జర్నలిష్టులందరూ తమ వృత్తి అనుభవాలను గ్రంధస్తం చేస్తుండాలని మిత్రుడు దేవులపల్లి అమర్ చెబుతుంటారు.గ్రంధ ప్రచురణ అనేది సామాన్య జర్నలిష్టులకు అలవి కాని భారం. అయినప్పటికీ, అనుభవంలోకి వచ్చిన విషయాలను కనీసం కాగితం మీద పెట్టడం వరకు జరగాలన్నది నా అభిప్రాయం కూడా. అయినా సరే - ఇంచుమించు రెండు దశాబ్దాల క్రితం - మాస్కోలో గడిపివచ్చిన సుమారు ఐదేళ్ళ అనుభవాలను అక్షర బద్ధం చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఏకధ్రువ ప్రపంచ వ్యవస్తను ప్రశ్నిస్తూ- నూతన సామ్యవాద సిద్దాంతాలను ప్రవచిస్తూ - ఏడు దశాబ్దాలకు పైగా సాగిన మొట్టమొదటి 'సోవియట్ కమ్యూనిష్ట్ ప్రభుత్వ చరమాంకాన్ని కళ్ళారా చూడగలిగిన అరుదయిన అవకాశాన్ని ఆలంబనగా చేసుకుని - 'మార్పు చూసిన కళ్ళు' అనే పేరుతో ఆనాటి అనుభవాలను గుదిగుచ్చి గ్రంధస్తం చేయాలనే ప్రబలమయిన కాంక్షను ఎన్నో ఏళ్ళుగా అదిమిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి కారణాలు అనేకం. ఆనాడు నేను చూసింది మరో ప్రపంచం. అప్పటికీ ఇప్పటికీ యెంతో తేడా.
ఆ రోజుల్లో 'అలా వుండేది, యిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన 'స్వర్ణ యుగాలు' చరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే - ఆ నాటి నా అనుభవాలు కూడా. నేను కమ్యూనిష్టుని కాను. వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ ఏ రకమయిన రాజకీయ వాసనలను నేను వొంటబట్టించుకోలేదు. ఒక సామాన్యుడిగా అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలుమోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం' నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం. నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయిన, గౌరవ ప్రదమయిన, తృప్తికరమయిన రోజులు గడిపింది ఆ రోజుల్లోనే. వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా గోరంతను 'కొండంత' చేసి చెబుతున్నానేమో అని అనిపించకత ప్పదు. అందుకే 'మార్పు చూసిన కళ్ళు' అక్షరబద్ధం చేయడానికి ఇంతగా తటపటాయించాల్సి వచ్చింది.
అంతేకాదు. కాలం గడుస్తున్నకొద్దీ - గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా గుర్తుకురానంతగా మరపున పడడం సహజమయిన విషయం. తేదీలు, పేర్లూ స్పురణకు తెచ్చుకోవడం క్లిష్టంగా మారుతుంది. విషయానికి న్యాయం చేయలేక పోతున్నామేమో అన్న సంశయం మరింత వెనక్కి లాగుతుంది. ఏతా వాతా జరిగింది ఏళ్ళతరబడి కాలయాపన.
(దస్వి దానియా అంటే రష్యన్ లో మళ్ళీ కలుద్దాం)
(ఇంగువ తెచ్చిన తంటా- గురించి మరోసారి).
NOTE: All the images in this blog are copy righted to their respective owners.
(ఇంగువ తెచ్చిన తంటా- గురించి మరోసారి).
NOTE: All the images in this blog are copy righted to their respective owners.
2 కామెంట్‌లు:
ala nati mascow ki, eenati mascow ki vunna vyatyasam mee rachana valla teliyali....
asalenduku aa nati soviet russia pathana maindi?
aa nadu jeevanam ela undedi?
peristroyika,glssnost etuvanti phalithalni theesuka vachindi?
asalu ,manishiki istamoche vidhamga matlade swetcha kavala? leduniyantrana tho koodina jeevithanni sahisthada?
asale russians mandu bhayilantaru?
akkadi communist party card holders mana congress varilagane pravarthinche varantaru...ee prasnalaku vivarana istharani aasisthu. communisam poyindi, kani peda thanamu poledu...ramana_vnkt@yahoo.co.in
రమణ గారికి
ఇప్పటికి పదిహేడు భాగాలు పూర్తీ అయ్యాయి.నేను వున్న రోజుల్లో జన జీవనం ఎలావుండేది చెప్పడమే దీని ఉద్దేశ్యం.కమ్యూనిజం అక్కడ ఎందుకు విఫలమయింది అందరికీ తెలిసిందే.కాని ఒక గొప్ప వ్యవస్థ కుప్పకూలిపోయిన తరుణంలో అక్కడ వుండడం కేవలం యాదృచ్చికం.అంతటి మార్పు చూడగలిగాము కనుకనే 'మార్పు చూసిన కళ్ళు' అని పేరు పెట్టడం జరిగింది.నెమ్మది మీద అన్నీ వివరంగా రాయాలనే సంకల్పం. చూడాలి. ఏదిఏమయినా ఈ వ్యాసాలూ చదివి స్పందించి నందుకు కృతజ్ఞతలు.- భండారు శ్రీనివాసరావు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి