3, జనవరి 2019, గురువారం

News Talk Special Discussion With Mr. Bandaru Srinivasarao | 03-01-2019 ...





ప్రతి గురువారం మాదిరిగానే ఈరోజు ఉదయం స్నేహ టీవీ న్యూస్ టాక్  ముఖాముఖి చర్చాకార్యక్రమంలో.....

1, జనవరి 2019, మంగళవారం

ముగ్గురు మరాఠాలు ముగ్గురు మోడీలు-Bhandaru About Chandrababu | Modi | YS...

31, డిసెంబర్ 2018, సోమవారం

Debate on AP CM Chandrababu Naidu Comments on CM KCR | Morning Debate | ...





ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 TV ఛానల్ లో మార్నింగ్ డిబేట్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సురేష్ (టీడీపీ), శ్రీ రఘునాధబాబు (బీజేపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ (జనసేన), శ్రీ నారాయణ స్వామి (వైసీపీ). కార్యక్రమ నిర్వహణ: అశోక్

30, డిసెంబర్ 2018, ఆదివారం

Journalist Time Debate on CM KCR's Return Gift to Chandrababu Naidu | KC...





ఈరోజు ఆదివారం ఉదయం పది నుంచి పదకొండున్నర వరకు మహా న్యూస్ ఛానల్ లో అరవింద్ కొల్లి నిర్వహించిన 'జర్నలిస్ట్ టైం" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న ఇతర సీనియర్ జర్నలిస్టులు : శ్రీ విక్రం, శ్రీ సతీష్ కమల్, శ్రీ కే.ఎన్. మూర్తి, శ్రీ పాపారావు,

సీనియర్లకు మంత్రి పదవులు దూరమేనా? | News Scan With Vijay | 30th December...





ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 Channel Vijay's News Scan చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీమతి ఇందిరా శోభన్ (కాంగ్రెస్), శ్రీ దుర్గాప్రసాద్ (టీడీపీ), శ్రీ సీతారాం నాయక్ (టీఆర్ ఎస్. ఎంపీ)

29, డిసెంబర్ 2018, శనివారం

Discussion | KCR may Announce Telangana Cabinet Members and over Seperat...





ప్రతి శనివారంమాదిరిగానే ఈ ఉదయం  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ పవన్

28, డిసెంబర్ 2018, శుక్రవారం

పేరులో’నేముంది’

“ఆకాశవాణి, జీవన స్రవంతి, ప్రత్యేక వార్తలు, చదువుతున్నది భభండారు శ్రీనివాసరావు.....”
“ఇంటి పేరు అంతగా ఒత్తి పలకాలా ! భండారు అంటే సరిపోతుందిగా!’
నలభయ్ ఏళ్ళ క్రితం రేడియో సహోద్యోగి వ్యాఖ్య.
ఇన్నేళ్ళుగా పరిస్తితి ఏం మారినట్టు లేదు.
అదేమిటో నేనే కాదు చాలామందికి పేరు మీదే కాదు, ఇంటి పేరు మీద కూడా వల్లమాలిన మమకారం. బహుశా వ్యక్తిగత గుర్తింపుకు అది దగ్గరి దారి కావచ్చు. శ్రీనివాసరావులు చాలామంది వుండవచ్చు. భండారు శ్రీనివాసరావులు పెక్కురు వుండకపోవచ్చు. వుంటే ఎడ్వర్డ్ చక్రవర్తుల మాదిరిగా ఎడ్వర్డ్ వన్, టు అని తగిలించుకోవచ్చు.
ఇంతకీ నా ఘోష ఏమిటంటే నేను ప్రతి రోజూ వెళ్ళే టీవీల్లో కానీ, కదాచిత్ గా నా పేరు పడే పేపర్లలో కానీ ఏనాడూ నా పేరును చిత్రవధ చేయకుండా ఒదిలిన దాఖలా లేదు. బందరు శ్రీనివాస్ అనీ, బండారు శ్రీనివాసరావనీ, బండారి శ్రీనివాస్ అనీ ఇలా పలురూపాల్లో నా పేరు దర్శనమిస్తూ వుంటుంది. కొండొకచో ఇందువల్ల కొన్ని తలనొప్పులు కూడా తప్పడం లేదు. నిరుడు ఒక పెద్ద మనిషి ఫోను చేసి వాళ్లకు తెలిసిన వాళ్ళ పిల్లవాడికి మా ఇంజినీరింగు కాలేజీలో సీటు ఇప్పించమని అడిగాడు. ‘నా కాలేజీ ఏమిటి’ అని అడిగితే ‘భలేవారే ప్రతి రోడ్డు మీదా మీ కాలేజీ బస్సులు కనబడుతుంటే మీరు భలే జోకులు వేస్తారే’ అన్నాడు.
అప్పటి నుంచి రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఇంజినీరింగ్ కాలేజీ బస్సును కనిపెట్టి చూడడం మొదలు పెట్టాను. చివరికది దొరికింది. దానిమీద “బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కాలేజి’ అని రాసి వుంది.
అదట్లా వుంచితే.....
ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమం గురించి పత్రికల్లో వచ్చింది.
నాఇంటిపేరు ‘షరా మామూలే’ - బండారు అనే వేశారు.
ఏమిచెప్పుదు సంజయా!


Image may contain: one or more people and text