spends on all other subjects together :) Which would obviously be considered 'waste of time' in our schools.
On the other side.... people in India do enjoy lot of freedom... only that it's been misplaced by most of us.

-Madhu

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

Dear Sri madhu - thanks for your response.If you find time please go through this blog (kannantalo vinnantalo america- july to sep.2010) to read my experiences in america.regards-bhandaru srinivasrao

అజ్ఞాత చెప్పారు...

@ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.
ఇలాటి నమ్మకం ఏదయినా,
ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలము.
సార్..ఎవ్వడినీ నమ్మకూడదనీ నమ్మితే ని౦డా ములుగుతామన్నది...మన ప్రజల ప్రగాఢ నమ్మక౦...అనుభవాల్లో౦చి పుట్టుకు వచ్చి౦ది మరి...ప్రప౦చ౦లో ఇన్త చీటర్స్ మరెవరూ వు౦డరేమో...అడుగు తీసి అడుగు వేస్తే మాయ మన చుట్టూ...నాయకులే కాదు ప్రజలు కూడా దగుల్బాజీలుగా తయారయ్యారు..వారిని దగ్గరగా గమని౦చ౦డి..తెలూస్తూ౦ది

cbrao చెప్పారు...

అమెరికాలో భార్య పుట్టిన రోజు మరిస్తే! ఆ మరుసటి రోజు తనతో ఉంటుందో, ఉండదో, ఎప్పుడు విడాకులో అంతుబట్టదు. పుట్టిన రోజు మరిచినా భారతదేశం లో భార్య విడాకులివ్వదు. ఇది మన నమ్మకం.

అజ్ఞాత చెప్పారు...

@cbrao garooo...aardhika swaatantryam leka ikkadi aadaallu padi untunnaaru..okkasaari chuttoo pareekshagaa choodandi...enta mosam cheskuni DAAMPATYAALU gaduputunnaaro??